జైపూర్ , నేటి ధాత్రి:
జైపూర్ మండలంలో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కుందారం బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో వేలాల గ్రామం లో ఆర్థిక అక్షరాస్యత ఎం.వి రూరల్ ఫోక్ ఆర్చ్ ఆర్గనైజేషన్ కర్నూల్ కళాజాత వారిచే బ్యాంకు పథకాలపై బ్యాంకు స్కీమ్స్ పై క్రాప్ లోన్, పొదుపులోన్, హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, గోల్డ్ లోన్, రుణమాఫీ లపై ముఖ్యంగా సామాజిక భద్రత పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన నగతురహిత లావాదేవీల పై సైబర్ మోసాలపై జాగ్రత్త వహించాలని ప్రజలకు అర్థమైనటువంటి రూపకంగా మాటల ద్వారా పాటల ద్వారా మ్యాజిక్ షో ద్వారా కళాజాత బృందం వారు తెలియజేశారు. ఈ కార్యక్రమనకు బ్యాంకు మేనేజర్ సంతోష్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ మనోజ్, సర్పంచ్ ప్యాగ శ్యామల, ఉప సర్పంచ్ డేగ నాగేష్ మరియు కళాజాత బృందం సభ్యులు మెజీషియన్ ఎం తేజ కుమార్, డప్పు ప్లేయర్ వేణు రైతులు మహిళలు గ్రామ ప్రజలు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.*