మహిళల భద్రతే షీ టీం లక్ష్యం
హుజూర్ నగర్ ఎస్.ఐ ముత్తయ్య
హుజూర్ నగర్, నేటిధాత్రి.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత మరియు రక్షణ, సైబర్ క్రెం,ఆన్‌లైన్ మోసాలు తదితర అంశాలపై గురువారం హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు హుజూర్ నగర్ ఎస్.ఐ ముత్తయ్య అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ… విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. మహిళలు, విద్యార్థినులు ఈవ్‌టీజింగ్‌కు గురైతే షీటీం వెంటనే స్పందిస్తుందని మహిళల రక్షణ కోసమే షీటీమ్స్ ఏర్పాటు చేసారని,సైబర్ నేరాల పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్.ఐ ముత్తయ్య వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ అవేర్నెస్ తో పాటు జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు, మహిళల భద్రత మరియు రక్షణ,100 డైల్ , సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాలు,టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థి, విద్యార్థినిలకు ఎస్.ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై బలరాం రెడ్డి ఇతర పోలీసు సిబ్బంది మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.