భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు.

భద్రాచలం
శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మరియు మహా పట్టాభిషేకం మహోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమకు అప్పగించిన పనులను సంబంధిత అధికారులు దిగ్విజయంగా పూర్తి చేసి తమకు కేటాయించిన విధులను పగడ్బందీగా నిర్వహించాలని

భద్రాచలం నేటి ధాత్రి

గురువారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం మరియు పట్టాభిషేకం మహోత్సవాలకు చేపట్టవలసిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సంబంధిత అధికారులతో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ జరుగు మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించడం జరిగిందని, ప్రతి సెక్టార్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు వీక్షించేందుకు భక్తుల పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు అన్నారు. గత సమావేశంలో జిల్లా కలెక్టర్ సూచించిన విధంగా ప్రత్యేక అధికారులు భక్తులు ఒక సెక్టార్ నుంచి వేరే సెక్టార్ కి వెళ్లకుండా పటిష్ట భారీకేట్లు ఏర్పాటు చేయాలని అలాగే భక్తులకు ఆన్లైన్ ద్వారా లాడ్జిలు బుక్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించడం జరిగిందని అదేవిధంగా ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయాలు చేపట్టాలని అన్నారు. సెక్టర్ లో విధుల నిర్వహణకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరుగుతుందని అలాగే ఇప్పటివరకు విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామని పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షణకు 25 జోన్లుగా విభజించడం జరిగినందున దానికి సంబంధించిన అధికారులను కూడా కేటాయించడం జరిగిందని అన్నారు. అలాగే వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా మంచినీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దాదాపు 200 మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని మంచినీటి సరఫరా పర్యవేక్షణకు 30 మంది మంచినీటి పరీక్షలు నిర్వహణకు 12 మంది సిబ్బందిని నియమించినందున ప్రతి సెక్టార్కు మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని అన్నారు. అలాగే వాహనాల పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యంగా అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలను ఎస్టీమ్ గిరీష్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని అలాగే రిస్కుటీములను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. భక్తులు గోదారిలోకి వెళ్లకుండా పటిష్ట భారీ తేలు ఏర్పాటుతోపాటు నాటు పడవలను గజయితగాళ్లను సిద్ధంగా ఉండేలా సంబంధిత అధికారులు చూసుకోవాలని, అలాగే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే స్వామివారు కళ్యాణ మండపానికి విచ్చేయుచున్నప్పుడు భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని అందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, వంతెన పై వాహనాలు ఆగిపోతే తక్షణమే తరలించేందుకు వీలుగా క్రేన్లను సిద్ధంగా ఉంచాలని, 24 గంటలు పని చేయు విధంగా అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 20 బెడ్లను సిద్ధంగా ఉండేటట్లు చూడాలని, అలాగే ఐసియు వార్డు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే కళ్యాణం పట్టాభిషేకం వీక్షించడానికి వచ్చే భక్తులకు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తలంబ్రాల పంపిణీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గతం కంటే ఈసారి ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి తలంబ్రాలు అందే విధంగా చూడాలని దేవస్థానం ఈవో కి ఆదేశించారు. భక్తులకు సమగ్ర సమరచారము అందించేందుకు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్ఓ కు ఆదేశించారు. సంబంధిత అధికారులు సీతారామచంద్రస్వామి కళ్యాణము మరియు పట్టాభిషేకము అయిపోయే వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కల్యాణ వేడుకలు విజయవంతం అవ్వడానికి కృషి చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రమాదేవి మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version