బేషరత్తుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కూడలి వద్ద ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ బాల్క సుమన్ తన స్థాయిని మించి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు కృష్ణ ప్రాజెక్టుపై గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై ప్రశ్నిస్తే తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలతోఎదురుదాడి చేయడం హేయమైన చర్య అన్నారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే మా యూత్ కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని తరిమికొడతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాదు నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్లు సుకుమార్ సతీష్ మండల నాయకులు చిందం రవి రమేష్ కటయ్య రఫీ రాజేందర్ రవిపాల్ రాజు మార్కండేయ చిరంజీవి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.