· రేవంత్‌ను ఢీకొట్టే సత్తా ఒక్క బండి సంజయ్‌కి మాత్రమే సొంతం
· ఆయన నాయకత్వం వుంటే రెట్టింపు వార్డుల్లో విజయం సాధ్యమయ్యేది!
· ప్రత్యర్థికి బలం వున్న ప్రాంతాల్లో కూడా ఓట్లు రాబట్టే సామర్థ్యం
· హిందూత్వను బలంగా ముందుకు తీసుకెళ్లగలిగిన నేత
· కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగా నిలదీసిన నేత
· ప్రత్యర్థులు కూడా ఆయన సామర్థ్యాన్ని అంగీకరించ తప్పదు
· కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని మలచే చాతుర్యం
· రేవంత్ దూకుడుకు సరైన సమాధానం బండి సంజయ్
· కాంగ్రెస్ స్పీడును నిరోధించగల దిట్ట
· రాష్ట్ర బీజేపీకి దిక్సూచి కాగల సమర్థత బండి సంజయ్ సొంతం
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రస్తుతం కేంద్ర ీVAంశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్‌కుమార్ 1971, జులై11న జన్మించారు. తండ్రి నర్సయ్య, తల్లి శకుంతల. ఆయన తన సెకండరీ విద్యను 1986లో కరీంనగర్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో పూర్తిచేశారు. తన 12వ ఏటనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరి కార్యకర్తగా పనిచేశారు. తర్వాత ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. ఆవిధంగా ఆయన కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా త ర్వాత రాష్ట్ర కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా కొనసాగారు. అంతేకాదు పట్టణ కార్యదర్శి, అధ్యక్షుడు, కేరళకు జాతీయ కార్యదర్శిగా, తమిళనాడు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. 1996లో బీజేపీ వరిష్టనేత ఎల్.కె.అద్వాని నిర్వహించిన “సూరత్ రథయాత్ర” సందర్భంగా 35 రోజులపాటు దేశవ్యాప్తంగా పర్యటించారు.
2005లో బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ 48వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే వరకు కార్పొరేటర్‌గా కొనసాగారు. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీచేసినా బీఆరఎస్ నాయకుడు గంగుల కమలాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2025లో రాజన్న సిరిసిల్లా, గంభీరావుపేటలో ఐదుగురు రైతులు మానేరు వరదల్లో చిక్కుకున్నప్పుడు, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి హెలికాప్టర్లను తెప్పించి వారిని రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. 2023 ఏప్రిల్ నెలలో బండి సంజయ్‌పై పదోతరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ కేసు పెట్టి పోలీసులు జైలుకు తరలించారు.అయితే ఈ కేసులో ఆయనకు ఎటువంటి ప్రమేయం లేదంటూ 2025 నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది.
2019 నుంచి కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 మార్చి 11 నుంచి 2023 జులై 4వరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. బీబీనగర్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎం) బోర్డు మెంబర్‌గా వున్నారు. 2023, మార్చి 29న బీజేపీ అధిష్టానం ఆయన్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడెవరని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం బండిసంజయ్ అని! ప్రత్యర్థులపై సంచలనాత్మక ఆరోపణలతో గుక్కతిప్పుకోనియకుండా చేసే సామర్థ్యం ఆయన సొంతం. ప్రత్యర్థులు బలంగా వున్న ప్రాంతాల్లోకి చొచ్చుకొని పోయి మరీ ఓటర్లను తనవైపు తిప్పుకోగలిగే సమర్థ నాయకుడు. ప్రస్తుత కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లోఏఐఎంఐఎంకు గట్టి పట్టున్న ప్రాంతంగా పేరుపొందిన కాశ్మీర్‌గడ్డను బీజేపీ ఖాతాలో వేసిన ఘనత బండి సంజయ్‌దే! ఆరఎసఎస్/బీజేపీ కార్యకర్తగా తన కెరీర్‌ను ప్రారంభించిన బండి సంజయ్ మూడుసార్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ముఖ్యంగా ఆరఎస్/బీజేపీ నేపథ్యం కార్యకర్తల సమీకరణతో పాటు బీఆరఎస్, కాంగ్రెస్ పార్టీలను దీటుగా ఎదుర్కొని మట్టి కరిపించే రీతిలో వారిని ముందుకు నడిపించిన ఘనత బండి సంజయ్‌కే దక్కుతుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 స్థానాల్లో 30 స్థానాలు బీజేపీ కైవసమయ్యాయంటే అది బండిసంజయ్ ఘనతనే. అంతేకాదు ఇండిపెండెంట్ల సహాయంతో మెజారిటీ సాధించి కరీంనగర్ కార్పొరేషన్ పై మొట్టమొదటిసారి కాషాయ జెండాను ఎగురవేయించిన నాయకత్వ పటిమ కూడా బండి సంజయ్‌దే!
నిజానికి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వున్నప్పుడు, అంతకుముందు 7%గా వున్న పార్టీ ఓటు షేర్‌ను ఏకంగా 33%కు పెంచగలగడం ఆయనలోని నాయకత్వ పటిమకు నిదర్శ నం. బండి సంజయ్ నాయకత్వశైలి మిగిలిన నాయకులకు భిన్నం. ప్రజలను ఆకట్టుకునే స్థా యి దూకుడు ప్రసంగాలు, మొదటినుంచి పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రధానంగా అనుసరించే వ్యూహం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 80% టిక్కెట్లు ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్నవారికే దక్కడానికి ప్రధాన కారణం బండి సంజయ్ చొరవే!
బండి సంజయ్ తర్వాత రాష్ట్రానికి పార్టీ అధ్యక్షులుగా జి. కిషన్‌రెడ్డి వ్యవహరించగా ప్రస్తుతం ఎన్. రామచంద్రరావు కొనసాగుతున్నారు. నిజానికి బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పిండం అధిష్టానం చేసిన చారిత్రక తప్పిదంగా పరిగణిస్తున్నారు. ఆయన దూకుడు శైలి పార్టీని ఒకరకంగా పరుగులు పెట్టించిందనే చెప్పాలి. ఆయన మార్గదర్శకత్వంలో ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు పనిచేయ డంతో కరీంనగర్‌లో మొట్టమొదటిసారి 30 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ అధ్యక్షుడి గా వున్నట్లయితే, పార్టీ పరిస్థితి మరోలా వుండేదన్న భావన అంతర్గతంగా చాలామంది నాయకుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. అప్పట్లో బీజేపీలో వున్న సినీతార విజయశాంతి ఒక సందర్భంలో మాట్లాడుతూ బీఆరఎస్‌తో కుదిరిన రహస్య ఒప్పందం మేరకే బండి సంజ య్‌ను పార్టీ అధ్యక్ష పదవిని తప్పించారని ఆరోపించడం అప్పట్లో సంచలనం సష్టించింది. అధికార బీఆరఎస్‌కు ఇబ్బందికరంగా మారినందుకే ఈ పనిచేశారన్నది ఆమె మాటల్లోని అంతరార్థమని భావించాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు వ్యవహారశైలిని అడ్డుకోవాలంటే ఫైర్ బ్రాండ్ బండి సంజ య్ మాత్రమే సరైన నాయకుడన్న అభిప్రాయం వుంది. గతంలో “ప్రజా సంగ్రామ యాత్ర” పేరుతో బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్ర అప్పటి బీఆరఎస్ ప్రభుత్వాన్ని కుదిపేసిందని, ఇప్పుడుకాంగ్రెస్‌ను దెబ్బతీయాలంటే అటువంటి యాత్ర అవసరమని పార్టీ క్యాడర్ భావిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన్ను పదవినుంచి తప్పించడంలో ఒక్కసారిగా చల్లారినఊపు, మళ్లీ ఈ ప్రజాసంగ్రామ యాత్రతో వచ్చిందని స్థానిక నాయకుల్లో స్పష్టమైన అభిప్రాయం. అందుకు అన్ని విధాలా సమర్థుడు బండి సంజయ్ మాత్రమేనన్నది వారిలో వ్యక్తమవుతున్న ఏ కాభి ప్రాయం. ఇదిలావుండగా పార్టీ అధిష్టానం ప్రస్తుతం బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవితో పాటు, నేషనల్ జనరల్ సెక్రటరీగా కూడా కొనసాగిస్తూ రాష్ట్ర రాజకీయాలపై ఆయన ప్రభావం కొనసాగేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఆయన హైకమాండ్ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాల్సిన విషయం మరోటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే పార్టీ 14% అధికంగా ఓట్లు సంపాదించినా కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనే గెలవగలిగింది. అదే వీధి పోరాటాలు సమర్థవంతంగా చేయగల బండి సంజయ్ ఉన్నట్లయితే పార్టీ ఎదుగుదల మరో తీరులో వుండేదని వివిధ స్థాయిల్లోని నాయకుల విస్పష్ట అభిప్రాయం.
2018 నుంచి గమనిస్తే రాష్ట్రంలో బీజేపీ ఒక క్రమానుగత వద్ధిని నమోదు చేస్తూ రావడం గమనార్హం. ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓట్‌షేర్ 7.1% వుండగా 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి దాదాపు రెట్టింపు అంటే 13.9%కు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో అసెంబ్లీలో ఒక్క స్థానం నుంచి ఏకంగా ఎనిమిది సీట్లకు ఎగబాకింది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో 8 సీట్లను గెలుచుకుంది. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల ఓట్‌షేర్ 19.5% వుండగా 2024 నాటికి దాదాపు రెట్టింపు 35.1%కు పెరిగింది. రెండు ఎన్నికల మధ్య ఇంతటి పురోగతిని కనబరచిన పార్టీ 2026 స్థానిక ఎన్నికల్లో కేవలం 14% ఓట్లను సాధించి దారుణ పనితీరును ప్రదర్శించింది. అంటే గత లోక్‌సభ ఎన్నిక లతో పోలిస్తే 21% ఓట్లను కోల్పోయింది. 2020 స్థానిక ఎన్నికల్లో సుమారు 13% ఓట్లతో 330 వార్డుల్లో గెలుపొందిన పార్టీ ప్రస్తుతం14% ఓట్లతో 336 వార్డుల్లో గెలవడం గమనార్హం. అంటే 2024 నాటి ఎదుగుదల కొనసాగివున్నట్లయితే ఈ ఎన్నికల్లో ఇంతకు రెట్టింపునకు పైగా వార్డులు గెలుచుకొని వుండేదన్నది అక్షరసత్యం. బండి సంజయ్ దూకుడు వున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేదనేది కూడా పై విశ్లేషణను బట్టి చూస్తే అర్థమవుతుంది.
రేవంత్ దూకుడుకు కౌంటర్‌గా బండి సంజయ్ వ్యవహరించగలిగేవారని ఫలితంగా ఈ మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పాలనకు ఒక రెఫరెండంగా మార్చేసి, 70 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయాన్ని సమర్థవంతంగా నిరోధించగలిగేవారన్నది పార్టీలో అంతర్గతంగా వ్యక్తమవుతున్న అభి ప్రాయం. అంతేకాదు బండి సంజయ్ కాంగ్రెస్ పలుకుబడిని బాగా తగ్గించగలిగేవారన్నది ఒక విశ్లేషణ. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వీధిపోరాట శైలికి బండి సంజయ్ శైలి ఎంతమాత్రం తీసిపోదు. తెలంగాణ అభివద్ధి, కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపు విషయంలో ఆయన ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నేరుగా ఛాలెంజ్ చేయడం విపక్ష నేతల్లో ఆయన్ను ముందు నిలిపింది. తనను తాను బీసీ నేతగా చెప్పు కోవడమే కాదు, దమ్ముంటే బీసీ నేతలను ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్, బీఆరఎస్‌లకు నేరుగా సవాలు చేసిన ఘనత కూడా ఆయనదే! బీజేపీ గెలిస్తే బీసీ నాయకుడిని (57% బీసీలు)ముఖ్యమంత్రిని చేస్తుందని ప్రకటించి కాంగ్రెస్, బీఆరఎస్‌లను ఇరుకున పెట్టారు. ఈ అంశాలను పరిశీలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ను ఢీ అంటే ఢీ అని ఎదురు నిలవాలంటే బండి సంజయ్‌కి మాత్రమే సాధ్యమన్న అభిప్రాయం మెజారిటీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి కే ఆయన ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను పార్టీకి పవర్ హౌజ్‌లుగా మార్చేశారు. దక్షిణ, గ్రామీణ తెలంగాణలో పార్టీ ఇంకా బలహీనంగా వుంది. ఈ ప్రాంతాల్లోని 43 మున్సిపాలిటీల్లో పార్టీ ఇంకా ఖాతా తెరవలేదు. ఈ ప్రాంతాల్లో బీఆరఎస్ ఓట్ షేర్ 28.7%. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పడినచాలా ఓట్లు ఇప్పుడు బీఆరఎస్ ఖాతాలో పడటమే ఈ పుంజుకోవడానికి కారణం! ఇప్పుడు బండిసంజయ్ నాయకత్వంలో బీజేపీపట్టణ కార్పొరేషన్లలో చాలా వరకు బీఆరఎస్‌ను వెనక్కి నెట్టేd ¾ రెండోస్థానానికి చేరుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో ఇంకా బీఆరఎస్ తన బలాన్ని కొనసాగిస్తూ రెండో స్థానంలో వుండటం గమనార్హం. ఈ గ్యాప్‌ను పూడ్చే సామర్థ్యం కేవలం బండి సంజయ్‌కు మాత్రమే వున్నదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
