చెత్త బుట్టలో శిశువు మృతదేహం లభ్యం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా
ఆసుపత్రి ఆవరణలో మగ శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది.. గుర్తుతెలియని వ్యక్తులు ఆసుపత్రి క్యాంటీన్ పరిసరాల్లోని ఓ చెత్త బుట్టలో శిశువు మృతదేహాన్ని పారేసారు. శిశువు వద్దనుకుని పడేశారా లేక చనిపోతే వదిలి వెళ్లారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ శిశువు కాలుకున్న ఆసుపత్రి బ్యాడ్జితో వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రి ఆవరణతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.