రామకృష్ణాపూర్, నేటిధాత్రి;
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారిని చెన్నూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రామకృష్ణాపూర్ పట్టణ సాక్షి దినపత్రిక పాత్రికేయులు పొన్నాల సుమన్ తండ్రి పొన్నాల విజయరావు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.12వ వార్డు బిఆర్ఎస్ నాయకులు ఓదెలు ఇటీవల ప్రమాదానికి గురి కావడంతో ఓదెలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజరమేష్, పట్టణ అధ్యక్షుడు సుదర్శన్, కౌన్సిలర్లు పొగుల మల్లయ్య, జీలకర మహేష్, బోయినపల్లి అనిల్ రావు, రెవెళ్లి ఓదేలు తదితరులు పాల్గొన్నారు