హన్మకొండ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి వినతి పత్రం
హనుమకొండ ,నేటిధాత్రి:
బిఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడాపాక రాజేందర్, ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్
స్వేరోస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… హన్మకొండ జిల్లా లోని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రవేట్ పాఠశాలలో ఎస్సి విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా 3 వ 5 వ తరగతి విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా ప్రవేట్ పాఠశాలలో అడ్మిషన్ అవకాశం కల్పించిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల అధికారులు. అట్టి ఎంపికైన బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాల కాలం నుండి నిధులు రాలేకపోవడంతో సంబంధిత ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు డ్రస్సులు పంపిన విషయంలో చొరవ తీసుకోవడం లేదు కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులు మంజూరు చేసి అర్హులైన ఎస్సీ విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరారు.