జైపూర్ నూతన ఎస్సై గా భూమేష్… శాంతి భద్రతలపై ఫోకస్…

జైపూర్ నూతన ఎస్సై గా భూమేష్… శాంతి భద్రతలపై ఫోకస్

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రాధాన్యం

ప్రజల భద్రతే నా మొదటి బాధ్యత ఎస్సై భూమేష్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా భూమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.గంజాయి నియంత్రణ,ట్రాఫిక్ సమస్యల పరిష్కారం,మహిళలు,బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతానన్నారు.ప్రజలు పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలని,ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని వారు సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version