భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన యువజన కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడుగా బట్టు కరుణాకర్ 563 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బట్టు కరుణాకర్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా ప్రజలు, యువతీ యువకులు నా కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికి అదేవిధంగా నా మీద నమ్మకంతో నాకు ఓటేసినటువంటి యువకులకు రేపు రాబోయే రోజులలో కూడా మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చిన ఒక అన్నగా ఒక తమ్మునిగా మీ వెంట ఉండి మీ సమస్యలకు పరిష్కార మార్గంగా నేను ఉంటాను అని అన్నారు…అంతేకాకుండా దాదాపు 50 రోజులు జరిగినటువంటి ఎలక్షన్లో నాతో పాటు నాయకులు సంతన్న మరి నన్ను అభిమానించినటువంటి ప్రతి ఒక్క అన్నదమ్ములు ముక్త కంఠంతో కర్ణాకర్ గెలిస్తే యువకుల కోసం పోరాడుతాడనీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాడని నమ్మకంతో నన్ను గెలిపించారు.. ఇంతటి విజయానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు , ఐత ప్రకాష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవన్ అన్న కి భూపాలపల్లి లో ఉన్నటువంటి మా మహిళా సోదరులందరికి కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల అర్బన్ అధ్యక్షురాలు మాలతి
కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు శీను విజయ్ రమ్య తదితరులు పాల్గొన్నారు