డోలారోహన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్

 

మునుగోడు – చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి వాస్తవ్యులు చింతల రాజు – అశ్విని గార్ల కూతురు డోలారోహన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు.*

 

ఈ కార్యక్రమంలో మునుగోడు మండల వైస్ ఎంపీపీ అనంత స్వామి గౌడ్ గారు, బొల్లమోని శ్రీకాంత్ గారు, బండి చంటి గారు, బండి రాజు గారు, బిఆర్ఎస్ పార్టీ మునుగోడు మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీ జెట్టి గణేష్ ముదిరాజ్ గారు, బిఆర్ఎస్ పార్టీ మునుగోడు పట్టణ సీనియర్ నాయకులు బండారు మల్లేష్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

నిజం..ఇజం..నేటిధాత్రి నైజం.

`నేటిధాత్రి అక్షరం నిజం పరిధి దాటలేదు.

`అబద్దాలు మోయలేదు..

` ఎవరికీ లొంగిపోలేదు.

`ఎంతటి వారైనా సరే తూర్పారపట్టకుండా వుండలేదు.

` మంచిని మంచిగానే చెబుతుంది.

`తప్పు చేస్తే చీల్చి చెండాడుతుంది.

` 19 ఏళ్లలలో ఆగింది లేదు..అలసట లేదు..

`తొందరపాటుకు గురికాలేదు..తొట్రుపాటు అసలేదు.

` నిజానికి నిజరూపం… నిజాయితీకి నిలువెత్తు అక్షరం.

` నిందలకు వెరవలేదు…నీతి మాలిన వాళ్లను వదలలేదు.

`కేసులకు భయపడలేదు.. అదిరింపులకు బెదరిపోలేదు.

` తప్పు చేస్తే అధికార పార్టీ నాయకులను ఏనాడు వెనకేసుకురాలేదు.

`ఎంతటి పలుకుబడి నేతలనైనా నిలదీయకుండా ఊరుకోలేదు.

` సూచనలిచ్చే చోట నచ్చచెప్పాం.

`ఎత్తి చూపే చోట హితవు పలికాం.

`వినకపోతే భవిష్యత్తు కూడా కళ్లకు కట్టినట్టు చెప్పాం.

` ఇప్పుడు రాజకీయంగా సతమతమౌతున్న వాళ్లకు ఎన్నో సలహాలిచ్చాం.

`నాడు నేటిధాత్రి చెప్పినా వినకపోతిమి అని మధనపడేవాళ్లను చూస్తున్నాం.

`అదీ నేటిధాత్రి అక్షరలెక్క..ఆచరించేవారికి ఎదురేదీ వుండదింక.

`అటు రాజకీయం.. ఇటు ప్రజాభిప్రాయం..భవిష్యత్తు కాలం.

` నేటిధాత్రి అక్షరంలో నిండిన వర్తమానం.

`డిప్యాక్‌ తోడుగా, నేటిధాత్రి అడుగుగా సాగుతున్న ఎదురులేని అక్షర ప్రయాణం.

`మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ముందే చెప్పింది నేటిధాత్రి.

` కర్ణాటక ఎన్నికల ఫలితాలు లెక్కలతో సహా ఖచ్చిత ఫలితమిచ్చింది.

`ఏ సర్వే సంస్థకు అందని లెక్కను కూడా పర్ఫెక్ట్‌ గా నేటిధాత్రి మాత్రమే చెప్పింది.

` ప్రజాభిప్రాయాన్ని సేకరించడంలో డి ప్యాక్‌ స్టైలే వేరని నిరూపించింది.

`సర్వే లలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

`అంచనా లెక్కలు కాదు…అసలు సిసలు లెక్కలు చెప్పడం నేటిధాత్రి కే సాధ్యమౌతుంది.

 

హైదరబాద్‌,నేటిధాత్రి:               

అక్షరం తల్చుకుంటే ఆగేదేముంటుంది? చైతన్యం విచ్చుకుంటే ఎదురేముంటుంది? పోరాటం తల్చుకుంటే ఏదురేమి నిలుస్తుంది? ఉద్యమ ఉప్పొంగితే తట్టుకునే శక్తి ఎవరికుంటుంది? అన్నింటికీ అక్షరం బాసటగా నిలిస్తే విజయాలుకు అడ్డేముంటుంది? ఎదురీతకు నిలిచే ధైర్యం ఎవరికి వుంటుంది? అదీ అక్షరం గొప్పదనం. ఎందుకంటే నేటి ధాత్రి నిప్పు కణం. అగ్ని రణం. నేటిదాత్రి నిజాల దావానలం. మంచి చేస్తే వెలుగు పంచుతుంది. తప్పు చేస్తే దహించి వేస్తుంది. నిజం పరిధిని ఏనాడు నేటిధాత్రి దాటే ప్రయత్నం చేయలేదు. చేయదు కూడా. అబద్దాన్ని ఏనాడు మోయదు. దాన్ని దరి చేరనివ్వదు. కొందరు నేటిధాత్రి గురించి తెలిసీ తెలియక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే నేటిధాత్రి మీద నిందల రంగులు పూయాలనుకుంటున్నారు. నిజం గడప దాటే లోపు అబద్దం ఊరు చుట్టి వస్తుందని సామెత. అలాగే నేటిధాత్రి ఏ ఒక్కరికో వంత పాడుతున్నట్లుగా, ఎవరి మేలు కోసమో పనిచేస్తున్నట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు. నేటిధాత్రిని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. అందుకే నేటిధాత్రి అంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం మా పాఠకులకు చెప్పాలని అనుకుంటున్నాం. గత పందొమ్మిది సంవత్సరాలుగా నేటిధాత్రిని ఆదరిస్తున్నా, చూస్తున్న వారిని నేటిధాత్రి నైతిక విలువల గురించి పూర్తిగా తెలుసు. కాని కొత్త తరం పాఠకులకు చెప్పాల్సిన అవసరం వుందని గుర్తించి చెబుతున్నాం. నేటిధాత్రి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏనాడు జంకలేదు. ఆలోచించలేదు. సమాజానికి మంచి జరుగుతుందనుకునే విషయాన్ని చెప్పకుండా ఊరుకోలేదు. సమాజానికి నష్టం అనుకున్న విషయాన్ని వెల్లడిరచకుండా ఆపలేదు. ఎందుకంటే ఎప్పుడూ, ఎట్టిపరిస్ధితుల్లోనూ నేటిధాత్రి అబద్దాన్ని మోయదు. దాన్ని దరి చేరనివ్వదు. ఇది మాత్రం నేటిధాత్రిని ఆదరించే పాఠకులకు చెప్పాలని అనుకున్నాం. 

నేటిధాత్రిపై పందొమ్మిది సంవత్సరాల సుథీర్ఘ ప్రయాణంలో బెదిరించాలని చూసిన వారున్నారు. భయపెట్టిన వారున్నారు. అదిరించాలని చూసి, దాడులకు దిగిన వారున్నారు. కార్యాలయం మీదకు వచ్చి ద్వంసం చేసే ప్రయత్నం చేసిన వారున్నారు. 

నేటిధాత్రి అక్షరాలు జీర్ణించుకోలేని అవినీతి పరులు, కబ్జాదారులు, అన్యాయాలు చేసేవారు మా సిబ్బందిపై పగలు, ప్రతీకారాలు పెంచుకున్న వారున్నారు. ఆఖరుకు నేటిదాత్రి ఎడిటర్‌నైన నాపైనే దొంగ దెబ్బ తీసే కుట్ర కూడా పన్నారు. అందులో ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా ఏదీ లేదు. నేటిధాత్రి చెప్పే నిజాలు నచ్చని వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే బెదిరించే ప్రయత్నం చేసినవారే…కేసులు నమోదు చేసిన వారే..అయినా నేటిదాత్రి అక్షరం జంకలేదు. మరింత అక్షరాలకు పదును పెంచుకున్నదే…కాని వణికిపోయింది లేదు. అక్షరం పారిపోయింది లేదు. ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే తూర్పారపట్టకుండా వదిలేసింది లేదు. సమాజానికి మేలు చేసే వరకే ఎవరైనా? ఏ విషయంలోనైనా తప్పు అనిపిస్తే చాలు వారిని అక్షరాలతో కడగడం నేటిధాత్రి చేసే యజ్ఞం. అది దాదాపు అనేకమంది నాయకులకు తెలుసు. ఎందుకంటే మంచిని మంచిగానే నేటిదాత్రి విశ్లేషిస్తుంది. అవసరమైతే శబాష్‌ అని ముందుకు నడవాలని సూచిస్తుంది. తప్పు చేసిన వారిని చీల్చి చెండాడుతుంది. అందుకే ఈ పందొమ్మిదేళ్ల నేటిధాత్రి ప్రయాణంలో అలసట లేదు. అలుపు లేదు. అక్షరానికి విరామం లేదు. అక్షరం ఆపింది లేదు. కష్టానికి వెరవలేదు. సుఖానికి మురిసిపోలేదు. నేటిధాత్రికున్న పాఠకుల ఆదరణ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అదే మా నిబద్దత. నేటిధాత్రి తొందరపాటుకు గురైన సందర్భం లేదు. తొట్రపాటుకు గురైన సమయం లేదు. ఏదైనా ఒకటికి పది సార్లు ఆలోచించే అక్షరాన్ని రచిస్తాం. అచ్చువేస్తాం. ఎవరి మీద నిరాధారమైన ఆరోపణలు రాయం. అందుకే నేటిదాత్రిని నిజానికి నిజరూపం, నిజాయితీకి నిలువెత్తురూపం అని కొనియాడుతుంటారు. నేటిధాత్రి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పత్రిక. పద్నాలుగేళ్లపాటు తెలంగాణ కోసం నిరంతరం అక్షర యజ్ఞం చేసిన పత్రిక. ఆనాడు పత్రిక నిర్వహణ అంటే ఎంత కష్టమో తెలిస్తే, ఇప్పుడు నేటిధాత్రి మీద జోకులు ఎవరూ వేయరు. తెలంగాణ కోసం ఆస్ధులు తాకట్టుపెట్టి, చివరకు ఆ అప్పులు తీరక అమ్ముకొని నిలబడిరదే నేటిధాత్రి. కాని ఏనాడు అక్షరం ఆగలేదు. సమాజంకోసం, సమాజ హితం కోసం, తెలంగాణ కోసం, వచ్చిన తెలంగాణ అభివృద్ధి భాగాస్వామ్యం కోసమే నేటిధాత్రి సాగుతోంది.

తెలంగాణ వచ్చిన తర్వాత కోటి ఆశలుంటాయి. వాటిని కూడా ప్రజలు అర్ధం చేసుకోవాలి.

 ఒక కుటుంబం వేరుపడితేనే కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాంటిది తెలంగాణ వచ్చిన మరునాడే కోరికలు తీరాలన్న ఆశలు చాలా మందిలో వుంటాయి. తెలంగాణ ప్రజల ఆశలు తీరాలనే తెలంగాణ ఉద్యమం జరిగింది. అన్నీ చక్కదిద్దుకునే క్రమంలో కొంత ఆలస్యమౌతుంది. కాని తెలంగాణలో అలాంటి పరిస్ధితి కూడా ఎదురుకాలేదు. అదే నేటిధాత్రి చెప్పేది. కాని దాన్నికొందరు వక్రీకరించి నేటిధాత్రిపై అవాకులు చెవాకులు పేలినవారున్నారు. అది తప్పు. నేటిధాత్రి కూడా ప్రభుత్వంలో కీలకభాగస్వాములైన కొందరు చేసే తప్పులను కూడా ఎండగట్టిన సందర్భాలు అనేకం వున్నాయి. తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు కొట్లాడి, తెలంగాణ తెచ్చుకొని, నవ్వే వాడి ముందు పడిపోకూడదనే నేటిధాత్రి ఎప్పుడూ కోరుకునేది. అందుకే మా దారి ఎవరి కోసం మార్చుకోలేదు. ఎవరికీ మేం భజన చేయం. సూచనలు ఇవ్వాల్సిన చోట ఇస్తాం. ఎత్తి చూపాల్సిన చోట ఎత్తి చూపుతాం. హితవు చెప్పాల్సిన అవసరం వుంటే చెబతాం. వినకపోతే కూడా వారి రాజకీయ భవిష్యత్తు ఎలా వుంటుందో కూడా ముందు విశ్లేషించి కళ్లకు కట్టినట్లు చెబుతాం. అయినా వినక, ఇప్పుడు బాదపడుతున్నవారు ఎందరో…ఆనాడు నేటిధాత్రి చెప్పినా వినకపోవడం వల్లనే ఈ పరిస్ధితి వచ్చిందని చెబుతున్నవాళ్లను చూస్తున్నాం. 

               పోరాడితే పోయేదేమీ లేదు..అన్న సిద్దాంతాన్ని నమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యాం. తెలంగాణ సాధనలో మేము తురుపుముక్కలయ్యాం. మా అక్షర విజయం తెలంగాణ అని గర్వంగాచెప్పుకుంటాం. అలాగే రాజకీయ భవిష్యత్తును కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించడంతో డిప్యాక్‌ సంస్ధతో కలసి, నేటిధాత్రి అందిచించిన సర్వేలు ఎక్కడా పొల్లుపోలేదు. గతం గురించి కన్నా, తాజాగా వర్తమానంలో మునుగోడు ఉప ఎన్నికలపై ఖచ్చితమైన లెక్క చెప్పింది ఒక్క నేటిధాత్రి మాత్రమే. ఇక కర్నాటక ఎన్నికల సమయంలో నేటిధాత్రి సంచలనం సృష్టించింది. గతంలోనే కాదు, ఇటీవల కాలంలో కూడా ఏ సర్వే సంస్ధ చెప్పనంత ఖచ్చితమైన లెక్కను చెప్పి నేటిదాత్రి సరికొత్త సర్వేలకు తెరతీసింది. కర్నాటకలో కాంగ్రెస్‌, బిజేపి, జేడిఎస్‌లు ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై అన్ని పార్టీలకు ఒక్కసీటు కూడా అటు, ఇటూ కాకుండా చెప్పిన ఏకైక సంస్ధ డీప్యాక్‌. బొంబాయి కేంద్రంగా మొదలైన డీ ప్యాక్‌ సర్వేలు నేటిదాత్రితో కలిసి సాగించిన అన్ని సర్వేలు ఒక సంచలనమే అని చెప్పకతప్పదు. అదీ నేటిధాత్రి నిబద్దత. అలాంటి నేటిదాత్రి ఎప్పుడూ నిజాలే చెబుతుంది. ప్రజా శ్రేయస్సే కోరుకుంటుంది. అది పాఠకులు తెలుసుకుంటే చాలు… మీ అందరికీ శనార్దులు.

భట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరు ప్రత్యేకంగా ఫోన్ చేశారో తెలుసా?

mallu bhatti vikramarka with rahul gandhi
తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి!
తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, కాళ్లకి స్పోర్ట్స్ షూసు… ఈ రూపం ఎక్కడ కనిపించిన మనకు పెద్దాయనే గుర్తుకు వస్తారు. అటువంటి సందర్భమే మరోసారి వచ్చింది తెలంగాణ నేలపై. అప్పుడు చంద్రబాబు లాగే ఇప్పుడు కేసీఆర్ అరాచక పాలన సాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న తెలంగాణ ప్రజానీకానికి తొమ్మిదేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి. వారి చెమర్చిన కళ్లు తుడవటానికే మనందరి జన నేత భట్టి విక్రమార్క పట్టుబట్టి బయలుదేరారు. వేయి కిలో మీటర్లు దాటి వంద రోజుల మైలు రాయిని త్వరలో చేరుకోబోతున్నారు!
ఆనాటి రాజశేఖర్ రెడ్డి లాగే ఇంటి నుంచీ బయలుదేరి నిర్విరామంగా జనం మధ్య గడుపుతోన్న భట్టికి జూన్ 15న ఆయన బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ కాల్ వచ్చింది! అది మరెవరి నుంచో కాదు… ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియమ్మ తనయుడు దిల్లీ నుంచీ ఫోన్ చేశారు! భట్టికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. గల్లీ నుంచీ దిల్లీ దాకా చర్చగా మారిన పీపుల్స్ మార్చ్… రాహుల్ ను కూడా ఆకర్షించింది. జనం కోసం జన నేత భ్టటి విక్రమార్క చేస్తోన్న పోరాటం ఆయన చేత ఫోన్ చేయించింది. తెలంగాణలో సామాన్య జనం బాగోగుల గురించి ఆరా తీయించింది! ప్రజల కోసం ఆరాటపడుతోన్న నాయకుడికి అండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంటుందని ఆయన అన్నట్లు సమాచారం. మొత్తంగా భట్టి పాదయాత్ర ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది! రాహుల్ నుంచీ ఫోన్ రావటంతో భట్టి విక్రమార్క మరింత ధృఢ సంకల్పంతో ఇక పై ముందుకు దూసుకుపోనున్నారు…

నిండైన గుణం..మేలైన నాయకత్వం.

`నారబోయిన రవిలో వుంది అసలైన సేవా గుణం.

`అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం.

` పేదల బాధలు తెలిసిన నాయకుడు.

` వారి బాధలు పంచుకునే ఆత్మీయుడు.

` మునుగోడులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు తలుపుతట్టేది రవి ఇంటినే…

` బిఆర్‌ఎస్‌ లో రవి బలమైన బిసి నాయకుడు.

`మంత్రి జగదీష్‌ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు.

` జిల్లాలో మంత్రికి అనుంగు అనుచరుడు.

` ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండే నాయకుడు.

`మునుగోడు అభివృద్ధి కోసం అహర్నిశలు తపించే నాయకుడు.

` మునుగోడు ప్రగతి కోసం నిర్విరామ కృషి చేస్తున్న నాయకుడు.

`ప్రజల మనసెరిగిన నేత.

` భవిష్యత్తు మునుగోడు ప్రజానేత.

` బిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కనున్న బిసి నేత.

` రవికే అన్ని వర్గాల చేయూత..

` సమస్యలు లేని మునుగోడు నిర్మాణమే రవి కల.

`అన్ని రంగాలలో మునుగోడు అభివృద్ధి జరగాలనేదే రవి ఆకాంక్ష.

హైదరబాద్‌,నేటిధాత్రి:  

మన సమాజంలో మాటలు చెప్పే నాయకులు చాలా మంది వుంటారు. సేవ అనగానే దూరం పారిపోయేవారు కూడా వుంటారు. కేవలం రాజకీయాల కోసమే పనిచేసేవారు మరికొందరుంటారు. కాని మునుగోడు బిఆర్‌ఎస్‌ నాయకుడు నారబోయిన రవి లాంటి నాయకులు అతి తక్కువగా వుంటారు. రవి సేవాభావం నిండుగా వున్న నాయకుడు. ప్రజలకు ఏ ఆపదవచ్చినా వెంటనే స్పందించే నాయకుడు. ఏ అర్ధరాత్రి తలుపుతట్టినా నేనున్నాని భరోసా కల్పించే నాయకుడు. ప్రజాసేవలో నిమగ్నమైన నాయకుడు. ప్రజలంటే ప్రేమ కల్గిన నాయకుడు. అందుకే రవి నాయకత్వం కావాలని మునుగోడు బలంగా కోరుకుంటోంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా రవి నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో బిఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఆసక్తి కనబర్చుతున్నారు. అటు ప్రజలు ,ఇటు మునుగోడు బిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలందరూ రవి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ రవికే టిక్కెట్‌ ఇవ్వాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులే కాదు, ఏ పార్టీకి చెందిన నాయకులు నలుగురు ఒక చోట చేరినా, సరే నారబోయిన రవి గురించే చర్చించుకుంటున్నారు. ఆయన నాయకత్వం గురించి చర్చించుకుంటున్నారు. ఈసారి బిఆర్‌ఎస్‌ తరుపున నారబోయిన రవి ఎన్నికల బరిలో నిలిస్తే మిగతా పార్టీల పరిస్దితి ఎలా వుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే రవి మునుగోడు నియోజకవర్గంలో బలమైన నాయకుడు. ఆయన రాజ్‌గోపాల్‌రెడ్డి లాంటి నాయకుడిని కూడా ఎదుర్కొగల సత్తా వున్న నాయకుడు. గత ఉప ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్లకు ఇంటా, బైట నేతలందరూ ప్రచారం నిర్వహించాల్సివచ్చింది. మరి సార్వత్రిక ఎన్నికలంటే ఎమ్మెల్యే అభ్యర్ధి ఎంతో జన బలం కల్గిననేతై వుండాలి. కూసుకుంట్ల ఆ విషయంలో చాలా వెనుకబడి వున్నాడన్న సంగతి గత ఎన్నికల్లోనే తేలిపోయింది. కాకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మరోసారి ఉప ఎన్నికల్లో కూసుకంట్లకు అవకాశం కల్పించారు. అందులో దాగి వున్న మర్మం కూడా అందరికీ తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూసుకుంట్ల టిక్కెట్‌ అడక్కుండా వుండేందుకే ఉప ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించారన్నది భహిరంగ రహస్యమే. అందుకే ఉప ఎన్నికలు పూర్తయి తర్వాత నుంచి పార్టీ ఆదేశాల మేరకు నారబోయిన రవి నియోజకరవర్గంలో అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు విసృతంగా చేపడుతున్నారు. పార్టీ నుంచి ఇప్పటికే పూర్తి స్ధాయి సూచనలు అందినట్లు కూడా సమాచారం. అందుకే రవి ఏ పనిచేసినా పార్టీ నుంచి పూర్తి స్ధాయి అనుమతులున్నట్లు పార్టీవర్గాలు చెప్పుకుంటున్నాయి. అందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నారబోయిన రవి నాయకత్వం గురించి వాల్‌ రైటింగ్స్‌ విసృతంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా రవి గురించి ప్రచారమే దర్శనమిస్తోంది. ఏ గోడచూసినా రవి నాయకత్వం గురించే చెబుతున్నట్లు వుంది. ఇక బిఆర్‌ఎస్‌ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పీటిసీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పూర్తి స్ధాయిలో రవి నాయకత్వాన్నే బలపర్చుతున్నారు. రవి ఎట్టిపరిస్దితుల్లో ఈసారి ఎమ్మెల్యే కావాలని కోరుతున్నారు. ఎందుకంటే కూసుకుంట్ల అటు ఎమ్మెల్యేగా, ఇటు నాయకుడిగా పూర్తి స్ధాయిలో విఫలం చెందారని సొంత పార్టీ నేతలే భహిరంగంగా చెప్పుకుంటున్నారు. 

ఇక ఉప ఎన్నికల సమయంలోనే కూసుకంట్ల వైపు పార్టీ అదిష్టానం మొగ్గు చూపుతోందన్న విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ స్ధాయి నాయకులంతా ఏకమై, కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ, అనేక సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

అంటే ఆ స్ధాయిలో ఆనాడే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వుంది. మరి ఇప్పుడు ఆ వ్యతిరేకత మరింత రెట్టింపైంది. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డి మరింత కసిగా వున్నారు. ఓడిపోయిన నాడే శపథం కూడా చేశాడు. అంటే వచ్చే ఎన్నికలు రాజగోపాల్‌రెడ్డికి చావో రేవో అన్నట్లుగానే సాగుతాయి. అలాంటప్పుడు ఆయనను బలంగా ఢీ కొనగలిగే నాయకుడు కావాలి. అది కేవలం రావి మాత్రమే అన్నది మునుగోడు నియోజకవర్గం మొత్తంచెప్పుకుంటున్న మాట. బిఆర్‌ఎస్‌లో చాలా మంది సిట్టింగ్‌ ఎమ్యెల్యేలను మర్చే యోచన ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేస్తున్నాడన్నది తెలుస్తున్న విషయమే. అందులో మునుగోడు ఖచ్చితంగా వుండే నియోజవర్గమే. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై ప్రజల్లో ఎలాగూ సదాభిప్రాయం లేదు. నాయకుల్లో నమ్మకం లేదు. ఆయన నాయకత్వమంటే విశ్వాసమే లేదు. మరోసారి కూసుకంట్లను కావాలని ఎవరూ కోరుకోవడం లేదు. కొత్త ఓటర్ల దగ్గర నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీ అంటే ఎంతో ప్రేమ వున్న నాయకులందరూ కోరుకుంటున్న ఏకైక వ్యక్తి నారబోయిన రవి. ఆయనను కాదని , ఎవరిని ప్రజల మీద రుద్దినా పార్టీకి నష్టమే అన్న అభిప్రాయమే వినిపిస్తోంది. అంతే కాదు కూసుకుంట్ల విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో అంటే పార్టీ యంత్రాంగంమంతా పనిచేయడం గమనార్హం. అయినా ఆనాడే ఏ బిఆర్‌ఎస్‌ నాయకుడు మనస్పూర్తిగా కూసుకుంట్లకు పనిచేయలేదు. కాని పార్టీ మీద వున్న నమ్మకంతో, విశ్వాసంతో, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం, మంత్రి కేటిఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పేరు నిలపడం కోసమే అందరూ కూసుకంట్లకు పనిచేశారు. కాని ఈసారి కూసుకుంట్ల వద్దే వద్దు అని ఎప్పటినుంచో పార్టీకి చెబుతున్నారు. ఉప ఎన్నికల సమయంలో కూసుకుంట్లకు పనిచేయడం ఇదే ఆఖరు సారి అని కూడా తేల్చిచెప్పినట్లు సమాచారం. 

  మునుగోడు వ్యవహారం ముందుగానే తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

 బిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా పట్టుబడుతున్నారు. నారబోయిన రవిలో అసలైన సేవా గుణం వున్న నాయకత్వం వుంది. అందుకే ఆయనంటే ప్రజలకు కూడా ఎంతో ఇష్టం. అది రవికి ఎంతో ప్లస్‌ పాయింట్‌ అని చెప్పకతప్పదు. నారబోయిన రవి పేదల బాధలు తెలిసిన నాయకుడు. వారి బాధలు పంచుకునే ఆత్మీయ నాయకుడు. మునుగోడులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు రవి ఇంటి తలుపు తట్టేవారే ఎక్కువ. బిఆర్‌ఎస్‌లో రవి బలమైన నేత. సామాజిక నేపద్యం అండగా వున్న నేత. ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి ఆశీస్సులున్న ఏకైక నాయకుడు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డికి ఎంతో నమ్మకస్తుడు. అనుంగు అనుచరుడు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండే నాయకుడు. మునుగోడు అభివృ ద్దికోసం నిరంతరం తపించే నాయకుడు రవి. మునుగోడు అభివృద్ది కోసం నిర్విరామ కృషి చేస్తున్న నాయకుడు. ప్రజల మనసెరిగిన నేత. మునుగోడులో ఆసారి బిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కనున్న బిసి నేత నారబోయిన రవి. ఎందుకంటే బిసిలలో అన్ని సామాజిక వార్గల చేయూత వున్న ఏకైక నేత కూడా రవే కావడం ఆయన అదృష్టం. సమస్యలు లేని మునుగోడు నిర్మాణమే రవి కల. ఆ కల నేరవేర్చేందుకు సరైన నాయకుడు రవి అనే ప్రజలు నమ్ముతున్న మాట. అన్ని రంగాల్లో మునుగోడు అభివృద్ది జరగాలంటే రవి నాయకత్వమే కావాలని అందరూ కోరుకుంటున్నారు. రవి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తున్నారు. దీవిస్తున్నారు.

ఆరోగ్య తెలంగాణ. తెలంగాణలో వైద్య విప్లవం.

తెలంగాణ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ వైద్యం గురించి, దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెచ్చిన వైద్య విప్లవం గురించి బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఖైరతాబాద్‌ ఇంచార్జ్‌ మన్నె గోవర్ధన్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అభిప్రాయాలు… ఆయన మాటల్లోనే…

`తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు కేసిఆర్‌ అపూర్వ సృష్టి.

`తెలంగాణ కు నీళ్లొచ్చినయ్‌.

`తెలంగాణ కు నిరంతర కరంటు వచ్చింది.

` కోతలతో తల్లడిల్లిన తెలంగాణలో కరంటు విప్లవం.

` మన నిధులతో విద్యా రంగంలో గొప్ప ఆవిష్కరణలు.

` గురుకులాల ఏర్పాటుతో ఉచిత విద్యకు మోక్షం.

`ఇప్పుడు వైద్యరంగం వంతు.

` గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సదుపాయాలు.

` ఊళ్లలో పల్లె దవఖానాలు.

`పట్టణాలలో బస్తీ దవాఖానాలు.

` ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు.

` వరంగల్‌ లో 2500 బెడ్లతో కొత్త ఆసుపత్రి.

` హైదరాబాదు నలువైపులా నాలుగు ఆసుపత్రులు.

` నిమ్స్‌ కు మరో మణిహారం…విస్తరణతో మరొ కొత్త భవనం.

` కేసిఆర్‌ నిమ్స్‌ దీక్ష లోనే తెలంగాణ ప్రకటన వచ్చింది.

`కేసిఆర్‌ పాలనలో నిమ్స్‌ కు మహార్థశ పట్టనుంది.

`మరో 2000వేల బెడ్ల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన.

` దశాబ్ది ఉత్సవాల వేళ వెలిగిపోతున్న వైద్య రంగం.

` పేదలందరికీ అందుబాటులో ఉచిత వైద్యం.

`తల్లి, బిడ్డల సంక్షేమం.

` కేసిఆర్‌ కిట్‌ తో రేపటి తరానికి సంపూర్ణ ఆరోగ్యం.

`నవ తరం ఆరోగ్యానికి కేసిఆర్‌ పాలన కొండంత ధైర్యం.

`అటు హరీష్‌ రావు, ఇటు కేసిఆర్‌ పేదల వైద్యానికి భరోసా.

` ప్రభుత్వ ఉచిత వైద్యానికి తెలంగాణ అడ్డ.                 

హైదరబాద్‌,నేటిధాత్రి:   

తెలంగాణ ఈ పదమే ఒక ఉద్యమం…ఒక విప్లవం. ఒక ప్రశ్న. ఒక నిలదీత. ఒక వేధన. ఒక ఆందోళన. ఒక శక్తి. ఒక ఆర్తి. ఒక కీర్తి. వీటన్నింటినీ ఏకం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిననాడు ఎక్కడున్నారో కూడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉనికి తెలియని వాళ్లు, తెలంగాణ ఆన వాళు తెలియని వాళ్లు, తెలంగాణ గోస తెలియని వాళ్లు కూడా తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అయినా కేసిఆర్‌ ప్రశ్న కొత్తది కాదు. కేసిఆర్‌కు ప్రశ్నలు కొత్తవి కాదు. తెలంగాణ వస్తే ఏమెస్తది,ఏమెస్తది అని ప్రశ్నించిన వారికి తెలంగాణ వ్యవసాయ విప్లవం కళ్లముందు కదలాడుతోంది. కాళేశ్వరం నిర్మాణం కళ్లముందు కనిపిస్తోంది. రేపటి బంగారు తెలంగాణ కళ్లముందు కదలాడుతోంది. ఇదే నేటి తెలంగాణ. బంగారు తెలంగాణ. పచ్చని మాగాణగా, మారి కోటినన్నర ఎకరాల సాగు తెలంగాణ ఏర్పడిరది. ఇప్పుడు దిగుబడుల్లో విప్లవం తీసుకొచ్చింది. రైతుల ఆశల పండిస్తోంది. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ మన వెనక వున్నారన్న భరోసా ప్రతి రైతులో నిండిరది. ఆ నమ్మకమే రైతుల్లో కోటి ఆశలు నెరవేర్చుతోంది. కూలీ నాలి చేసుకునేందుకు వలసలు వెళ్లిన, కుటుంబాలకు దూరమైన, ఊరును ఏళ్ల తరబడి చూడలేకపోయిన వారంతా తెలంగాణ పల్లె జీవనంలో మమేకమయ్యారు. పల్లె సీమలో గొప్ప జీవితాలు అనుభవిస్తున్నారు. గర్వంగా మన తెలంగాణ అని చెప్పుకుంటున్నారు. నాకేం తక్కువ అన్నంత ధీమా రైతు వ్యక్తంచేస్తున్నాడు. అప్పుచేయాల్సిన పని లేదిక. ఎరువులు అందవన్న ఆందోళన లేదు. నకిలీ విత్తనాల బెడదలేదు. సకాలంలో వర్షాలు పడడం లేదన్న దిగులు లేదు. కరంటు ఎప్పుడొస్తుందా అని రాత్రిళ్లు, బావుల దగ్గర నిద్రలు పోవాల్సిన పనిలేదు. పగటి పూట ఎంత నీరు సమృద్ధిగా వుంటే ఎంత సమయమైనా నీటి పారకంతో పంట దిగుబడులు మారకాలౌతున్న కాలమిది. ఉద్యమకారుడు కేసిర్‌ పాలనిది. మూడు ముఖ్యమైనసమస్యల్లో ఒకటైన నీటి వనరులు అందేందుకు, చేయాల్సిన పనులన్నీ చేసి పెడుతున్నాడు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరంటు, సాగునీరు, పెట్టుబడి, అన్నీ తానై రైతుకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధిపై ఆర్తి, భవిష్యత్తుపై స్పూర్తి వున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. వేసే అడుగు, ఇచ్చే మాట, చేసే పని అన్నది మాత్రమే ఆలోచించే ఏకైక నాయకుడు ఆయన. అందుకే నమ్మకం లేని చోట నమ్మకాన్ని నిర్మించి, తెగించి తెలంగాణ తెచ్చిన ఉద్యమశీలి. బంగారుతెలంగాణకు బాటలు వేస్తున్న అభినవ రాజకీయ శిల్పి. కేసిఆర్‌ గురించి చెప్పాలంటే ఎప్పుడు మాట్లాడుకున్నా మొదటి పేజీనుంచి చెప్పుకుంటే గాని తృప్తి వుండదంటారు. అంతటి స్పూర్తివంతమైన రాజకీయ జీవితాన్ని అనుసరించి, అనుభవించి, పాలించి చూపించిన నాయకుడు ఒక్క కేసిఆర్‌ మాత్రమే. అంటున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి , నేటిధాత్రి ఎడిటర్‌కట్టారాఘవేంద్రరావుతో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతిపై చెప్పిన విషయాలు..ఆయన మాటల్లోనే…

సహజంగా ఎవరైనా రాజకీయాల్లో ఎదిగి, ఓట్లు, సీట్లు అన్నది మాత్రమే చూసుకొని పాలన సాగించిన వారే ఎక్కువ.

 కాని తన కలగని, ప్రజలచేత నినాదమై, తెలంగాణ ఉద్యమానికి నిర్మాణమై, లక్షలాది మంది కేసిఆర్‌లను తయారు చేసి, కోట్లాది గొంతుకై తెలంగాణ సాధించి, పాలిస్తున్న నాయకుడు ఒక్క కేసిఆర్‌. చరిత్రలో పేజీకోసం చూసే నాయకులు కొందరైతే, చరిత్రే తానుగా తీర్చిదిద్దుకునే నాయకులు కొందరే…అందులో తొలి వరుసలో వుండేది ఒక్కడే. తెలంగాణలో ఆయనొక్కడే. పద్నాలుగేళ్ల సుధీర్ఘ ఉద్యమ ప్రయాణంలో, పోరాట దారిలో కేసిఆర్‌ వున్నాడనే ధీమా ప్రతి ఒక్కరిలో కలిగించి, కదిలించిన నాయకుడుగా చరిత్ర ఆయనకు దాసోహమనక మానదు. తెలంగాణను చిరస్థాయిగా, చిరస్మరణీయం చేసినందునే తెలంగాణ ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. పాలనకు సరైన దారులు వేస్తారని నమ్మారు. ఆనాడైనా, ఈనాడైనా అదే దారి, అదే ఆర్తి, ఆదే సూర్తి… నిన్నటి ఉద్యమ ఆకాంక్ష నిత్యమై, సత్యమై ఎలా ముందుకు తీసుకెళ్లారో నేడు అభివృద్ధిని కూడా నిత్యవసంతం చేయాలన్న తపనతో ఆయన సాగుతున్నారు. అందుకే మట్టి విలువ, నీటి విలవ ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. సహజంగా ఏ నాయకుడైనా ఉద్యమ పంధాలో వున్నప్పుడు, ఆ గెలుపే లక్ష్యంగా సాగినా, మరే దానిపై వ్యాపకం వుండకపోవచ్చు. కాని తెలంగాణ సాధన అన్నది ఏనాటికైనా సాధ్యమయ్యేదే అని బలంగా నమ్మి, భవిష్యత్తు తెలంగాణకు ఎలా పునాదులు నిర్మాణం చేపట్టాలని ఉద్యమ కాలంలోనే రచించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. 

తెలంగాణ సాధించిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయన పాలనాపరమైన అడుగు ఎంతో ముందు చూపుతో, భివిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకొని వేస్తున్నారు.

 అందుకే అన్ని రంగాల్లో అనతి కాలంలోనే తెలంగాణ అధ్భుతమైన విజయాలు సాధింస్తోంది. సాగు రంగంలో ఒకనాడు తిండి గింజలు పండితే చాలు దేవుడా అనుకున్న తరుణం నుంచి తెలంగాణ అన్న పూర్ణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. సాగుకు నీరు కావాలని అప్పటి ఉమ్మడి పాలకులను ఎంత వేడుకున్నా తెలంగాణలో ఎత్తిపోతలు ప్రభుత్వానికి తీవ్రభారమని, రైతు శ్రేయస్సును కూడా కాదని, ప్రజలు ఆకలితో అలమటస్తున్నా పట్టించుకోని రోజులవి. కాని నేడు ఏ పాలకులు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కష్టమన్నారో అక్కడే కాళేశ్వరం లాంటి గొప్ప నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి, రైతులకు నీళ్లందిస్తున్న అపర భగీరధుడు కేసిఆర్‌. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం తెలంగాణనే సంక్షేమ రాష్ట్రంగా విరాజిల్లేలా చేసిన గొప్ప సంస్కర్త కేసిఆర్‌. అదే వరసలో తెలంగాణలో వైద్య విప్లవం సృష్టించిన నాయకుడు కేసిఆర్‌. ఒకప్పుడు తెలంగాణలో ప్రభుత్వ వైద్యమంటే పెద్ద నగరాలకే పరమితమైన సౌకర్యం. కాని నేడు ఊళ్లలో పల్లె దవఖానాలు పెద్దఎత్తున ఏర్పాటు చేసి, పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటుతో మెరుగైన, మేలైన, అత్యవసర వైద్యానికి హైదరాబాద్‌ వరకు రాకుండా అక్కడికక్కడే వైద్యం అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసుకొని వైద్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగతా జిల్లాల్లోనూ వైద్యకళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఒక్క వైద్య కళాశాల ఇవ్వడానికి కూడా ఉమ్మడి పాలకులు అంగీకరిచలేదు. ఇక వరంగల్‌లో 2500 పడకలతో అధునాతమైన ఆసుపత్రి, 24 అంతస్ధులతో నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దసరా నాటికి ఆ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో రానున్నది. ఆ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే వరంగల్‌లో ప్రభుత్వ వైద్యమే తప్ప, ప్రైవేటు వైద్యం కనిపించకోవచ్చు. ఇక హైదరాబాద్‌కు నలువైపుల నాలుగు మల్లీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఆ ఆసుపత్రులతో పేద ప్రజలకు ఎంతో ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇదిలా వుంటే తెలంగాణ ఉద్యమానికి సాక్షిగా నిలిచిన నిమ్స్‌కు మహార్ధశ పట్టనుంది. ఎక్కడైతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ కోసం దీక్ష చేపట్టి, తెలంగాణ సాధించారో ఆ ఆసుపత్రికి మరో మణిహారంగా కొత్తగా 2000 పడకల నూతన భవనం నిర్మాణం జరగనుంది. ఆ భవననిర్మాణానికి నేడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ భూమి పూజ చేయనున్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో వైద్య రంగంలో తెలంగాణను అగ్రగామిగా మార్చి, పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణలో ఆరోగ్య విప్లవాన్ని సృష్టించారు.

రవి కే టికెట్‌ ఖరారు!

-రవి వస్తేనే మునుగోడు అభివృద్ధి.

-మునుగోడు ప్రజల అభివృద్ధే రవి ధ్యేయం.

-అనేక సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు సేవలు.

-రవి ముదిరాజ్‌ కే ప్రజల దీవెనలు.

-ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే ఆపద్భాందవుడు.

-బలమైన ముదిరాజ్‌ సామాజిక వర్గ నేపథ్యం.

-మునుగోడు ఈసారి బిసిలకే…టికెట్‌ రవికే!

-ప్రజలంతా కోరుకుంటోంది రవినే…

-డి. ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్త సర్వేలో తేలిందిదే.

-మెజారిటీ ప్రజలు రవి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు.

-పొరపాటున కూడా కూసుకుంట్ల వద్దంటున్నారు.

-బిసిలలో ఐక్యత సాధించే నాయకుడు రవి.

-బిఆర్‌ఎస్‌ నేతలు, బిసిలంతా ముక్త కంఠంతో కోరుకుంటోంది రవినే.

-మునుగోడు ముందటపడాలంటే రవే రావాలి.

-మునుగోడు అభివృద్ధి జరగాలి.

-ఇదే జనం చెప్పుకుంటున్న మాట.

-సామాన్యుల బాధలు తెలిసిన నేత రవి.

-కష్టపడి పైకొచ్చిన ఆదర్శనేత రవి.

-మునుగోడు వెలగాలంటే రవి రావాలి…మునుగోడు ప్రగతిలో దూసుకుపోవాలి.

-బిఆర్‌ఎస్‌ కు ఎదురులేదు…రవి నాయకత్వానికి తిరుగులేదు.

-పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే నాయకుడు రవి.

హైదరబాద్‌,నేటిధాత్రి:               

గొప్పను గొప్పగా చెప్పాల్సిన తరుణాన్ని గొప్పగానే చెప్పాలి. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న మునుగోడు ముద్దుబిడ్డ నారబోయిన రవి ముదిరాజ్‌ గురించి నిజమే చెప్పాలి. నిజాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. ఆయనకు ప్రజలంటే ప్రాణం. ప్రజా సేవ చేయడం ఇష్టం. తాను కష్టపడి సంపాది ంచిన దానిలో ఆపదలో వున్నవారిని ఆదుకునేందుకు ఖర్చు చేయడం గొప్ప గుణం. ప్రజల అవసరాలు తీర్చి, వారికి మేలు చేయడం ఎంతో ఇష్టం. తమ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ది చేయాలని ఇష్టం. గొప్పగా అభివృద్ది చెందాలని కోరుకోవడం ఆయన నైజం. తమ ప్రాంతాభివృద్ధిలో తన పాత్ర వుండాలనుకోవడం ఇష్టం. నాయకుడిగా ప్రజలు మరింత సేవ చేయాలన్నది ఆయనకు ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఎంతో ప్రాణం. ఆయన పాలనంటే ఎంతో ఎంతో ఇష్టం. ఉద్యమకారుడిగా తెలంగాణ సాధకుడిగా యుగపురుషుడిగా ఆయనను కొలవడం ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంక్షేమ పాలన అంటే మరీ ఇష్టం. మంచినీటికి కూడా గోస పడ్డ మునుగోడుకు అందరికంటే ముందే మంచినీళ్లు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఎనలేని ఇష్టం. అలాంటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనతో, తాను కూడా ప్రజలకు సేవ చేయాలని రవికి ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో తమ ప్రాంత అభివృద్ది తన చేతుల మీదుగా మరింత జరగాలన్నది రవి కోరుకుంటున్న ఇష్టం. మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లో మరింత రాణించాలన్నది ఎంతో ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డిల ఆశీస్సులతో జరుగుతున్న అభివృద్ది మరింత జరగాలని, మునుగోడు అన్ని రంగాల్లో ముందుండాలని ఇష్టం. సామాజిక బాద్యతలో ప్రజాసేవలో వున్న రవి ప్రత్యక్ష్య రాజకీయాల్లో ప్రజా రాజకీయాల్లో ప్రజా భాగస్వామ్య రాజకీయాల్లో కీలకం కావాలని ఆయన అభిమానలకు ఇష్టం. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఇదే మాట…ఎవరు చెప్పినా ఇదే మాట…ఎవరిని కదిలించినా చెబుతున్నది ఒకే మాట..మాకు ఈసారి రవి ఎమ్మెల్యే కావాలని, ఆయన నేతృత్వంలో మునుగోడు మరింత పరుగులు పెట్టాలని…

 వ్యాపార రంగంలో ఎంత బిజీగా వున్నా ప్రజలకు చేరువగా వుండడం రవికి ఎంతో ఇష్టం.

ఎందుకంటే తమ ప్రాంతం మీద ఎంతో మక్కువ వున్న నాయకుడు రవి. మునుగోడులో బిసి సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ. అయినా ఇప్పటి వరకు రెడ్డి రాజకీయం తప్ప, బిసిల రాజకీయం సాగలేదు. కాలం మారింది. తెలంగాణ వచ్చింది. బిసి రాజకీయానికి మరింత వన్నె వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్ని వర్గాలను ఆదుకుంటున్నారు. అన్ని వర్గాలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. సకల జనులతో తెలంగాణ ఉద్యమం సాధించినట్లుగానే, పార్టీలోనూ,పరిపాలనలోనూ అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రోత్సహిస్తున్నారు. అయితే మునుగోడును ఎన్నికైన నాయకులెవరూ గతంలో నియోజకవర్గాన్ని ఏనాడు ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మునుగోడు కష్టం ప్రత్యక్షంగా చూసి, చలించిపోయారో..అప్పటి నుంచే మునుగోడులో కొంత మార్పు వచ్చింది. మునుగోడుకు కనీసం మంచినీళ్లు ఇచ్చేందుకు కూడా చేతులు రాని ఉమ్మడి పాలకులను కేసిఆర్‌ ప్రశ్నించారు. నిలదీశారు. కాని ఫలితం కనిపించలేదు. అందుకే తెలంగాణ రాగానే ముందు మునుగోడు గోడు తీర్చారు. అంత గొప్ప నాయకుడి పాలనతో మునుగోడు అభివృద్ది జరగాలంటే ఆ ప్రాంతం మీద ఎంతో అంకితబావం వున్న రవి లాంటి నాయకుడికి అవకాశం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మునుగోడులో ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల కాకుండా రవి లాంటి నాయకుడు ఎమ్మెల్యేగా వుంటే మునుగోడు ఒక వజ్రపు తునకగా మార్చేవారని ప్రజలు అంటున్నారు. 

నారబోయిన రవి అటు వ్యాపార రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఎక కాలంలో రెంటింటిలోనూ తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు.

 గతంలో కాంగ్రెస్‌లో రాష్ట్ర స్ధాయి నాయకుడిగా వున్నారు. అయితే మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రోద్భలంతో బిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి మాటంటే రవికి ఎంతో గౌరవం. అందుకే ఆయన పార్టీ కోసం ఏ పని చెప్పినా దానిని విజయవంతం చేయడంలో రవి దిట్ట. పార్టీ పరమైన కార్యక్రమాలెన్నో విజయవంతం చేసి, మంత్రి జగదీశ్‌రెడ్డి చేత అనేక సార్లు శబాష్‌ అనిపించుకున్నారు. గత ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల గెలుపుకోసం రవి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయితే గత ఉప ఎన్నికల సమయంలోనే రవికి టిక్కెట్‌ ఇవ్వాలని పార్టీ శ్రేణులను నుంచి ఒత్తిడి వచ్చింది. రవికి ఇస్తే బిఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకే అని పార్టీ శ్రేణులు చెప్పాయి. అంతే కాకుండా మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కూడా రవికి అదనపు బలంగా మారింది. కాకపోతే అప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం కూసుకుంట్లకు టిక్కెట్‌ ఇవ్వడం జరిగింది. అయినా పార్టీ కోసం తన సర్వ శక్తులు ఒడ్డి కూసుకుంట్లను గెలిపించడంలో కీలకభూమిక పోషించిన నాయకుడు రవి. అందువల్ల ప్రజలు కూడ ఈసారి రవికే టిక్కెట్‌ ఇవ్వాలని కోరుకుంటున్నారు. పార్టీ శ్రేణులైతే ఇప్పటినుంచే రవి టిక్కెట్‌ దక్కాలని పార్టీ పెద్దల వద్ద తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఎందుకంటే మునుగోడు ప్రాంత అభివృద్ది లక్ష్యం వున్న ఏకైక నాయకుడు నారబోయిన రవి. మరో వైపు ఆయన చేపట్టే సామాజిక కార్యాక్రమాలు మునుగోడు నియోజకవర్గంలో చాలా మందికి అందాయి. నియోజకవర్గంలోనే బలమైన బిసి సామాజిక వర్గంగా ముదిరాజ్‌లున్నారు. సుమారు 45వేలకు పైగా ముదిరాజ్‌ ఓట్లున్నాయి. మొత్తంగా మునుగోడులో బిసి సామాజిక వర్గాలే ఎక్కు.వ. అందులో ముదిరాజ్‌లదే పెద్ద బలగం. అందుకే నారబోయిన రవికి టిక్కెట్‌ ఇస్తే బిఆర్‌ఎస్‌కు తిరుగులేని మెజార్టీ రావడం ఖాయం అంటున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడుగా రవికి వున్న పేరు ఎంతో కలిసి వస్తుంది. 

 ఇదిలా వుంటే మునుగోడులో గత మూడు నెలలుగా డిప్యాక్‌, నేటిధాత్రిలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేలలో ప్రజలు ఎక్కువగా నారబోయిన రవి గురించే ప్రస్తావిస్తున్నారు.

 ఆయన సామాజిక సేవలు గుర్తు చేసుకుంటున్నారు. గ్రౌండ్‌ రిపోర్టులో నారబోయిన రవికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కనిపిస్తోంది. నియోజకవర్గంలో రవికి అరవై ఎనమిది శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతుండడం గమనార్హం. కూసుకుంట్ల విషయం కనీసం పట్టుమని పది శాతం మంది ప్రజలు కూడా మద్దతివ్వడం కనిపించలేదు. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ బలమైనపార్టీ. తర్వాత స్ధానంలో కాంగ్రెస్‌ వుంది. బిజేపికి కనీసం క్షేత్ర స్ధాయిలో కార్యకర్తలు కూడా లేరు. గత ఉప ఎన్నికల్లో కేవలం రాజగోపాల్‌రెడ్డి వల్లనే బిజేపికి ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. కాని ఈసారి రాజగోపాల్‌రెడ్డికి కనీసం ఇరవైశాతం ఓట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నిలకడ లేని రాజకీయాలు చేస్తూ, రాజగోపాల్‌రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసం పనిచేస్తున్నాడన్న మాట ఎక్కువగా వినిపించింది. అందువల్ల బలంగా వున్న బిఆర్‌ఎస్‌కు మునుగోడు కంచుకోట కావాలంటే నారబోయిన రవికే టిక్కెట్‌ ఇవ్వాలని ప్రజలు పెద్దఎత్తున అభిప్రాయం వ్యక్తంచేయడం విశేషం.

గుండెపోటుతో ములుగు జడ్పీచైర్మన్ “కుసుమ జగదీష్” మృతి

ఫ్లాష్.. ఫ్లాష్..

నేటిధాత్రి వరంగల్

జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో హనుమకొండలోని అజార హాస్పిటల్ లో మృతి చెందారు.

తెలంగాణ ఊపిరి…ప్రగతి రూపశిల్పి.

 

 

`సంక్షేమ సారధి…అభివృద్ధి వారధి.

`సాగు నిర్ణేత..సస్యశ్యామల ప్రదాత.

`తెలంగాణ అభివృద్ధిపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న భావాలు…అనుభవాలు. పెద్ది మాటల్లోనే..

`అన్ని వర్గాల ఆకాంక్షలకు ప్రతీక.

`సకల జనుల అభివృద్ధి నిర్మాత.

`పల్లె సింగారానికి శ్రీకారం.

`తెలంగాణలో నీటి జాడలకు సంకేతం.

`చెరువులతొ మొదలైన అభివృద్ధి సంతకం.

`సాగుకు 24 గంటల కరంటు నిదర్శనం.

`ఆసరా ఫింఛన్లుతో భరోసా…

`దివ్యాంగుల ఫించన్‌ పెంపుతో ఊరట.

`దళిత బంధుతో పెరిగిన ఆత్మవిశ్వాసం…

`గిరిజన బంధుతో ఆత్మస్థైర్యం…

`కళ్యాణ లక్ష్మితో కమనీయం.

`బిసిలకు లక్షతో చేతి వృత్తులకు సహకారం.

`అభివృద్ధిలో తెలంగాణ ఫస్ట్‌..

`సంక్షేమంలో తెలంగాణే బెస్ట్‌.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

మొన్న: నా గోడు తెలంగాణ. నా గోస తెలంగాణ. కాలోజీ మాటల్లో నా గొడవ తెలంగాణ. కడుపుకు పట్టెడు బువ్వ కరువైన తెలంగాణ. కళ్ళలో కాంతి కరువు చేయబడ్డ తెలంగాణ. కంటికి కునేక కరువైన తెలంగాణ. ఉపాధి లేని తెలంగాణ. చీకటి సూర్యులై అడవుల బాట పట్టి, అమరులైన యువకుల తెలంగాణ. కడుపు కోతల తెలంగాణ. కరువు రక్కసి పీక్కుతిన్న తెలంగాణ. కన్నీటి తెలంగాణ. కష్టాల తెలంగాణ. కాని నిజాం కాలంలోనే పిడికిలెత్తిన తెలంగాణ. ఆనాడే ఉక్కు సంకల్పం నిండిన తెలంగాణ. మర్లవడ్డ తెలంగాణ. పెత్తనాన్ని ప్రశ్నించిన తెలంగాణ. పాట తెలంగాణ. ఆట తెలంగాణ. ఆత్మ గౌరవ తెలంగాణ. చాకలి ఐలమ్మ వేసిన బాట తెలంగాణ. దొడ్డికొమరయ్య అమరత్వం తెలంగాణ. పోరాటం నా తెలంగాణ. ఆరాటం నా తెలంగాణ. ఉద్యమం నా తెలంగాణ. ఉరకలెత్తే ఉత్సాహం నా తెలంగాణ. మర్లవడే తిరుగుబాటు నా తెలంగాణ. హక్కుల సాధన నా తెలంగాణ. ఆశయ సాధన నా తెలంగాణ. అరగారిణ వర్గాల చైతన్యం నా తెలంగాణ. జన నినాదం తెలంగాణ. రణం నా తెలంగాణ. పౌరుషం నా తెలంగాణ.

జంరaా మారుతం తెలంగాణ. మా నినాదం తెలంగాణ. మా ఊపిరి తెలంగాణ. దిక్కులు పిక్కటిల్లేలా గర్జన నా తెలంగాణ. అణువణువునూ నిండిన వాదం తెలంగాణ. ఉచ్చాస నిచ్చాసల బలం నా తెలంగాణ. ప్రతి వ్యక్తి గుండె చప్పుడు తెలంగాణ. ప్రతి కదలికలో అలికిడి తెలంగాణ. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వవాప్తమైన నా తెలంగాణ. రణమైనా, రాగమైనా అంబరమంటే సంబరం నిండిరదే నా తెలంగాణ. ఉత్కృష్టమైన, ఉజ్వలమైన వెలుగే నా తెలంగాణ. భావన నా తెలంగాణ. భావావేశం నా తెలంగాణ. 

నిన్న: అరవై ఏళ్ల దుఃఖం కడుపులో దాచుకొని పురిటి నొప్పులు పడ్డ గడ్డ నా తెలంగాణ.

 అడుగడుగునా దగాపడ్డది నా తెలంగాణ. కన్నీళ్లతో కడుపు చల్లబర్చుకున్నది నా తెలంగాణ. తలాపున గోదారి పరుగులున్నా, కనీసం నురగలు కూడా తెలంగాణ పల్లెలు చూడక, ఎండిపోయిన బతుకులు తెలంగాణ. ఆ పక్క కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా, పడావు పడ్డ పాలమురూ కరువు నా తెలంగాణ. పలుగు రాళ్లు తప్ప పంట చేలు కనిపించని నా తెలంగాణ. ఎండిన బీళ్లు, నెర్రెలు బారిన పొలాలు, ఇంకిన చెరువులు, ఒట్టిపోయిన ఒర్రెలు, వంకలు మూసుకుపోయిన వాగులు, నీటి జాడలు పాతాళంలో కనిపించని తెలంగాణ పల్లెలు. ఇవీ నా తెలంగాణ బతుకులు. జీవితాల గోసలు. 

నేడు: చిరునవ్వుల తెలంగాణ. చిద్విలాసం చూస్తున్న తెలంగాణ. సిరుల మాగాణ నా తెలంగాణ.

 కోటిన్న ఎకరాలకు సాగు చేరిన తెలంగాణ. పసిడిపంటల కాణాచి తెలంగాణ. పచ్చని పల్లెల తెలంగాణ. పైర్లు పైటలా కప్పుకున్న పచ్చని మాగాణ నా తెలంగాణ. సిరుల సింగారం నా తెలంగాణ. వీరుల తెలంగాణ. ఉద్యమ కారుల తెలంగాణ. నిండైన గౌరవం నా తెలంగాణ. ఆత్మ నిండిన తెలంగాణ. ఆత్మ గౌరవం వెల్లివిరిసిన తెలంగాణ. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. అనువణువూ పులకింత తెలంగాణ. అవమానాలు అంతరించిన తెలంగాణ. సగర్వంగా నిలబడ్డ గెలుపు పతాక తెలంగాణ. నీటి సవ్వడులతో గలగల నవ్వుతున్న తెలంగాణ. జలజలాపారుతున్న తెలంగాణ. కాళేశ్వరంతో కళకళలాడుతున్న తెలంగాణ. కాలువలు ఏరులై పారుతున్న తెలంగాణ. ఏరులన్నీ సజీవమైన తెలంగాణ. చెరువులన్నీ నిండిన నా తెలంగాణ. వాగుల్లో నిళ్లు పరవళ్లు తెలంగాణ. మత్తళ్లు దుంకుతున్న తెలంగాణ. ఒర్రెళ్లల్లో నీటి ఊటలు తెలంగాణ. పొలాల నిండా నీటి తెలంగాణ. పసిడి పంటల తెలంగాణ. ప్రతి గుండె కలల రూపం తెలంగాణ. పోరాడి సాధించుకున్న లక్ష్యం తెలంగాణ. ఉద్యమ కారుడైన కేసిఆర్‌ ఊపిరైన తెలంగాణ. పద్నాలుగేళ్లు పోరాటం చేసి సాధించి, వెయ్యేళ్లు చెప్పుకున్నా తనివి తీరని సంతోషం నిండిన తెలంగాణ. ఆనాటి జ్ఞాపకాలను, ఉద్యమకారుడైన కేసిఆర్‌ పోరాటంలో వేసిన ఎత్తులు, రాజకీయంగా అనుసరించి విధానాలు, ముక్కొటి గొంతులను ఒక్కటి చేసి జై తెలంగాణ అనిపించి తెలంగాణ సాధించిన కేసిఆర్‌ కలల రూపం నేటి తెలంగాణ అంటూ నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు…తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల వేళ ఆయన మాటల్లోనే…

 ఒకనాడు తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు. 

ఎప్పుడు చూసినా కరువే. కాని ఇప్పుడు ఆ మాటకు అర్ధమేమిటో కూడా తెలియనంత అభివృద్ధి తెలంగాణ జరిగింది. దానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక ప్రణాళికా ప్రకారం చేస్తున్న అభివృద్దే నిదర్శనం. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం కొట్లాకు బయలుదేరిన నాటి నుంచే భవిష్యత్తు తెలంగాణ ఎలా వుండాలన్నదానిపై ఒక స్పష్టమైన వైఖరితో వున్నారు. అందుకే ఇంత త్వరగా తెలంగాణ కోలుకోగలిగింది. అన్ని రంగాల్లో అభివృద్ది చెందగలింది. అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. సంక్షేమ రాష్ట్రంగా విరాజిల్లుతుంది. తెలంగాణ రాకుంటే ఇందులో ఏ ఒక్కటీ వుండేది కాదు. అదే గోస..అదే యాతన వుండేది. తెలంగాణ రాకపోతే చెరువులుండేవా? చెరువుల్లో నీళ్లుండేవా? పల్లెల్లో పంటలుండేవా? అదే ఎండిన బావులు, నెర్రెలు బారిన భూములు..అవే వలసలు…అప్పటికే చిద్రమైన పల్లె మరింత దరిద్రమయ్యేది. పల్లె జీవితం చిన్నాభిన్నమయ్యేది. కాని తెలంగాణ రాగానే పల్లెకు వెలుగొచ్చింది. పల్లె మురిసిపోయేంత సంతోషం నిండిరది. ఏళ్ల తరబడి పంటలకు పనికి రాకుండా పోయిన భూముల్లో మళ్లీ పంటల కళ వచ్చింది. ప్రతి ఎకరం సాగుకు యోగ్యమైంది. ఆరు తడి పంటల భూములన్నీ, పొలాలుగా మారాయి. నిత్యం నీటితో కళకళలాడే పంట పొలాలయ్యాయి. ఇదే కదా తెలంగాణ కోరుకున్నది. ఇదే కదా! ప్రతి రైతు ఆశించింది. ఈ నీటి కోసమే కదా! రైతు కన్నీరు కార్చింది. ఏదేశమైనా పాడి పంటలు బాగుంటేనే ఆ దేశం అన్ని రకాలుగా అభివృద్ది చెందుతుంది. ముందు సాగు, ఆపైనే ఇతర బాగు అని పెద్దలు అందుకే అన్నారు. అది తుచ తప్పకుండా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనుసరించారు. ఒకనాడు పంటలంటే, పచ్చని పొలాలంటే సీమాంధ్ర గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నారు. తెలంగాణ లో పచ్చని కాంతిని చూస్తున్నారు. 

  తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అన్నారు. కాని పరాయి పాలకులను పారద్రోలినట్టే చీకట్లను కూడా తెలంగాణ తరిమేసింది. 

వెలుగులు నింపుకున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పుణ్యంతో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతున్నది. సీలేరు నుంచి కరంటు ఇవ్వకున్నా, కోతలు లేని కరంటు మన సొంతమైంది. కేసిఆర్‌ ప్రణాళిక ప్రకారం నిరంతరం కరంటు వస్తోంది. కాని అదే సీమాంద్రలో కరంటు కటకట చూస్తోంది. ఏ రైతుకు కరంటు కష్టం తెచ్చిపెట్టారో..తెలంగాణ రైతు గోస పుచ్చుకున్నారో…అదే తెలంగాణలో 24గంటల కరంటు రైతుకు ఉచితంగా అందుతోంది. రైతు కష్టం తీరుతోంది. రైతు కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకనాడు కరంటు కోసం ఎదురుచూసి, ఎదురుచూసి, రాత్రిళ్లు బావుల దగ్గర నిద్రలు చేసి, పురుగు, పుట్రలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతికిన రైతన్నకు కరంటు అన్ని వేళలా అందుబాటులో వుంటోంది. ఇదీ తెలంగాణ సాధించిన విజయం. తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వారికి కళ్లముందు కనిపిస్తున్న సమాధానం. ఇక రైతు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందిస్తున్న ఏ ఒక్క పధకం దేశంలోనే ఎక్కడా లేదు. ఏరాష్ట్రంలో రైతుబంధులేదు. రైతు భీమా లేదు. రైతు పండిరచిన ధాన్యం నేరుగా ప్రభుత్వమే కొనుగోలు లేదు. తెలంగాణలో అందుతున్న గిట్టుబాటు ధర ఎక్కడా అందడం లేదు. ఇదీ తెలంగాణ రైతు మాత్రమే అందుతున్న వరం. ఇది దేశం మెచ్చిన తెలంగాణ. ఇది కేసిఆర్‌ తెచ్చిన తెలంగాణ. కేసిఆర్‌ చేతిలో రూపు దిద్దుకున్న తెలంగాణ.

1000 కిలోమీట‌ర్లు.. 500 పైగా గ్రామాలు.. 30కి చేరువ‌లో నియోజ‌క‌వ‌ర్గాలు

 

సీఎల్పీ నేత జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క మార్చి 16న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర 85వ రోజు నాటికి
996 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ పాద‌యాత్ర‌లో వంద‌ల 500 పైగా గ్రామాలు.. తాండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు చుట్టేస్తూ సాగుతోంది.

గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లు.. భ‌ట్టి విక్ర‌మార్క‌ను జ‌న నాయ‌కుడిగా పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చే చుక్కానిలా భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ముందుకు సాగుతోంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీకి దూర‌మైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అట్ట‌డుగు, అణ‌గారిన వ‌ర్గాన‌లు తిరిగి పార్టీకి ద‌గ్గ‌ర చేయ‌డంలో భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర విజ‌యం సాధించింద‌ని చెప్ప‌వ‌చ్చు. .

మార్చిన 16న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం బజరహాత్నూర్ మండ‌లం పిప్పిరి గ్రామం నుంచి పాద‌యాత్రను ప్రారంభించారు. ఇప్న‌టికే బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధ‌ర్మ‌పురి, పెద్ద‌ప‌ల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వ‌ర్ధ‌న్న‌పేట‌, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్ పూర్, జ‌న‌గామ‌, అలేరు, భువ‌న‌గిరి, ఇబ్ర‌హీం ప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వ‌రం, రాజేంద్రనగర్, చేవెళ్ల‌, షాద్ న‌గ‌ర్, ప‌రిగి, జ‌డ్చెర్ల‌, నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర సాగింది.

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర కొన‌సాగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం కావ‌డంతో పాటు.. కేడ‌ర్ లో స‌రికొత్త జోష్ నెల‌కొంది. దీంతో ఇప్పుడు పాదయాత్ర వెళ్లని నాయకులనుంచి.. మా నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీద తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. భట్టి పాదయాత్ర నియోజకవర్గాల్లో సాగితే.. పార్టీలో కొత్త జోష్ రావడంతో పాటు, అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో.. పీపుల్స్ మార్చ్ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించన భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క.. సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా మారారు. కాంగ్రెస్ నౌకను గెలుపు తీరాలకు చేర్చే.. తెరచాపలా.. భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు.

ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ హన్మకొండ జనగామ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నల్లగొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగిన తరువాత
ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ముగింపు సభకు దాదాపుగా రెండు లక్షల పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎండల్లో ఎంత యాతన!

`తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుక.

`అటు నాయకులు, ఇటు అధికారులు.

`ఎండలను కూడా లెక్క చేయకుండా అభివృద్ధి పనులు.

`ఉత్సవాలలో ఇరవై రోజుల పాటు ప్రజలతో మమేకం.

`చెరువులో తట్టెడు మట్టి తీయని వాళ్లు కూడా తెగమాట్లాడుతున్నారు.

`ఊరుకు కళొచ్చిందంటే అది బిఆర్‌ఎస్‌ తోనే…

`పల్లెకు వెలుగొచ్చిందంటే బిఆర్‌ఎస్‌ తోనే

`చెరువే ఊరికి ఆదరువు.

`కుల వృత్తులకు బతుకుదెరువు.

`సాగును కాపాడే కల్పతరువు.

`ఊరందరికీ ఉపకారి చెరువు.

`ఆ చెరువును గాలికొదిలేసిన వాళ్లు మాట్లడడం దెయ్యాలు వల్లించడమే?

`తెలంగాణ రాకపోతే చెరువు లేదు.

`పల్లెకు బతుకుదెరువు లేదు.

`పల్లె వికాసమే లేదు.

`అలాంటి పల్లెను కాపాడుతున్నది బిఆర్‌ఎస్‌.

`ప్రజల గుండెల్లో వున్నది బిఆర్‌ఎస్‌.

`ప్రజలకు ఆమడ దూరంలో వున్నవి ప్రతిపక్షాలు.

`అధికారంలో వున్ననాడు పట్టించుకోలేదు…ప్రతిపక్షంలో వుండి ప్రగతిని ఓర్చుకోలేరు.

`అందుకే ప్రతిపక్షాలు ప్రజల దరి చేరడం లేదు.

`ప్రజా సంక్షేమం ప్రతిపక్షాల డిక్షనరీలోనే లేదు.

`అందుకే అభివృద్ధి వారి కళ్లకు కనిపించదు.

`అభివృద్ధి వారికి సహించదు.

`అభివృద్ధి అంటే బిఆర్‌ఎస్‌… సంక్షేమం అంటే కేసిఆర్‌. ఇదీ జనం మాట.

హైదరబాద్‌,నేటిధాత్రి:                తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల వేళ బిఆర్‌ఎస్‌ నాయకులు యాతన పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. అయినా అది ఎంతో సంతోషంగానే స్వీకరిస్తున్నారు. ప్రజల కోసం పడుతున్న ఇబ్బందులను ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఉద్యమ కాలం నాడు అటుకులు బుక్కి ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్‌ నేతలే…ఇప్పుడు అధికారంలో వున్నా, మండుటెండల్లో ప్రజలకు చేరువలో వున్నదికూడా బిఆర్‌ఎస్‌నేతలే…కాని పని లేని ప్రతిపక్షాలు ఇళ్లు కదలకుండా అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ప్రగతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పల్లెల కాంతులను చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందుకే ప్రతిపక్షాలు చేసే విమర్శలను ప్రజలు చీకొడుతున్నారు. ఏనాడైనా గతంలో అధికారంలో వున్న పార్టీలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పనులు చేశారా? అంటూ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఆనాడైనా ఈనాడైనా ప్రజల్లో వున్నది, వుండేది బిఆర్‌ఎస్‌ నాయకులే అంటున్నారు. ఎందుకంటే సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణకు అన్యాయం జరక్కుండా చూసింది కూడా బిఆర్‌ఎస్సే. ఆనాటి పాలకులు చేసిన ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించింది బిఆర్‌ఎస్సే. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు కరంటు బిల్లులు విపరీతంగా పెంచినప్పుడు ప్రశ్నించింది ముందు ఆనాటి ఉప సభాపతిగా వున్న కేసిఆరే…ఆనాడు విద్యుత్‌ చార్జీల ఉప సంహరణకు చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి, ప్రజల్లోకి వచ్చింది కేసిఆరే..అలా ఆయన ప్రజల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా ప్రతిపక్షంలో వున్నా, నేడు అధికారంలో వున్నా ప్రజల్లో వుండే ఏకైక పార్టీ బిఆర్‌ఎస్సే. ఇక తెలంగాణ ఉద్యోగులు సైతం దశాబ్ధి ఉత్సవాలలో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజల మన్నననలు పొందుతున్నారు. గతంలో అధికారులు కార్యాలయాలు వదిలి బైటకు వచ్చేవారు కాదు. నాడు పాలకులు ప్రజల్లోకి వచ్చేవారు కాదు. అదికారులను పనిచేయనిచ్చేవారు కాదు. పాలకుల ఇష్టారాజ్యం అన్నట్లు వుండేది. కాని నేడు ప్రభుత్వ పెద్దలు ఎంతగా ప్రజల్లో వుంటున్నారో, అదికారులు కూడా అంతగా ప్రజలకు చేరువౌతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాని ప్రతిపక్షాలు మాత్రం రోజు రోజురోజుకూ ప్రజలకు దూరమౌతున్నారు. 

 తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు మండుటెండల్లో జరుగుతున్నాయి. 

ఉదయం వేళలోనే సూర్యుడు చుర్రుమంటున్నాడు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజల్లోనే వుంటున్నారు. దశాబ్ధి ఉత్సవాలలో నిత్యం పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులలో కనిపించే అంకితభావం మరో పార్టీలో వుండదు. అందుకే తెలంగాణ ప్రజలు ఇతర పార్టీలకు స్ధానం లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా చెరువుల పండగ అన్నది ఎంత గొప్పగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు, పత్రికలు లేని పోని కథనాలు వండి వార్చడాన్ని ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పల్లెలు ఎలా వుండేవి? ఇప్పుడు ఎలా వున్నాయన్న విషయం తెలిసి కూడా తెలియనట్టు, ప్రజలను ఏమార్చే కనికట్టు ప్రతిపక్షాలు చేయాలని చూస్తే ప్రజలు హర్షించరు. ఇప్పటికే ప్రతిపక్షాలను ప్రజలు ఆదరించడం లేదు. అయినా వారిలో మార్పు రావడం లేదు.

తెలంగాణ వచ్చాక ఊరు మారింది.

 చెదిరిన కల కొత్త రూపును సంతరించుకున్నది. పల్లెకు మళ్లీ కొత్త సొగబు వచ్చింది. పల్లె రూపులకు రేఖలకు కొత్త కళ వచ్చింది. ఎండిన పైర్లు, బీడు వారిన భూములు, పల్లెర్లు మొలిచి పొలంఆనావాలు లేని భూములకు మళ్లీ మట్టివాసన అద్దింది. పూడిపోయిన బావులకు ఊటలు వచ్చాయి. ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో సిసి రోడ్లు వచ్చాయి. పచ్చదనం పెరిగింది. ఊరి చెరువు బాగుపడిరది. చెరువు కట్టలకు కొత్త దనం వచ్చింది. చెరువు కట్టల మీద ఊత వనాలు పురుడుపోసుకున్నాయి. చెరువు కట్టంతా అల్లుకున్నాయి. ఊరే చెరువుకు ఆదరవు. ఊరులో చెరువుంటే ఊరంతటికి కల్పతరువు. ఊరిలో చెరువుంటే, అది నిండుగా వుంటే పంటలకు కొదవలేదు. అందుకే తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెరువుల పండగ మిషన్‌ కాకతీయను మొదలుపెట్టారు. ముందు చెరువుల బాగోగులు చూశాడు. చెరువులను మరమ్మత్తులు చేయించాడు. పాత కట్టల స్ధానంలో మరింత కొత్త కొత్త కట్టలు నిర్మాణం చేయించాడు. చెదిరిన చెరువులను తవ్వించాడు. పూడికను రైతుల భాగాస్వామ్యంతో పొలాలలకు మళ్లింపజేశాడు. చెరువుల పూడిక కార్యక్రమం పండగలా చేయించాడు. ,చెరువులన్నీ గోదారి జలాలలో నింపారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకించారు. దాంతో తెలంగాణ పల్లె రూపు ఒక్కసారిగా మారిపోయింది. వందేళ్ల కింది గొలుసుకట్టు చెరువులకు మళ్లీ కల వచ్చింది. చెరువుల్లోకి నీరొచ్చింది. బావులకు ఊటలొచ్చాయి. ఎండిన బోర్లు ఎల్లబోశాయి. పడావు పడిన భూములు మళ్లీ పొలాలయ్యాయి. వలసవెళ్లి రైతులంతా మళ్లీ ఊళ్లకు చేరుకున్నారు. వ్యవసాయం సాగిస్తున్నారు. రైతు బంధు అందుకుంటున్నారు. పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. అఫ్పులేకుండా వ్యవసాయం సాగిస్తున్నారు. ఇరవైనాలుగు గంటల ఉచిత కరంటు అందిస్తున్నారు. పండినపంటలను రైతు కల్లాల దగ్గరకే అధికారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గతంలో రైతులే మార్కెట్‌ యార్డుకు తరలించి అమ్ముకునే దుస్ధితి నుంచి బైటపడ్డారు. రైతు తన పంట రాశి మీద దర్జాగా కూర్చొకొని తనదగ్గరికే అదికారులొచ్చి కొనుగోలు చేసుకుంటుంటే రాజులా తన ధాన్యాన్ని అమ్ముకుంటున్నాడు. ఇదీ ఇప్పుడు తెలంగాణ రైతు అనుభవిస్తున్న ఠీవి. మరి గతంలో రైతుపరిస్ధితి ఎలా వుండేది. చెరువు దుస్దితి ఎలా వుండేదో ప్రతిపక్షాలకు తెలియంది కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 45 సంవత్సరాలు పాలించినా, ఏనాడు తెలంగాణకు చుక్క నీరు తెచ్చే యోచన చేయలేదు. నాటి పాలకులతో కొట్లాడి సాధించింది లేదు. చెరువుల బాగోగులు చూసంది లేదు. కనీసం చెరువుల పూడిక తీస్తే, తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని అడిగింది లేదు. కాని నేడు చెరువుల పండగతో కులవృత్తులకు మేలు జరిగింది. అందుకే ఊరూరు చెరువుల పండగ జరుపుకుంటోంది. ఒకనాడు చెరువుల్లో నీళ్లు లేవు. చేపలు లేవు. ముదిరాజ్‌లకు ఉపాధి లేదు. కాని నేడు చెరువుల్లో పుష్కలమైన మత్య్స సంపద. ముదిరాజ్‌కు కళ్లముందు ఉపాధిపండగ. రజకులకు కూడా చెరువుల ద్వారా కుల వృత్తిపోషణ జరుగుతోంది. ఇలా రైతులకు మేలు జరుగుతోంది. చెరువు కట్టలపై వెలసిన ఈత వనాల మూలంగా గౌడసామాజిక వర్గానికి మరింత ఉపాది దొరికింది. ఇలా చెరువు ఊరికి కల్పతరువైంది. పూర్వం తెలంగాణ పల్లె సింగారం మళ్లీ ఇప్పుడు కళ్లముందు కదలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాలలో చెరువు ఒక గొప్ప వరంగా మారింది. ప్రజలకు జీవనాడిగా మారింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే, ఊరు బాగు పడిరదంటే అది ముఖ్యమంత్రి కేసిఆర్‌పుణ్యమే…ఆయన ఆలోచనల రూపమే…పచ్చని పైట సింగారించకున్న పల్లె ముస్తాబుకు సాక్ష్యమే..

కూసుకుంట్లకిస్తే ఒప్పుకోం?

`ఈసారి మాత్రం అసలే సహకరించం?

`మాకు విలువివ్వని కూసుకుంట్ల కోసం పని చేయం.

`కేవలం పార్టీ ఆదేశాలకు బద్దులై కూసుకుంట్లను గెలిపించాం.

`కార్యకర్తలను పట్టించుకున్నది లేదు.

`నాయకులకు అండగా నిలిచింది లేదు.

`ఎన్నికల సమయంలో నాయకులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చింది లేదు.

`పార్టీ కోసం ఎంత కష్టమైనా పడతాం.

`కూసుకుంట్లకు ఇస్తే మాత్రం సహకరించం.

`మునుగోడులో బిఆర్‌ఎస్‌ బలంగా వుంది.

`కూసుకుంట్లకిస్తే మొదటికే మోసానికొస్తుంది.

`ఈసారి బిసిలకిస్తేనే బెస్ట్‌!

`గత ఉప ఎన్నికలలో కూడా పార్టీ శ్రేణులు కోరిందిదే!

`సార్వత్రిక ఎన్నికలలో బిసికి టికెట్‌ ఇస్తే బిఆర్‌ఎస్‌ గెలుపు గ్యారెంటీ!

`కూసుకుంట్ల కోసం రెండు నెలలు సహకరించింది నేటిధాత్రి.

కూసుకుంట్ల పనితీరును ప్రశ్నించే హక్కు నేటిధాత్రి కె ఉంది

`పని చేయకుంటే నిలదీస్తామని ముందే చెప్పింది నేటిధాత్రి.

`అందుకే నేటిధాత్రి కి పిర్యాధులందుతున్నాయి.

`మునుగోడు గ్రౌండ్‌ రిపోర్ట్‌ నేటిధాత్రి చేతిలో…

`నేటిధాత్రి కథనంపై కూసుకుంట్ల అక్కసు.

`గెలిపించిన వాళ్లకు ప్రశ్నించే హక్కుంటుందని మర్చిపోయిన కూసుకుంట్ల.

`ఈసారైనా ప్రజల మనసు చూరగొనేలా వ్యవహరించమని చెప్పాం.

`అయినా కూసుకుంట్లలో మార్పులేదంటున్న జనం.                                     

హైదరబాద్‌,నేటిధాత్రి: 

నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైనట్లు…ప్రజలు నాయకుడిగా ఎన్నుకున్నాక కూడా తీరు మారకుంటే ఇంతకంటే ఏ మంటారు? రాజకీయాలు కావాలి. పదువులు కావాలి. పెత్తనం నడదవాలి. కాని ప్రజల్లో వుండను. ప్రజల సమస్యలు పట్టించుకోను. ప్రజలను దరి చేరనీయను. పార్టీకి అండగా నిలవను. పార్టీ నాయకులను కలవను. వారిని ప్రోత్సహించను. వారికి ఎలాంటి దారి చూపను. రాజకీయంగా వారి ఉన్నతిని కోరుకోను? వారెవరికీ అందుబాటులో వుండను. కాని ఎన్నికలప్పుడు మాత్రం వారు పనిచేయాలి. తన గెలుపుకోసం కష్టపలి. తనను గెలిపించాలి. ప్రతిసారి నేనే నిలబడాలి. మీరంతా నా గెలుపుకోసం కృషి చేయాలి. గెలిపించి మళ్లీ ఎన్నికల దాకా నన్ను మర్చిపోవాలి. ఇదీ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తీరని అటు జనం, ఇటు పార్టీ నాయక గణం చెప్పుకుంటున్న మాట. పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాలి. ఉద్యమ కారుడిగా పదవులు కావాలి. కాని ప్రగతిని కాంక్షించలేని, అభివృద్ధి గురించి తాపత్రయపడని నాయకుడు ఎవరైనా వున్నారంటే అది మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్లనే అని జనం చెబుతున్నారు. అదేంటో జనంలో లేకపోయినా, జనం వద్దనుకున్నా, కొన్ని సార్లు అదృష్టం కలిసొచ్చి పదవులు వరిస్తుంటాయి. అయినా వాళ్లు ప్రజల కోసం ఆలోచించరు. 2014 ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలిచారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ మొత్తం బిఆర్‌ఎస్‌ ప్రభంజనం కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా బిఆర్‌ఎస్‌ 88 సీట్లు గెల్చుకున్నది. కాని మునుగోడు కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నది. మునుగోడు అభివృద్ధి జరగలేదా? అంటే తెలంగాణలోని అన్ని నియోకవర్గాల కంటే ఒకింత ఎక్కువే జరిగింది. అప్పటి వరకు మునుగోడులో వున్న సమస్యలన్నీ దాదాపు తీరాయి. అయినా మునుగోడులో కూసుకుంట్ల ఎందుకు ఓడిపోయాడు? అంటే మునుగోడు అభివృద్ధి జరిగింది వాస్తవం. కాని ఆ ముగుగోడు అభివృద్ధిలో కూసుకంట్ల పాత్ర లేదనేది కూడా మరింత వాస్తవం. మునుగోడు అభివృద్దిపై ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టి, ప్రగతిపై ప్రత్యేక శ్రద్దపెట్టి అతి తక్కువ కాలంలో మునుగోడు రూపు రేఖలు మార్చాడు. పైలెట్‌ ప్రాజెక్టుల కింద మునుగోడును ముందంజలో నిలిపారు. మునుగోడును అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. కాని ఆ అభివృద్ధిలో కూసుకుంట్ల పాత్ర ఎంత? అంటే ఆయనే చెప్పలేనంత? ఎందుకంటే జరిగిన అబివృద్ది కళ్ల ముందు కనిపిస్తున్నది. కాని 2018 ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయాడు. అంటే అక్కడ పార్టీ ఓడిపోలేదు. ఎమ్మెల్యే వ్యవహార శైలి మాత్రమే ఓటమిపాలయ్యింది. అంతగా మునుగోడు అభివృద్ధి జరిగినా ఆయన ఖాతాలో పడలేదంటే ఆయన నిర్లక్ష్యం ఎంతో చెప్పకనే చెప్పొచ్చు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలంతా బంబపర్‌ మెజార్టీతో గెలిచారు. దాదాపు సగం మంది బిఆర్‌ఎస్‌ ఎమ్యెల్యేలు 50 వేలు, 60వేల మెజార్టీపైనే గొప్ప విజయాలు సొంతం చేసుకున్నారు. కాని మునుగోడులో కూసుకుంట్లను ప్రజలు ఆదరించలేదు. కేవలం ఉద్యమ కారుడన్న ఒకే ఒక్క కారణంతో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎంత మంది టికెట్‌ కోసం ఆశించినా అందిరినీ కాదని మళ్లీ కూసుకుంట్లకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అవకాశం కల్పించారు. ఒక్క కూసుకుంట్ల కోసం బిఆర్‌ఎస్‌ యంత్రాంగమంతా దిగి ప్రచారం సాగించింది. మరి అదంతా కూసుకుంట్లకు గుర్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఎలా వున్నాడో? ఇప్పుడూ అలాగే వున్నాడు. ఎక్కడా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ప్రజలను పట్టించుకునేంత తీరిక లేదు. ఎండల్లో బైటకు రాలేదు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఆలోచన లేదు. పార్టీ కార్యకర్తల సమావేశాలు పెద్దగా ఏర్పాటు చేసింది లేదు. సమన్వయం అన్నది అసలే లేదు. ఇది బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు భహిరంగంగానే చెబుతున్న మాట. విమర్శిస్తున్న మాట. ఎన్నికల ముందు పార్టీకి చెందిన నేతలంతా అసమ్మతి రాగమే ఆలపించారు. ఆయనకు మద్దతుగా నిలబడిన వారు ఎవరూ లేరు. అయినా పార్టీ ఆదేశాలు క్రమశిక్షణ కలిగిన పార్టీ యంత్రాంగం శిరసావహించింది కూసుకుంట్లను గెలిపించింది. మరి కూసుకుంట్ల ఏం చేశాడన్నదే ఇక్కడ ప్రశ్నగా మారింది. 

ఉప ఎన్నికల్లో రెండు నెలల పాటు కూసుకుంట్లకు మద్దతుగా, తెలంగాణ ఉద్యమంలో భాగాస్వామ్య పత్రికగా ఇప్పటికీ తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ నిర్మాణంలో లో పాలు పంచుకుంటున్న తెలంగాణ పత్రిక నేటిధాత్రి.

 మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మునుగోడు ప్రగతిపై ఏ పత్రిక రాయనటు వంటి వార్తలు రాసింది ఒక్క నేటిధాత్రి మాత్రమే. మునుగోడుపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎంత ప్రేమ వుందనేది కూడా చూపించింది నేటిధాత్రి మాత్రమే. ఫ్లోరైడ్‌ సమస్య తరిమేసిన విషయాన్ని మళ్లీ ప్రజల ముందు పెట్టింది నేటిధాత్రినే. కూసుకుంట్లకు పార్టీ శ్రేణులు వ్యతిరేకంగా జట్టు కట్టినా, అందరినీ ఒక్కటి చేయడంతో నేటిధాత్రి చూపిన కూసుకుంట్ల మర్చిపోకూడదు. కూసుకుంట్లకు క్లిష్ట కాలంలో అండగా నిలిచింది కూడా నేటిధ్రాతినే. మరి అలాంటి నేటిధాత్రి మునుగోడులో పరిస్దితులను ఎప్పటికిప్పుడు వివరిస్తుంటే కూసుకుంట్లకు నచ్చడం లేదు? అందుకు నేటిధాత్రి మీద విషం చిమ్ముతున్నాడు. కూసుకుంట్లను నిలదీసే హక్కు నేటిధాత్రికి మాత్రమే వుంది. నేటిధాత్రి ఇచ్చిన నైతిక మద్దుతు, అక్షరాల కవచం అంత గొప్పది. మేలు చేసిన వారిని మర్చిపోయిన వ్యక్తైనా, వ్యవస్ధ అయినా మనుగడ కష్టం. అదే ఇప్పుడు కూసుకుంట్లకు కూడా కనిపిస్తోంది. ఎంతో కష్టపడి పార్యీ శ్రేణులన్నీ ఏకమైన కూసుకంట్లను గెలిపిస్తే వారిని కనీసం పట్టించుకోవడం లేదన్న విషయాలు అనేకం నేటిధాత్రి దృష్టికి వస్తున్నాయి. నిజానికి మునుగోడులో పార్టీ ఎంతో బలంగా వుంది. కాని కూసుకుంట్ల నాయకత్వమే బలహీనంగా వుంది. అలాంటి నాయకుడిని ప్రతిసారి కాపాడుకుంటూ రావడం పార్టీకి కూడా తలకు మించిన భారమే అవుతుంది. ఉప ఎన్నిక అంటే అందరూ వచ్చి కూసుకుంట్లకు మద్దతుగా నిలిచారు. ప్రచారం సాగించారు. కాని సార్వత్రిక ఎన్నికల్లో కూసుకుంట్ల ఒంటిరి పోరు చేయాల్సివుంటుంది. అది ఆయన వల్లకాని పని. అప్పనంగా మళ్లీ 2018 ఎన్నికల్లో జరిగినట్లు జరిగేందుకు కూడా కూసుకంట్లే కారణం కావొచ్చు. అందుకే ప్రజలు ఆసారి ఎలాగైనా కూసుకుంట్లను పక్కన పెట్టాలని కోరుతున్నారు. మునుగోడులో ఏం జరుగుతోంది. ప్రజలు ఏం అనుకుంటున్నారన్నది పూర్తిగా నేటిధాత్రి చేతిలో రిపోర్టు వుంది. పార్టీ నాయకులు చేసిన పనులకు బిల్లులు కూడా కూసుకంట్ల ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడంటే ఇక పార్టీ కోసం పనిచేయమంటే ఎలా చేస్తారు? సొంత పార్టీ నేతలను కూసుకుంట్ల ఇబ్బందుల పాలు చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం కూసుకంట్ల వల్ల ఉప ఎన్నికల సమయంలో పార్టీ కూడా కొంత దెబ్బతిన్నది. బిసి సామాజిక వర్గానికి చెందని బలమైన నాయకుడు, ఉద్యమకారుడైన ఓ నేత పార్టీని వదిలి వెళ్లిపోయాడు. మునుగోడులో ఎంతో బలమైన మూడు బిసి, సమాజిక వర్గాలకు చెందిన నాయకులను కాదని, కూసుకుంట్లకు టిక్కెట్‌ ఇస్తే దానిని నిలుపోకపోవం ఆయన వ్యవహార శైలికి నిదర్శనమంటున్నారు. ఈసారి కూసుకుంట్లకు కాకుండా, బసిలలో ప్రజల కు చేరువగా వుంటున్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆ నేతల్లో ఎవరినో ఒకరిని ఎంపిక చేయాల్సిన అవసరవం వుంది. ప్రజల క్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నేతలున్నారు. అలాంటి వారి గురించి మునుగోడులో కూడా మంచి పేరుంది. అలాంటి నాయకుడిని గుర్తించాలి. ఒక వేళ మళ్లీ కూసుకుంట్లను ప్రజల మీద రుద్దితే మాత్రం 2018 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావడం ఖాయం? అంటున్నారు జనం.

నూతన వధూవరులను ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్

మునుగోడు నియోజకవర్గం

మునుగోడు మండలం కొరటికల్ గ్రామ వాస్తవ్యులు బోనగిరి లక్ష్మయ్య – మల్లమ్మ గారి కుమారుడు నర్సింహా – స్నేహ గారి వివాహ వేడుకకి హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించి శుభాకాంక్షలు తెలియజేసిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు.*

 

ఈ కార్యక్రమంలో మునుగోడు మండల వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్ గారు, కొరటికల్ గ్రామ పంచాయతీ 10 వార్డ్ సభ్యులు అరేకంటి నర్సింహా గారు, బిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు జంగిలి నాగరాజు గారు, మునుగోడు పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారు మల్లేష్ గారు, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఉప అధ్యక్షులు సిర్గమళ్ళ అంజయ్య గారు, బోనగిరి లక్ష్మణ్ గారు, తమ్మల పురుషోత్తం గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

టిడిపి+బిజేపి-కాంగ్రెస్=బీఆర్ఎస్‌

 

రేవంత్ రెడ్డి నోటికి చంద్రబాబు తాళం?

తన రాజకీయమా! గురు దక్షిణకు కాంగ్రెస్ ను ముంచడమా!?

అడకత్తెరలో రేవంత్?

చంద్రబాబు కోసం తన భవిష్యత్తు తుంచుకుంటాడా?

అటు సీనియర్లు! ఇటు చంద్రబాబు!!

టిడిపి ని తిట్టలేడు.

బిజేపిని మెచ్చుకోలేడు.

ఆ పొత్తును అనైతికం అనలేడు.

ఓటుకు నోటు కోసం అప్పుడు!

బిజేపి పొత్తుతో ఇప్పుడు!!

రేవంత్ ఆశలపై ఊహించని దెబ్బలు!

చంద్రబాబు ను నమ్మినందుకే ఇన్ని తిప్పలు?

రేవంత్ తొందరపాటుకు పర్యవసానాలు!

ఆ పొత్తును తూర్పార పట్టకపోతే రేవంత్ కు మనుగడ లేదు.

చంద్రబాబును రాజకీయం ఇప్పటికీ రేవంత్ తెలుసుకోవడం లేదు.

కాంగ్రెస్ ను ఫణంగా పెడతాడా?

తానే టిడిపి గూటికి చేరుతాడా?

కాంగ్రెస్ సీనియర్ల భయం నిజం చేస్తాడా?

రేవంత్ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

హైదరబాద్‌,నేటిధాత్రి:  

ఊహలకు, ఊహించని మలుపులు తోడైతే ఆ రాజకీయం రసతవత్తరంగా వుంటుంది. కాని అనుభవించే నాయకులకు మాత్రం భవిష్యత్తుపై గందరగోళం నెలకొంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అదృష్టమో, లేక తెలంగాణ ప్రజల బలమైన కోరికో గాని ప్రతిపక్షాల వల్ల కూడా బిఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరు. తెలంగాణ రాజకీయం వేరు. ఇక్కడ రెండు ప్రాంతాల ప్రజలు, నాయకులు, పార్టీలు వుండడం మూలంగా జనం నాడి అంతు చిక్కకుండా వుంటుంది. ముఖ్యంగా ఈసారి రాజకీయాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవంత్‌ రెడ్డికి మళ్లీ గట్టి దెబ్బ తగిలే అవకాశమే కనిపిస్తోంది. అదేంటో వ్యక్తిగత రాజకీయం ఎంత ఎదిగినా, రేవంత్‌ రెడ్డి ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ పరిస్థితి చెప్పలేని విధంగా తయారౌతోంది. రేవంత్‌రెడ్డి రాజకీయ ఓనమాలు బిఆర్‌ఎస్‌నుంచి మొదలైనా, గుర్తింపు రాజకీయాలు తెలుగుదేశంతో ఆరంభమయ్యాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. దాంతో రేవంత్‌రెడ్డి క్రియాశీల రాజకీయాలు ఆపార్టీకి అవసరమయ్యాయి. చంద్రబాబు బాగానే పార్టీకి వాడుకోవాలని అనుకున్నాడు. దాంతో రేవంత్‌కు చంద్రబాబు ప్రాదాన్యతనిస్తూ వచ్చారు. అది వ్యక్తిగతంగా రేవంత్‌కు గుర్తింపుతెచ్చింది. కాని పార్టీ రాజకీయం ఆగమ్యగోచరమైంది. ఇంతలో తెలంగాణ వచ్చింది. మొత్తానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అడ్రస్‌ లేకుండాపోయింది. చంద్రబాబు తెలంగాణను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అందుకు కారణం కూడా రేవంత్‌రెడ్డే కావడం గమనార్హం. చంద్రబాబు చెప్పాడని ఓటుకు నోటు కేసులో కూడా రేవంత్‌ ఇరుకున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కన్నెర్ర చేయడంతో చంద్రబాబు రాత్రికి రాత్రే తట్టాబుట్టా బుట్ట సర్ధుకొని పోయాడు. హరిహర బ్రహ్మాధులొచ్చినా చంద్రబాబును కాపాడలేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేసరికి తెలంగాణ వైపు చూడడమే మానేశాడు. దాంతో తెలుగుదేశం మనుగడ సాగించడం కష్టమైంది. ఆ పార్టీ నుంచి చాలా మంది నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరడం జరిగింది. తెలుగుదేశంలో రేవంత్‌రెడ్డి వ్యవహారం నచ్చని వాళ్లంతా రేవంత్‌కు అప్పటికే పొగపెట్టారు. కాకపోతే రేవంత్‌ జైలుకెళ్లాడు. వచ్చిన తర్వాత తెలుగదేశంలో ఇమడలేకపోయాడు. ఇక ఎటూ కాని రాజకీయ ఊగిసలాటలో వున్న రేవంత్‌ భవిష్యత్తు నిర్ధేనంలో చంద్రబాబు కీలకభూమిక పోషించారు. కాంగ్రెస్‌తో మాట్లాడి ఆ పార్టీలో రేవంత్‌కు స్ధానంకల్పించారు. పనిలో పనిగా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి కూడా ఇప్పించారు. ఇంతలో ఆంద్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో నిలువ నీడ లేకుండాపోయింది. రాజకీయం చేద్దామన్న ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండాపోయింది. దాంతో చంద్రబాబు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో నివాసం తెలంగాణలో అన్నట్లు తయారైంది. ఇంకో ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం రాజకీయాలు దూరమైతే, ఆ పార్టీ ప్రజలకు దూరమవడం ఖాయం. చంద్రబాబు తనయుడు లోకేష్‌ రాజకీయం క్లోస్‌. అందుకే లోకేష్‌తో చంద్రబాబా పాదయాత్ర మొదలుపెట్టించాడు. ఏ బిజేపితో వైరం పెంచుకున్నాడో అదే పార్టీతో మళ్లీ పొత్తుకోసం చంద్రబాబు పాకులాడుతున్నాడు. గత కొంత కాలంగా బిజేపి పెద్దలను కలవాలని ఆరాపడ్డాడు. ఆఖరికి ఇటీవల అమిత్‌షాతో పాటు, బిజేపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు బేటీ అయ్యారు. రాజకీయాలు మాట్లాడుకున్నారు. తెలంగాణలో కలసి సాగేందుకు ముందు ఎన్నికల ట్రయల్‌ మొదలుపెడదామని అంగీకారానికి వచ్చారు? తెలుగుదేశం, బిజేపి కాంబోపై క్లారిటీ వచ్చినట్లే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సుబ్బి పెళ్లి వెంకి చావుకొచ్చినట్లు చంద్రబాబు బిజేపితో కలవడంతో రేవంత్‌ పరిస్ధితి కుడిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. మింగలేక, కక్కలేని స్ధితికి వచ్చేసింది. ఎటూ పాలుపోని స్ధితికి నెట్టేయబడ్డటైంది. అసలైన రాజకీయం ఇప్పుడు తెలంగాణలో మొదలు కాబోతోంది. 

అసలు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలనుకున్నప్పటి నుంచి ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తూనే వున్నారు.

 రేవంత్‌ పార్టీలో చేరిన తర్వాత కూడా వ్యతిరేకించారు. పిసిసి. అధ్యక్షుడు కాగానే రేవంత్‌ రెడ్డి యాభైకోట్లు పెట్టి ప్రెసిడెంటు పదవి కొన్నాడని సాక్ష్యాత్తు ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అప్పటినుంచి సీనియర్లు రేవంత్‌రెడ్డి మీద కత్తికట్టారు. ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌ను తూర్పారపడుతున్నారు. ఆయనను పార్టీ నుంచి తరిమేయాలనే చూస్తున్నారు. ఇప్పటిదాకా కాలం కలిసిరాలేదు. అధిష్టానం కూడా సీనియర్లు చెప్పిన మాట వినలేదు. రేవంత్‌ రెడ్డి రాజకీయం చాలా విచిత్రమైంది. ఆయన ఏ సభ నిర్వహించినా సక్సెస్‌ అవుతుంది. ఏ ర్యాలీ తీసినా గొప్పగా ప్రచారం జరుగుతుంది. కాని ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌ పరిస్ధితి అద్వాహ్నంగా తయారౌతుంది. హుజూరాబాద్‌ 2018 ఎన్నికల్లో 60వేల ఓట్లు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి, ఉప ఎన్నికల్లో మూడువేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు రేవంత్‌రెడ్డిని సీనియర్లు ఒక ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడ రాలేదు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన రేవంత్‌రెడ్డికి ప్రజల నుంచి చేదు అనుభవమే ఎదురైంది. ఇక రేవంత్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినా పాదాల మీద నడవలేక, అక్కడక్కడ పాదాలను భూమి మీద మోపి సాగించారనే విమర్శలు కూడా ఎదుర్కొనాన్నారు. ఆఖరకు షర్మిల చేత కూడా తిట్టించుకున్నారు. పాదయాత్ర అంటే ఎలా చేయాలో క్లాస్‌ పీకించుకున్నారు. అయితే పాదయాత్రలో ఎదురైన ప్రజలు రేవంత్‌ను చాలా వరకు గుర్తు పట్టలేదు. చివరికి నేను ఎవరు ? అంటే కూడా ప్రజలు ఏమో? అన్నట్లు మొహం పెట్టి, రేవంత్‌కు చుక్కలుచూపించారు. అయినా రేవంత్‌రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు తెలంగాణలో ఊపును తెచ్చిందని ప్రచారం జోరుగా సాగింది. ఇంతలోనే రేవంత్‌రెడ్డికి పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. తన రాజకీయ గురువుగా చెప్పుకునే చంద్రబాబు మళ్లీ బిజేపితో కలుస్తున్నాడన్న వార్త విన్న తర్వాత రేవంత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒక వేళ బిజేపి, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొడుపులు జరిగితే మాత్రం ముందు నష్టపోయేది రేవంత్‌రెడ్డి రాజకీయమే! ఎందుకంటే ఈ రెండు పార్టీలు జతకట్టి గతంలోనే కాంగ్రెస్‌ను ఖతం చేసే పని పూర్తి చేశాయి. మళ్లీ ఇప్పుడు కొత్త కలయిక జరిగినా కాంగ్రెస్‌ మీద యుద్దం ఆపరు. తెలుగుదేశంపార్టీకి బిఆర్‌ఎస్‌ మీద గురి వున్నప్పటికీ, బిజేపికి ముందు కాంగ్రెస్‌ మీద కసిని చూపించకుండా వుండలేవు. అందువల్ల తెలుగుదేశం, బిజేపిలు కలిసి బిఆర్‌ఎస్‌ మీద యుద్దం మొదలుపెట్టినా, ముందు కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేసే పని మాత్రమే పెట్టుకుంటారు. అదే జరిగితే ఆది నుంచి సీనియర్లు చెప్పిందే నిజమౌతుంది. రేవంత్‌ రెడ్డి రాజకీయం త్రిశంకు స్వర్గమౌతుంది. లేదా రేవంత్‌రెడ్డి సరిగ్గా ఎన్నికల మందు వదిలేసి తెలుగుదేశంలో చేరాల్సివస్తుంది. అదే జరిగితే రేవంత్‌రెడ్డి మీద ప్రజలకు వున్న ఆ కాస్త నమ్మకం కూడా పోతుంది. ఏ రకంగా చూసినా రేవంత్‌కు ఇబ్బందికరమే. కాంగ్రెస్‌లో వుంటూ చంద్రబాబుపై కాలు దువ్వలేడు. బిజేపికి లొంగిపోలేడు. కాంగ్రెస్‌ను వదిలిపోవడమొక్కటే శరణ్యమౌతుంది. ఎటు చూసినా రేవంత్‌కు దారులు మూసుకుపోవడం పక్కా…

ఎర్రబెల్లి కి ఎదురా…ఇంపాజిబుల్‌!

-ఎర్రబెల్లిని ఢీ కొట్టడం అంత సులువు కాదు.

-ఎర్రబెల్లి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకే రాజకీయ వరం.

-ఎర్రబెల్లి జనం గుండెల్లో సంజీవని.

-ఉమ్మడి జిల్లాలోనే తిరుగులేని నేత.

-ఎర్రబెల్లి చేసేది సేవా రాజకీయం…

-ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్క ఎర్రబెల్లికే అది సాధ్యం.

-ప్రాంతాలకు అతీతంగా సేవ చేసే నాయకుడు.

-నాలుగు దశాబ్దాల బలమైన సేవా పునాదులు

-దయన్నా! అంటే దయచూపిస్తాడు.

-ఆపద అంటే ఆదుకుంటాడు.

-ఆరోగ్యాల విషయంలో నియోజకవర్గం మొత్తం తండ్రిలా కాపాడుకుంటాడు.

-2014 నుంచి పాలకుర్తి దశ మార్చిన నేత.

-2014 డెంగ్యూ జర్వాల నుంచి ప్రాణాలను కాపాడిన ప్రాణదాత.

– ప్రతి ఊరిలో అంబులెన్స్‌ ఏర్పాటు చేసి, వందల మంది ప్రాణాలు కాపాడాడు.

-హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసి, వైద్యం అందించాడు.

-పరిస్థితిని బట్టి అంబులెన్స్‌ ల ద్వారా సొంత ఖర్చుతో ప్రైవేట్‌ ఆసుపత్రులలో చికిత్స చేయించాడు.

-పల్లెలలను సుందరంగా తీర్చిదిద్దాడు.

-నియోజకవర్గంలో ప్రజలు సీజనల్‌ జ్వరాల బారిన పడకుండా చూసుకుంటున్నాడు.

– కరోనా కాలంలో ఎంతో మందిని ఆదుకున్నాడు.

– పెద్ద ఎత్తున ప్రజల ఆహార అవసరాలు తీర్చాడు.

– వందలాది మందికి ఉచితంగా కరోనా చికిత్సలు చేయించాడు.

-అతి ఖరీదైన వైద్యం కూడా సొంత ఖర్చులతో అనేక మందికి చెయించాడు.

– నియోజకవర్గం సుందరంగా తీర్చిదిద్దాడు.

-పంచాయతీకి రాజ్‌ శాఖకు దేశంలోనే అనేక అవార్డులు తెచ్చిపెట్టాడు.

-ప్రజలకు అండగా వుంటూ, అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందుంచాడు.

-ఎదురులేని రాజకీయం చేయడంలో దిట్టు.

-తిరుగులేని నాయకత్వం ఎర్రబెల్లి సొంతం.

-ఓటమెరగని నేతగా రికార్డు.

-ఎన్‌ఆరైలు టూరిస్టులు…

-వచ్చి వెళ్లేవారు ప్రజాసేవ చేయలేరు.

-కేవలం రాజకీయాల కోసం వచ్చేవారు…ఎన్నికల కోసమే వస్తారు.

-ఓడిపోయి జనం ముఖం చూడని వాళ్లు ఎంతో మంది వున్నారు.

-నాలుగు రోజుల రాజకీయ అవతారులను ప్రజలు నమ్మరు.

– ప్రజల గుండెల్లో వున్న ఎర్రబెల్లిని దూరం చేసుకోరు. 

హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు ముందు ఎన్నికల బరిలో నిలబడం అంటే పులి ముందు ప్లూట్‌ ఊదడమే అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఓటమి అంటే ఎమిటో తెలియదు. అది ఎలా వుంటుందో కూడ తెలియదు. ఎందుకంటే ఆయనకు ప్రజాభిమానం ఎక్కువ. ప్రజాదరణ ఎక్కువ. ప్రజలను గుండెల్లో పెట్టుకునే నాయకుడు దయాకర్‌రావు. అందుకే నాలుగు దశాబ్ధాలుగా ఆయన ఎదురులేని నాయకుడిగా, తిరుగులేని ప్రజాప్రతినిధిగా వెలుగొందుతున్నారు. ప్రత్యక్ష్య ఎన్నికల ప్రస్దానంలో ఆయను ఎదరులేదు. ఆయనకు ఎదురుగా నిలబడిన నాయకులు మళ్లీ రాజకీయాలు చేసింది లేదు. ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన పెద్దగా ప్రయాస పడిరది కూడా లేదు. ఎంతో సునాయాసంగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వచ్చారు. గతంతో 2004లాంటి కాంగ్రెస్‌ ప్రభంజన కాలంలోనూ గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కూడా ఆయన గెలిచారు. అంటే కాలమేదైనా, పరిస్ధితులు ఏవైనా, రాజకీయాలకు అతీతమైన ప్రజాభిమానం ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతం. గతంలో ఆయన వరసగా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత డీలిమిటేషన్‌ కారణంగా పాలకుర్తినుంచి పోటీ చేస్తున్నారు. అప్రతిహాతంగా గెలుస్తూ వస్తున్నారు. మధ్యలో పార్లమెంటుకు కూడా పోటీ చేసి గెలిచిన ఘనత ఎర్రబెల్లి దయాకర్‌రావుది. ఇలా వరసగా ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ గెలిపిస్తూ వస్తున్నారంటే, ప్రజలంటే ఆయనుకు ఎంత నమ్మకంతో తెలుసుకోవచ్చు. ప్రజలకు ఆయననంటే ఎంత అభిమానమో తెలుసుకోవచ్చు. అలాంటి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఆయన ఢీ కొట్టిన నాయకుడు లేడు. ఎప్పుడూ మంచి విజయాలే..మెజార్టీ గెలుపులే. ఆయన రాజకీయ జీవితం మీద దెబ్బకొడదామని చాలా మంది చూశారు. కాని వాళ్లే దెబ్బతిన్నారు. ఆయన మీద ఆధిపత్యం చేయాలని చూలా మంది చూశారు. కాని వాళ్లే అడ్రసు లేకుండాపోయారు. అంతే కాదు ఎర్రబెల్లిని రాజకీయంగా ఎదుర్కొలేక, నిలబడలేక, ఓపికలేక, ఇక తమ వల్ల కాదని చాలా మంది క్రియాశీల రాజకీయాలకు కూడా చాలా మంది దూరమయ్యారు. కాని ఎర్రబెల్లి ఎదుగుతూనే వస్తున్నాడు. గెలుస్తూ విజయాలతో వారికి సవాలు విసురుతూనే వున్నాడు. ఎర్రబెల్లిని అణిచివేయాలని కూడా కొందరు చూశారు. కాని వాళ్లే ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న ఎర్రబెల్లిని చూస్తూ, కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఆయన కీర్తి ప్రతిష్టలను చూసి, కుళ్లుకుంటున్నారు. అదీ ఎర్రబెల్లి రాజకీయం అంటే..ప్రజాసేవకు ఆయన ప్రజలనుంచి పొందుతున్న ఆదరణకు నిదర్శనం. ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఎర్రబెల్లి హవా ఆగలేదు. ప్రజల్లో ఆయనకు ఆదరణ ఇసుమంత కూడా తగ్గలేదు. ఆయన ఎక్కడా తలవంచలేదు. ఆయనను నమ్మి ఎనుకున్న ప్రజలకు నష్టం చేయలేదు. ఆయా పార్టీలకు తలవంపులు తేలేదు. దుష్టపన్నాగాలు ఏనాడు పన్నలేదు. చాటామాటు రాజకీయాలకు ఒడిగట్టలేదు. ఏది చెప్పినా ముక్కుసూటిగానే, ఏది చేసినా నిర్మొహమాటంగానే చేశారు. అదే ప్రజలు మెచ్చారు. ఎర్రబెల్లికి అండగా నిలుస్తున్నారు. ఆదరిస్తున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా తన రాజకీయం తాను చేసుకుపోవడం, ప్రజలకు మేలు చేయడం, నియోజకవర్గం అభివృద్ది చేయడం తెలుసు. తనకు అప్పగించిన మంత్రిత్వశాఖను సమర్ధవంతంగా నిర్వహించడం మాత్రమే ఎర్రబెల్లికి తెలుసు. వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా, మొక్కవోని ధైర్యమే ఆయన సొంతం..అదే ఆయన విజయాలకు చిహ్నం. ప్రజాసేవకు నిదర్శనం.

ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు. ప్రజాసేవ చేయొచ్చు.

 కాని ఇటీవల ప్రజా సేవ అనేదానికన్నా, రాజకీయం అన్నది ఎక్కువ ప్రచారంలోకి వచ్చి, ఎంతైనా ఖర్చు చేస్తా..ఎన్నికల్లో నిలుస్తా? అనుకుంటున్నారు. కాని ఒక్కసారి రాజకీయంలోకి దిగితే గాని అసలు లోతు తెలియదు. ప్రజా సేవతో రాజకీయం చేయడం వేరు..రాజకీయాల కోసం ప్రజాసేవ ముసుగేసుకోవడం వేరు. ఈ రెండు తెలియక ఇటీవల కాలంలో చాలా మంది తెలియని తనంతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. అయినా ప్రజలు ఎంతో విజ్ఞలు. రాను రాను రాజకీయాలంటే అలుసైపోతున్నాయి. పైసలుంటే చాలు రాజకీయాలు చేయొచ్చనే భ్రమలు బాగా పెరిగిపోతున్నాయి. చదువుకొని భవిష్యత్తును నిర్ధేశించుకన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వుండదు. కాని నాలుగు పైసలు సంపాదించగానే రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు. సేవ ముసుగులో పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది దేశంలో రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య విద్య చదువుకున్న వారు వైద్యులుగా తమ ప్రాంతాలకు సేవ చేయక, విదేశాలకు వెళ్లి అక్కడ స్ధిరపడి, డబ్బు సంపాదించుకొని, రాజకీయాలు చేయాలన్న ఆశతో వచ్చినవారు చాల మంది వున్నారు. అలాంటి వారిలో మరో ఎన్‌ఆర్‌ఐ కుటుంబం పాలకుర్తిలో రాజకీయం చేయాలని చూస్తోంది. కాని వారికి కూడా తెలుసు. ఎర్రబెల్లిదయాకర్‌రావును ఎదిరించి రాజకీయాలు చేయడం అంత సులువైన పని కాదు. అయినా రాజకీయాలు చేయాలన్న ఆశతో పాలకుర్తి రాజకీయాల్లో వేలుపెడుతున్నట్లు సమాచారం. మా తాతలు నేతలు నాకారు…మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఎప్పుడో తమ కుటుంబం పాలకుర్తికి సేవ చేసింది. ఇప్పుడు రుణం తీర్చుకోండని ప్రజలను ఆదేశిస్తున్నట్లుగా రాజకీయం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారు ఎంత మంది వచ్చినా పరోక్షంగా మంత్రి దయాకర్‌రావుకే మేలు కలుగుతుంది. ఎందుకంటే దయాకర్‌రావు అవకాశ వాద రాజకీయాలు ఏనాడు చేయలేదు.

అవకాశా వాదంతో రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలను నమ్ముకొని రాజకీయం చేశాడు. రాజకీయాలు చేస్తున్నా ప్రజాసేవను ఎంతో ఇష్టంగా చేస్తుంటాడు. ఆయన చేసిన చేవలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ నాయకుడు ఇప్పటి వరకు చేయలేదు. రాజకీయాలు చాల మంది చేశారు. దానితోపాటు ప్రజా సేవ చేసినవాళ్లున్నారు. కాని దయాకర్‌రావు మాత్రం రాజకీయాల కోసం మాత్రమే ప్రజాసేవ ఏనాడు చేయలేదు. ప్రజలకు ఏనాడు ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అది ఆర్ధికపరంగానైనా, ఆరోగ్యపరంగానైనా అన్నా అని వెళ్తే చేసే సాయాలు అన్నీ ఇన్నీ కావు. ఆయనతో మేలు పొందని కుటుంబం అంటూ వుండదంటే అతిశయెక్తి కాదు. గతంలో ఆయన చేసిన సేవ కార్యక్రమాల గురించి పక్కన పెడితే, తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలోనే సీజనల్‌ వ్యాధులు విసృతంగా ప్రభలాయి. ఆ సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దఎత్తున డెంగ్యూ జ్వరాలు ప్రజల ప్రాణాలు తీశాయి. ఒక రకంగా చెప్పాలంటే వైద్యులు కూడా పల్లెల్లోకి వెళ్లి వైద్యం చేయాలంటే భయపడేంతగా ఇబ్బందికరపరిస్దితులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో ఆయన అనేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఆంబులెన్స్‌లు ఎప్పుడూ సిద్దంగా వుంచారు. ఏ గ్రామంలో ఏ ఒక్కరి పరిస్ధితి విషమించినా వెంటనే వరంగల్‌, హైదరాబాద్‌లలో ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి ఉచిత వైద్యం అందించి అనేక మంది ప్రాణాలు కాపాడిన నాయకుడు దయాకర్‌రావు. ఇక కరోనా సమయంలో ఆయన చేసిన సేవ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ నాయకుడు చేయలేదు. ఏ సామాజిక వేత్త చేయలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా సమయంలో మంత్రి దయాకర్‌రావు తన నియోజవకవర్గంలోనే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అనేక రకాల సేవంలందించాడు. ముఖ్యంగా వైద్యపరమైన అవసరాలు తీర్చాడు. పేదలకు ఎంతో ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా చేయించాడు. రెమిడీస్‌ వీర్‌లాంటి ఇంజక్షన్లు ఎంతో మంది పేదలకు ఉచితంగా అందించి, వారి ప్రాణాలు కాపాడాడు. ఎంతో మందికి ఆహార అవసరాలు తీర్చాడు. అంత గొప్పది దయాకర్‌ రావు సేవ. ప్రజలు ఇప్పటికీ ఆనాటి సేవలు ఎవరూ మర్చిపోలేదు. కాని రాజకీయాలు చేసిన వారు మర్చిపోయారు. ప్రజలను ఏమార్చాలనుకునేందుకు ప్రయత్నిస్తున్నవారు మర్చిపోయారు. కరోనా కాలంలో వారు ఎవరూ లేరు. ప్రజల మీద ప్రేమ చూపలేదు. వారికి సేవ చేయలేదు. ఇప్పుడు రాజకీయాలు చేయడానికి వస్తున్నారు. ప్రజలు ఎంతో విజ్ఞులు. మంత్రి దయాకర్‌రావును కాదనుకోలేరు. ఇది దయాకర్‌రావు మీద రాజకీయం చేయాలనుకున్నవారందరూ నేర్చుకున్న పాఠమే..ప్రతిసారి ఆయన కొత్తగా రుచి చూపిస్తున్నదే…

కూసుకుంట్లే అసలు కుంపటి?

 

-ఎవరినీ కలవడు! ఎవరినీ కలుపుకుపోడు!?

– 2018లో ఓటమికి అదే కారణం?

-అయినా మారని తీరు!

-ఉప ఎన్నికలలో పార్టీ నేతలు ఎంత వద్దన్నా…కూసుకుంట్లకే దక్కిన టికెట్‌!

-అన్నీ మర్చిపోయి కూసుకుంట్లను గెలిపిస్తే, కూసుకుంట్లలో విశ్వాసం లేదు?

-ఇప్పటికీ ఎమ్మెల్యే మారడం లేదు?

-ఆయనలో మార్పు వస్తుందన్న నమ్మకం పార్టీ శ్రేణులలో లేదు?

– ఎన్నికైన నుంచి ప్రజల్లో వుంటున్నది లేదు?

– కార్యకర్తలతో సమావేశమైంది లేదు?

– వచ్చే ఎన్నికల గురించి ఆలోచన లేదు?

-పార్టీకి నష్టం జరుగుతుందన్న బాధ లేదు?

-నాయకులు కలవాలని కోరుతున్నా సమయం ఇవ్వడం లేదు?

-హడావుడిగా ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ఓపెనింగ్‌ కార్యక్రమం?

-నాయకులకు అందని ఆహ్వానం?

-అసంతృప్తితో రుగులుతున్న పార్టీ గణం?

– సార్వత్రిక ఎన్నికలలో కూసుకుంట్లను మార్చితే గాని లాభం వుండదు?

-టికెట్‌ రాదనే కూసుకుంట్ల ఒంటెద్దు పోకడలు?

– నూతన నాయకత్వం కోసం మునుగోడు ఎదురుచూపు?

– వెంటనే పార్టీ స్పందిస్తేనే మునుగోడు దక్కు!

హైదరబాద్‌,నేటిధాత్రి:                     

మునుగోడు…తెలంగాణ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఇటీవల మరింత చర్చలో వున్నది. రాజకీయ చర్చకు వేదికౌతోంది. ఎమ్మెల్యేగా వున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అతి విశ్వాసంతో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. దాంతో తెలంగాణనే కాదు దేశమంతా మునుగోడు వైపు చూసింది. మునుగోడు నియోజకవర్గం రాజధాని నగరమైన హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో వుండే నియోజకవర్గం. సమస్యల నిలయమైన నియోజకవర్గం. ప్రజలకు ఒకప్పుడు కనీసం మంచినీరు కూడా అందలేని నియోజకవర్గం. ఫ్లోరైడ్‌ భూతం పట్టిపీడిస్తే విలవిలలాడిన నియోజకవర్గం. ఉమ్మడి నల్లగొండ అంటేనే ఫ్లోరైడ్‌ బాధితులకు నియలం. మునుగోడు అంటే అన్ని ప్రాంతాలకంటే ఎక్కువ శాతం ఫ్లోరైడ్‌ వున్న ప్రాంతం. ఆ నియోజకవర్గ గ్రామాలకు ఇతర ప్రాంతాలను నుంచి ఆడపిల్లను ఇవ్వాలన్నా ఇచ్చేవారు కాదు. ఉద్యోగులు కూడా ఆ మునుగోడుకు వెళ్లాలంటే భయపడేవారు. అక్కడి నీళ్లు కొంత కాలం తాగితే చాలు..శరీరంలో వచ్చే మార్పులకు జీవితాలు చిద్రమయ్యే పరిస్థితి వుండేది. అయినా ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఐదేళ్లు పాలించిన కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. పదిహేడేళ్లు పాలించిన తెలుదేశం పార్టీ ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రజలకు కనీసం గుక్కెడు మంచినీరు ఇవ్వలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంతో పాదయాత్ర కూడా జరిపారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లినా పరిష్కరించలేదు. కాని తెలంగాణ వచ్చిన వెంటనే, కొద్ది రోజుల్లోనే మునుగోడు నియోజకవర్గం మొత్తానికి పైలెట్‌ ప్రాజెక్టు కింద ఇంటింటికీ మంచినీటి సరఫరా చేశారు. 

దశాబ్దాల తరబడి ప్రజల జీవితాలను చిద్రం చేసిన ఫ్లోరైడ్‌ రక్కసిని పారద్రోలాడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ . 

అలాంటి నియోజక వర్గం ఎమ్యెల్యే అంటే అంకితభావంతో పని చేయాలి. ఎన్ను ప్రజలకు వున్న సమస్యల పరిష్కారానికి ఎంత కృషి చేయాలి. తెలంగాణ మొత్తం మీద మునుగోడును ఎంతో అందంగా, ఆదర్శంగా, సమస్యలు లేని నియోకవర్గంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశయం. కాని మునుగోడు ఎమ్యెలే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేన్నది ఆదినుంచి వున్న ఆరోపణే. 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంత మనసుపెట్టి, శ్రద్ద పెట్టి మునుగోడును అభివృద్ధి చేసినా, ప్రజలు కూసుకుంట్లను ఓడిరచారంటే ఆయన వ్యవహార శైలి ఎలాంటిదో అర్దం చేసుకోవచ్చు. అయినా కూసుకుంట్లకు మరో అవకాశం వచ్చింది. 2018 ఎన్నికల్లో కూసుకుంట్ల మీద గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. మళ్లీ కూసుకుంట్లకు అవకాశంవచ్చింది. ఆ ఉప ఎన్నికల సమయంలోనే మునుగోడుకు చెందిన బిఆర్‌ఎస్‌ నేతలు కూసుకుంట్లకు టిక్కెట్‌ ఇవ్వడాన్ని స్వాగతించలేదు. అయినా పార్టీ మీద అభిమానం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద వున్న గౌరవంతో అందరూ సహకరించారు. నిజానికి ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఏ మాత్రం అశ్రద్ద చేసినా, కూసుకుంట్ల ఓడిపోయే తరుణం. అయినా అందరూ కలిసికట్టుగా పనిచేశారు. కూసుకుంట్లకు పూర్తి స్ధాయిలో సహకరించారు. తమకు ఎంత అసంతృప్తి వున్నా పార్టీకోసం పనిచేయాన్న కసితోపని చేశారు. 

 విభేదాలన్నీ పక్కనపెట్టారు. మొత్తానికి పదివేల మెజార్టీతో కూసుకుంట్లను గెలిచించారు.

 ఆ సమయంలో పది వేల ఓట్ల మెజార్టీ అంటే సామాన్యమైన మాట కాదు. బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల, కార్యకర్తల బలానికి అంకితభావానికి సంకేతం. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు చేరవ కావడంలో విఫలం కావడం అన్నది బిఆర్‌ఎస్‌ నాయకులకు ఆందోళనకు గురిచేస్తోంది. 2014 ఎన్నికల్లో గెలిచి పార్టీని పట్టించుకోలేదు. పార్టీకోసం ఎలాంటి పనులు చేయలేదు. నాయకులకు మేలు చేయలేదు. కార్యకర్తలను కనీసం పరిగనలోకి తీసుకోలేదు. దాంతో 2018లో తెలంగాణ అంతటా బిఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టిస్తే మునుగోడులో మాత్రం కూసుకుంట్ల ఓడిపోయారు. నిజానికి ఆ ఎన్నికల్లో కూసుకుంట్ల బంపర్‌ మెజార్టీతో గెలవాలి. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద ఎంత ప్రేమ వున్నా, ఎమ్యెల్యేపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి మూలంగా బిఆర్‌ఎస్‌ మునుగోడులో ఓడిపోయింది. అయినా కూసుకుంట్ల కళ్లు తెవరలేదు. మరోసారి అవకాశం కల్పించారు. 

అయినా కూసుకుంట్ల తీరులో మార్పు రావడం లేదు.

ఇది ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో పెరిగిపోతున్న ఆందోళనకు కారణమౌతోంది. తాజాగా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి సీనియర్లనైన పార్టీ నేతలను ఎమ్మెల్యే పివలేదని సమాచారం. ఆయన పిలవకపోవడంతో చాలా మంది సీనియర్లు అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. పరిస్దితి పట్టు తప్పేలా వుందని తెలియడంతో జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి రంగంలోకి దిగి మళ్లీ కార్యక్రమం ఏర్పాటు చేయించారు. లేకుంటే ఈ అసంతృప్తి మరింత పెరిగితే. ప్రతిసారి మంత్రి జగదీశ్వరరెడ్డి ఇలా సర్ధుకునేలా చేస్తూ, ఆయనకు కూడా కూసుకుంట్ల వ్యవహారం తలనొప్పిగా మారిందన్న మాటలే వినిపిస్తున్నాయి. మంత్రి జగదీశ్వరరెడ్డి అండదండలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన ఎమ్మెల్యే కూసుకుంట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నాడని అంటున్నారు. అసలు పార్టీలో కుంపటి రాజుకునేలా చేస్తున్న వ్యవహారమే కూసుకుంట్లదంటూ చాలా మంది సీనియర్లు ఆయనపై అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. గత ఎన్నికల ముందున్న అసంతృప్తి తగ్గాల్సిందిపోయి, మరింత పెరడానికి కూడా కారణం కూడా కూసుకుంటే అని అంటున్నారు. ఇక ఆయన వ్యవహార శైలి మారదని పార్టీ నేతలు కూడా గట్టి నిర్ణయానికి వచ్చారు. గతంలో ఓటమికి ఇదే కారణమైనా ఆయనకు తత్వం బోధపడలేదని బహరింగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అన్నీ మర్చిపోయి కలిసిపోతున్నా, ఎమ్మెల్యే పట్టించుకోకపోవడాన్ని నాయకులు జీర్ణించుకోవడం లేదు. నిజానికి మునుగోడు అన్నది బిఆర్‌ఎస్‌కు బలమైన ప్రాంతం. 

   ఆ నియోజకవర్గం నుంచి ఎంతో మంది బలమైన నేతలున్నారు. 

వారందరి సహాకారం పొందిన కూసుకుంట్ల వారిని పట్టించుకోకపోవడం అన్నది పార్టీ వ్యతిరేకతను ప్రదర్శించడమే అవుతుంది. మేం సేవ చేస్తాం మొర్రో అని ఎంతో మంది నాయకులు గత ఎన్నికల మందు పార్టీకి ఎన్నో విన్నపాలు చేసుకున్నారు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయాన్ని అందరూ శిరసావహించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక్కసారి మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. 2018లో ఓడిపోయిన కూసుకుంట్లకు భవిష్యత్తులో టికెట్‌ నీదే అని హామీ ఇచ్చారట. అయితే అనుకోని వరంలా ఉప ఎన్నిక కలిసొచ్చింది. అది కూసుకుంట్లకు మరోసారి అవకాశం అందించింది. ఎంత మంది క్యూ కట్టినా , టిక్కెట్‌ ఆయనకే దిక్కింది. ఆయన అదృష్టం బాగుండి విజయం కూడా కూసుకుంట్లనే వరించింది. ఇలాంటి సమయంలో ఆయన ప్రజలకు ఎంతో కృతజ్ఞతగా వుండాలి. కాని అది జరగడం లేదన్నది నియోజక వర్గ ప్రజల మాట. అందుకే ఈసారి మాత్రం టిక్కెట్‌ ఖచ్చితంగా బిసి వర్గాలకు చెందిన నాయకులకే ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. కూసుకుంట్లను పక్కన పెట్టకపోతే ఇతర పార్టీలకు పూలలో పెట్టి సీటు సమర్పించుకన్నట్లే అని బాధపడుతున్నారు.

పదేళ్ల నా తెలంగాణ… ప్రగతి చిరునామా

ఉద్యమ కాలం యాదిలో, తెచ్చిన తెలంగాణ వెలుగులో యుగపురుషుడు కేసిఆర్‌ ప్రస్థానం గురించి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.

`కాలాన్ని మదించి, తెలంగాణ కోసం తెగించి,

`కల నిజం చేసి, తెలంగాణ సాధించి!!

`పద్నాలుగేళ్లు అలుపెరగని పోరు సలిపి.

`ఎత్తిన పిడికిలి దించని యోధుడు. 

`తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన విజయుడు.

`పల్లె కన్నీటిని తూడ్చిన కరుణామయుడు.

`గోదారి పరుగు ఎదురునిలిచిన కాళేశ్వరుడు.

`గోదారి నీటిని తెలంగాణ పల్లెకు మళ్లించిన భగీరధుడు.

`నీటికి నడక నేర్పిన గొప్ప ధీరోదాత్తుడు.

`సమాజానికి దారి చూపిన దార్శనికుడు.

`తెలంగాణ ప్రగతి నిర్ధేశకుడు.

`తెలంగాణకు వెలుగులు పంచిన వీరుడు.

`సమస్యల మీద సమరం జరిపిన కార్యోన్ముకుడు.

`తెలంగాణ కోసం జీవితం ధారపోస్తున్న త్యాగధనుడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:                 

పదేళ్ల నా తెలంగాణ…కోటి కోటి కాంతుల నజరానా…కోటి ఎకరాల మాగాణ. ప్రగతికి చిరునామా. ఒక్కసారి పదేళ్ల ముందుకు వెళ్తే..ఆనాటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలన్నీ పటాంపచలు చేసి, తెలంగాణ వెనోళ్ల కొనియాడుతున్నది. కోటి కాంతులతో వెలుగుతున్నది. తెలంగాణ వస్తే ఇక చిమ్మ చీకట్లే అన్నారు. ఈ మాత్రం కరంటు కూడా వుండదన్నారు. తెలంగాణలో రైతులు ఆగమౌతారని అన్నారు. తెలంగాణ వ్యవసాయమంతా కరంటు మీదే ఆధారపడి సాగుతుంది. కరంటు రాకపోతే ఒక్క గింజ కూడా పండదన్నారు. కాని ఏం జరిగింది. ఉద్యమ కారుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరంటు తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క రోజు కూడా నిరంతర కరంటు తెలంగాణలో చూసింది లేదు. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే రెప్పపాటు కూడా పోని కరంటును ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందించారు. విద్యుత్‌ ఉత్పాదనంతా ఆంధ్రప్రదేశ్‌లో వుంది. తెలంగాణ ఆగమౌతుందన్నారు. కాని ఎక్కడైతే కరంటు ఉత్పత్తి అవుతుందన్నారో అక్కడ కరంటు కోతలున్నాయి. తెలంగాణ వస్తే కరంటు రాకపోతే పారిశ్రామిక రంగం మొత్తం కుదేలౌతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలతో విసిగిపోయిన పారిశ్రామిక వేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నాలు చేశారు. పవర్‌ హలీడేస్‌ ప్రకటించేవారు. కాని తెలంగాణ వచ్చాక నిరంతరం విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. పవర్‌ హాలీడేస్‌ కాదు, తెలంగాణకు కొన్ని వేల పరిశ్రమలు వచ్చాయి. తెలంగాణ వస్తే రైతుకు అన్నం మెతుకు వుండదన్నారు. కాని ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా పట్టుమని మూడు గంటలపాటు నిరంతరం విద్యుత్‌ వ్యవసాయానికి అందింది లేదు. కరంటు బిల్లులు వసూలు చేస్తూ, రైతు మోటార్లు ఎత్తుకుపోతూ అందించిన కరంటుతో పంటలు పండిరదిలేదు. రైతు బాగు పడిరది లేదు. పైగా నాణ్యత లేని కరంటు మూలంగా ఎప్పుడూ మోటార్లు కాలిపోయేవి. రైతులను అప్పుల పాలు చేసేవి. కాని తెలంగాణ వచ్చాక కరంటు మోటార్లు కాలిపోయిన చరిత్ర ఎక్కడా లేదు. తెలంగాణ రాకముందు వ్యాపార సంస్ధలే కాదు, ఇళ్లలో కూడా జనరేటర్లు ఏర్పాటు చేసుకునేవారు. అప్పులు చేసి సోలార్‌ విద్యుత్‌ పరికాలు ఏర్పాటు చేసుకునేవారు. కాని ఇప్పుడు ఏ వ్యాపార సంస్ధలోనూ జనరేటర్‌కు అవకాశంలేదు. అవసరం కూడ లేదు. అదీ తెలంగాణ అంటే అంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో కలిసి పంచుకున్న పదేళ్లకిందటి తెలంగాణ కన్నీటి గాధలు.

తెలంగాణ వస్తే నీటి చుక్కకు గోస పడాల్సి వస్తుందని భయపెట్టారు.

కాని ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కావని అనుకున్న ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మాణం చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. తెలంగాణ రాకుంటే ఇప్పటికీ అవే కరంటు కష్టాలు..నీటి కష్టాలు వుండేవి. నిరంతర కరంటు ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవు. పల్లెల వలస ఆగకపోవు. ఎంత పెద్ద మోతుబరి రైతైనా సరే హైదరాబాద్‌లో సెక్యూరిటి గార్డుగా పనిచేయాల్సివచ్చు. కాని ఇప్పుడు ఎకరం వున్న రైతు కూడా రాజులాగా మారిపోయాడు. ఎకరంలో తిండిగింజలు పండిరచుకోగలుగుతున్నారు. పాడి, పంటతో కుటుంబం పోషించుకుంటున్నాడు. సొంత ఊరులో హాయిగా జీవనం సాగిస్తున్నాడు. సాగుకోసం రైతు బంధు అందుకుంటున్నాడు. ఎకరం భూమి కూడ లక్షలు ధర పలుకుతుండడంతో భరోసాతో జీవిస్తున్నాడు. గతంలో ఎంత కాలం వలసపోయినా, తిండికి తప్ప మిగిలిందిలేదు. సంతోషంగా బతికిందిలేదు. ఊరు నొదిలి పోలేక, అక్కడ బతకలేక నరకం అనుభవించిన సగటు తెలంగాణ వ్యక్తి నేడు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంటిని, పొలాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు. ఇది కదా! తెలంగాణ జీవనం అంటే కాలు మీద కాలేసుకొని దర్జా కనబర్చుతున్నాడు. 

తెలంగాణ వస్తే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మాయమౌతుందని భయపెట్టారు. 

కాని ఏమైంది. హైదరాబాద్‌ బ్రాండ్‌ మరింత పెరిగింది. ఎవరూ ఊహించనంత ఎదగింది. ఇప్పుడు హైదరాబాద్‌ను చూస్తుంటే అమెరికాలో వున్నామా? లండన్‌లో వున్నామా? అన్న అనుమానం కలుగుతుందని సాక్ష్యాత్తు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అన్నారు. ఇటీవల సినీ నటి లయ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. పదేళ్ల కింద హైదరాబాద్‌, ఇప్పటి హైదరాబాద్‌ చూస్తే మతిపోతుంది. తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో మత కల్లోలాలు రేగుతాయంటూ కూడా భయపెట్టారు. ఒకనాడు ఏడాదిలో కనీసం పది రోజులైనా పాతబస్తీలో కర్ఫ్యూ విధించేవారు. అంతకు ముందు నెలల తరబడి కూడా వుండేది. కాని తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడ అలాంటి పరిస్దితి ఎదురుకాలేదు. శాంతిభద్రతల సమస్య అసలే లేదు. ప్రశాంతమైన నగరంగా హైదరాబాద్‌ దేశంలోనే గొప్ప నగరంగా కీర్తినందుకుంటుంది. కాని తెలంగాణకు వ్యతిరేకశక్తులు కొన్ని అప్పట్లో శ్రీకృష్ణకమిటికీ హైదరాబాద్‌లో మత కల్లోలు రేగుతాయంటూ నివేదికలు ఇచ్చాయి. అంతే కాదు తెలంగాణ వస్తే ఐటి రంగమంతా తరలిపోతుందన్నారు. కాని ఏం జరిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన, మంత్రి కేటిఆర్‌ చొరవతో దేశంలో ఐటికి హైదరాబాద్‌ చిరునామా చేశాడు. దేశమంతా ఐటి అంటే హైదారాబాద్‌ వైపు చూసేలా చేస్తున్నాడు. 

తెలంగాణ వస్తే నక్కలైట్ల పెరుగుతారు.

 తెలంగాణ అల్లకల్లోలమౌతుంది. ఆగమౌతుంది. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి నిరోధకాలు అంటూ చెప్పినవారి మాటలన్నీ అబద్దాలయ్యాయి. తెలంగాణ ప్రశాంతంగా మారింది. పల్లెలు వికసిస్తున్నాయి. తెలంగాణలో విద్య, వైద్యం ఎంతగా అభివృద్ది చెందింతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలోని అన్ని నియోకవర్గాలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏర్పాటు చేసిన బిసి గురుకులాలతో తెలంగాణలో వైద్య విప్లవం మొదలైంది. ఇక ఒకనాడు ప్రభుత్వ వైద్యం అంటే తెలంగాణ ప్రజలు భయపడేవారు. కాని నేడు ప్రభుత్వ వైద్యం ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రులకు ధైర్యంగా వెళ్తున్నారు. పెద్దపెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే వైద్యమంతా ఉచితంగా అందుకుంటున్నారు. ఇక ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ వల్ల హైదారాబాద్‌లో అందే వైద్యమంతా జిల్లాల్లోనే అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజనిర్మాణం జరగుతోంది. పల్లెలో పల్లె దవఖానాలు, బస్తీలలో బస్తీ దవఖానాలు, వరంగల్‌ లాంటి నగరంలో ఇప్పుడున్న ప్రభుత్వాసు పత్రులకు తోడుగా మరో 2వేల పడకల ఆసుపత్రి, హైదరాబాద్‌ చుట్టూ నాలుగు పెద్ద ఆసుపత్రులు, నిమ్స్‌ మరింత ఆధునీకరణ జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ అన్ని రంగాల్లో బెస్టు…ఫస్ట్‌ అన్నది పదేళ్లలో సాధించింది. 

నిర్మాణాల పరంగా చూసుకుంటే హైదరాబాద్‌లో మెట్రో పూర్తి చేయడమేకాకుండా, మరో దశ కూడా మొదలుకాబోతోంది.

 ఇక నగరంలో ఎక్కడా ట్రాపిక్‌ సమస్య రాకుండా వుండేందుకు ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్లుతో హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోయాయి. హుస్సేన్‌ సాగర్‌కు ఆనుకొని వున్న కొత్తగా దవళకాంతిలో మెరస్తున్న కొత్త డాక్టర్‌. బిఆర్‌. అంబెద్కర్‌ నూతన సచివాలయం, అటు పక్కన 125 అడుగుల ఎత్తైన అంబెద్కర్‌ విగ్రహం, సెక్రటేయట్‌కుముందు అమరవీరుల స్మృతి చిహ్నం… ఎన్ని అందాలు..ఎంత గొప్ప కట్టడాలు..ఇదంతా మన తెలంగాణ. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలలు గన్న తెలంగాణ..ఆయన ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న తెలంగాణ. సిరుల తెలంగాణ. కొత్తగా సింగారించుకున్న తెలంగాణ. బంగారు తెలంగాణ. దశాబ్ధి కలలో మిలమిల మెరుస్తున్న తెలంగాణ.

పదేళ్లలో వందేళ్ల కాంతులు.

`తెలంగాణలో అభివృద్ధి వెలుగులు.

తెలంగాణ ఉద్యమకారుడు, రైతు రుణ విమోచన కమీషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న , నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పంచుకున్న అభివృద్ధి వివరాలు.

`రైతు మోములో ఆనందాలు.

`తెలంగాణ ప్రజలలో సంతోషాలు.

`తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.

`తెలంగాణ అంతటా సంబురాలు.

`పదేళ్లలో సాధించిన అభివృద్ధి పనులు.

`కాళేశ్వరం వంటి వినూత్న ప్రాజెక్టులు.

`మలన్న సాగర్‌ లాంటి రిజర్వాయర్ల నిర్మాణాలు.

`మిషన్‌ కాకతీయలో చెరువుల మరమ్మత్తులు.

`ఎండిన చెరువులకు సరికొత్త సొగబులు.

`మిషన్‌ భగీరథ తో ఇంటింటికీ మంచి నీరు.

`తెలంగాణ మాగాణమంతా సాగు నీరు.

`సాగు నీటి కాలువల పరవళ్లు.

`బంగారు పంటల దిగుబడులు.

`రైతు బంధు అమలు.

`పెట్టుబడి సాయంలో రైతుకు అందుతున్న నగదు.

`సాగుకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌.

`అన్ని వర్గాల అభ్యున్నతి సాక్ష్యాత్కారాలు.

`అన్ని రంగాలలో ముందడుగులు.

`పారిశ్రామిక రంగంలో పరుగులు.

`ఐటి రంగంలో రికార్డులు.

`ఫార్మా రంగంలో కొత్త అడుగులు.

`వైద్య రంగంలో నూతన ఒరవడులు.

హైదరబాద్‌,నేటిధాత్రి:       

అలుపెరగని యోధుడు కేసిఆర్‌ తెలంగాణ సాధించి, పరిపాలన మొదలుపెట్టి తొలిదశాబ్ధం కానున్నది. నేటి నుంచి తెలంగాణలో దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభమౌతున్నాయి. ఒకనాటి తెలంగాణ నేటి, తెలంగాణ ఒక్కసారి గతంలోకి వెళ్లి తొంగిచూస్తే అసలు తెలంగాణలోనే వున్నామా? అన్న అనుకోకతప్పదు. ఒకప్పుడు సమస్యల తెలంగాణ. నేడు సంపన్న తెలంగాణ. ఒకప్పుడు చీకట్ల తెలంగాణ. ఇప్పుడు వెలుగుల తెలంగాణ. ఒకప్పుడు ఆకలి తెలంగాణ. ఇప్పుడు అన్న పూర్ణ తెలంగాణ. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు అనేక నూతన ఆవిష్కరణలు తెలంగాణలో సాక్ష్యాత్కరిస్తున్నాయి. నాటి రోజులు గోసలు, నేడు లేవు. నాటి అవస్థలు నేడు లేవు. అప్పటి పాలకులు చేసిన అన్యాయాల గుర్తులను చెరిపేసి, అభివృద్ధి ఫలాలను అందిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అద్భుతాలు చేసి చూపిస్తున్నాడు. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో తెలంగాణ చీకట్లు తరిమేశాడు. అసలు కరంటు అన్నది ఎప్పుడు వస్తుందో..ఎప్పుడో పోతుందో..ఎన్ని ఏళ్లు పంటలు ఎండి రైతు విలవిలలాడిపోయాడో ప్రత్యక్ష్యంగా చూసిన మాకు తెలుసు. నేటి తరానికి ఆ సమస్యలు తెలియవు. ఆ అవస్దలు చాలా మంది చూడలేదు. కటిక పేదరికంనుంచి తెలంగాణ సంపన్న రాష్ట్రంగా మారిందంటే అది కేవలం కేసిఆర్‌ పాలన వల్లనే సాధ్యమైంది. తెలంగాణ కోసం కోట్లాడకపోతే, తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ప్రజలు ఎంతో విజ్ఞులు. చైతన్య వంతులు. అందుకే కొట్లాది తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాత్రమే అభివృద్ధి చేయగలడని నమ్మారు. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్న కేసిఆర్‌ చేస్తున్న అభివృద్దికి ప్రజలు మురిసిపోతున్నారు. ముగ్ధులౌతున్నారు. తమ పొలాలు చూసి సంబపడుతున్నారు. పొలాలలో నీరు చూసి ఆనందపడుతున్నారు. పండుతున్న పంటలు చూసి, మురిసిపోతున్నారు. ఆర్ధికంగా ఎంతో ఎదుగుతున్నారు. ఆకలి లేని తెలంగాణ నిర్మాణంలో రైతులు బాగస్వాములౌతున్నారు. దేశానికి అన్నం పెడుతున్నారు. ఇదంతా కేసిఆర్‌ పుణ్యమే. ఆయన కీర్తి అజరామరంగా వెలుగుతుంది. ఆయన వెయ్యేలైనా ఆయన పేరు కీర్తించబడుతుంది. కొట్లాడి తెలంగాణ తేవడం అంటే ఒక రకంగా ఆయన కారణజన్ముడు కావడం వల్లనే సాధ్యమైంది. అందుకే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాదిస్తోంది. తెలంగాణ వచ్చిన ఈ పదేళ్ల కాలంలో వందేళ్ల ప్రగతి మన కళ్లముందు కనిపిసోంది. అంటున్న తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాణ రైతు రుణ విమోచణ కమీషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా పంచుకున్న అనుభవాలు, వాస్తవాలు, ఉద్యమ కాలపు రోజులు, నేటి ప్రగతి బాటలను గురించి చెప్పిన ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే…

మా చిన్న తనమంతా తెలంగాణ చీకటి మయం.

తెలంగాణ మాగాణ బీడుల పర్వం. చుక్క నీరు లేని తెలంగాణ ఎడారి స్వరూపం. గుక్క తీరని చోట, భుక్తి తీరే పరిస్థితి కనిపించని కాలం. ఆకాశం కేసి చూడడమే రైతు పని. మబ్బులు పడితే చాలు పండగ చేసుకునేంత సంబరం రైతుది. మబ్బులు వీడిపోతే కంటకన్నీరాగని దుస్ధితి. అదీ ఒకప్పుడు తెలంగాణ రైతు పరిస్ధితి. ఎండా కాలం వచ్చిందంటే చాలు ఎప్పుడు సూర్యుడు మబ్బు సాటకు పోతాడని ఎదరుచూపులు. వాన కాలం వచ్చిందటే చినుకెప్పుడు పడుతుందా? అని నేల చూపులు. తొకరితో సంబరాలు. వరుణ దేవుడు ముఖం చాటేస్తే దుఃఖాలు. మరి అలాంటి తెలంగాణలో నీటి జాడలు ఎలా రావాలి? నీటి పరవళ్లు ఎలా సాగాలి. వాగులన్నీ ఎలా పారాలి. ఒర్రెలన్నీ నీటితో మునగాలి. చెరువులన్నీ ఎలా నిండాలి. గొలుసు కట్టు చెరువులన్నీ ఎప్పుడు మత్తళ్లు దుంకాలి. ఇదే ఆలోచన. కేసిఆర్‌ మది నిండా ఇదే మధన. ఎండిన నా తెలంగాణ ఎప్పుడు పచ్చబడాలే…ఎట్లా పచ్చబడాలే…తన సిద్ధిపేటలో అడుగంటిన నీళ్లు ఎట్లా పైకి రావాలే…మొత్తం తెలంగాణ ఎట్లా నీళ్లలో సయ్యాటలాడాలే! ఈ ఆలోచనలే కేసిఆర్‌లో కసిని పెంచాయి. పిడికిలెత్తేలా చేశాయి. సమైక్య రాష్ట్రంలో ఇంకా కొనసాగితే బతుకు చిత్రం మారిపోవడమే కాదు, పల్లె చిద్రమైపోతోంది. బతుకు తెల్లారిపోతుంది. పల్లె ఖాళీ అవుతుంది. తెలంగాణ పల్లె స్మశానమౌతుంది. ఇది కాదు…భవిష్యత్‌ తెలంగాణ. ఇది కాదు నేను ఇంకా చూడాల్సిన తెలంగాణ. తెలంగాణ భవిష్యత్తు కోసమే నేను నేతగా సాగాలి. తెలంగాణ సాక్ష్యాత్కారం కావాలి. మొత్తంగా తెలంగాణ కళకళలాడాలి. అని మొదలుపెట్టిన ఉద్యమాన్ని పద్నాలుగేళ్లపాటు సాగించి, తెలంగాణ సాధించిన వీరుడు కేసిఆర్‌. 

ఒకనాడు ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణ అనేవారు.

 కాని తెలంగాణలో అన్నమో రామచంద్రా అనేవారు. కోనసీమను స్వర్గ సీమ అనేవారు. ఎటు చూసినా పచ్చని పైర్లు, కొబ్బరితోటలు, మామిడి తోటలు. ఇలా ఎటు చూసినా పచ్చదనం. రైతు ముఖంలో ఆనందం. సంతోషం. ఆ రైతు అదృష్టం. మరి తెలంగాణ రైతుకెందుకు కష్టం. తెలంగాణ రైతుకు ఎందుకు నష్టం. తెలంగాణ ఎందుకు ఎండుతోంది? సీమాంధ్ర ఎందుకు కళకళలాడుతోంది. అటు గోదావరి, ఇటు కృష్ణా ఎక్కువ పారేది తెలంగాణలో…నీటి వినియోగం అట్టడుగు స్ధానంలో…ఇదే సగటు తెలంగాణ రైతు ఆవేదన. ఆందోళన. ఆక్రందన. అందుకే కేసిఆర్‌ జై తెలంగాణ అన్నది. తెలంగాణ సాధించుంటే మన పల్లె మెరుస్తుందని చెప్పింది. ఇప్పుడు అదే మన కళ్లు మందు కేసిఆర్‌ ఆవిష్కరించింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2014లో చెరువుల పునరుద్ధరణ మొదలుపెట్టారు. ప్రాజెక్టుల నిర్మాణం వరకు తెలంగాణ రైతు ఆగాల్సిన అవసరం లేదు. నీటి గోసలు ఇక చాలు. ఇప్పటిదాకా మొగులుకు ముఖం పెట్టి చూసిందిచాలు. అందుకే ప్రాజెక్టులు మొదలు పెడుతూనే చెరువుల రూపు రేఖలు మార్చితే చాలు. సగం తెలంగాణ సస్యశ్యామలమౌతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఆ పాలకులు చెరువుల బాగుకు కూడా సహకరించలేదు. అందుకే యుద్ద ప్రాతిపదికన తెలంగాణలో వున్న 45వేల చెరువులను మూడు దఫాలుగా బాగు చేశారు. తెలంగాణ పల్లెల్లో చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. గోదావరి జలాలతో తొలి ఏడాదే నింపారు. రైతు కళ్లలో ఆనందం నింపారు. సరిగ్గా మండుటెండల్లో చెరువుల్లో మత్తళ్లు చూపించి, రైతులను అబ్బుర పర్చారు. తెలంగాణలో కొత్త వెలుగు నింపారు. ఇదే సమయంలో తెలంగాణలో మూడు నెలల్లోనే చీకట్లను పారద్రోలారు. సాగుకు ఇరవైనాలుగు గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేధికల నిర్మాణంచేపట్టారు. రైతు వేధికల కోసం సుమారు రూ.550 కోట్లు వెచ్చింది ప్రతి ఊరిలో రైతు వేధికలు నిర్మించారు. రాష్ట్రం మొత్తం మీద 2601 కస్టర్లు ఏర్పాటు చేసి, పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక రైతులు తమ పంటలు ఆరబెట్టుకోవడానికి అవసరమైన స్థలాలు లేక అనాధిగా అవస్ధలు ఎదుర్కొంటున్నారు. అందుకోసం రూ.775 కోట్లు ఖర్చు చేసి రైతు కళ్లాలు నిర్మించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు 30లక్షల వ్యవసాయ కనెక్షన్‌లకు నిరంతర విద్యుత్‌ అందిస్తున్న ఘనత ఒక్క తెలంగాణకే దక్కుతుంది. అది ముఖ్యమంత్రి కేసిఆర్‌కే చెల్లింది. 

ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మాత్రమే రైతు సమస్యలు తెలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. 

తెలంగాణ కోసం కొట్లాడేందుకు మొదలైన అడుగు కూడా సాగు కోసమే. వ్యవసాయం కోసమే. నిరంతరం పొలాల్లో నీటి కోసమే. రైతు కోసమే…నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌లైన్‌లో మొదటి ప్రాధాన్యత నీళ్లే..సాగే..రైతు సంతోషమే… రైత కళ్లలో ఆనందం చూడాలనకున్నాడు. ముఖ్యమంత్రిగా రైతు కోసం అనేక చేశాడు. చెరువలు పూడికలు తీయించాడు. కాళేశ్వరం నిర్మించాడు. మల్లన్న సాగర్‌ లాంటి రిజర్వాయర్లు నిర్మాణం చేశాడు. కాలువలు తవ్వించాడు. తెలంగాణ ప్రతి ఎకరం సాగులోకి వచ్చేలా చేశాడు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ చేశాడు. తెలంగాణ సస్యశ్యామలం చేశాడు. అందులోనూ ఆయన ఒక రైతుగానే ఉద్యమం సాగించాడు. ముఖ్యమంత్రిగా తాను రైతునన్న దానిని దృష్టిలో పెట్టుకొనే భగీరధ ప్రయత్నం చేశాడు. ఒకనాడు ఎండిన తెలంగాణలో నిరంతం నీటితో కనిపించేలా చేశాడు. కొత్త పుంతలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరలెత్తించారు. కొత్త పధకాలతో తెలంగాణను అభివృద్ధి చేశాడు. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా చేశాడు. అభివృద్ది అంటే తెలంగాణ అని దేశమంతా కొనియాడేలా చేశాడు. సాగు పండగలాగానే తెలంగాణ అభివృద్ధిని పండగలా చేశాడు. ప్రతి రోజూ తెలంగాణలో పండగ వాతావరణం కనిపించేలా తీర్చిదిద్దాడు. రైతులు మోములో చిరునువ్వులు పూయించాడు. తెలంగాణ ప్రజల్లో సంతోషాలు నింపాడు.

దశాబ్దిలో శతాబ్ది వెలుగులు తెలంగాణలో ప్రగతి పరుగులు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో సంబాషణ. తెలంగాణ అభివృద్ధిపై వివరణ కవిత మాటల్లోనే…

`గోసను బరిగీసి తరిమింది..

`కన్నీటి జాడ లేకుండా చేసింది..

`తెలంగాణ రైతుకు కష్టం దూరమైంది.

`వ్యవసాయం పండగయ్యింది.

`ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వులు నింపింది.

`ఆసరాతో ఆదుకుంటోంది.

`ఆసుపత్రులతో పేదలకు వైద్యం అందుతోంది.

`తల్లుల సంక్షేమం చూస్తోంది..

`బిడ్డల బాగోగులు కంటోంది.

`కేవలం సిఎం. కేసిఆర్‌ నాయకత్వం వల్లనే సాధ్యమైంది.

`ప్రగతిలో తెలంగాణ ఫస్ట్‌.

`సంక్షేమంలో అన్ని రాష్ట్రాలకన్నా బెస్ట్‌.

`సాగు నీటి రంగంలో రువ్వడి.

`వ్యవసాయం వడివడి..

`భగీరథ ప్రయత్నం జరిగింది.

`తెలంగాణ నీటి గంగాళమైంది.

`మంచినీటి గోస తీరింది.

`ఫ్లోరైడ్‌ పీడ విరగడైంది.

`విద్యుత్‌ విప్లవం వచ్చింది…

`రైతుకు 24 గంటల కరంటు ఇస్తోంది.

`రెప్ప పాటు పోని కరంటు వస్తోంది.

`పంటల సింగారం…కోటి ఎకరాల మాగాణమైంది.

`రైతు బంధుతో ధీమా పెరిగింది.

`పెట్టుబడి లేదన్న భయం పోయింది.

`ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో వుంది?

`కళ్యాణ లక్ష్మి వస్తోంది…

` ఆడపిల్ల పెళ్ళి అవస్థ తప్పింది.

`ఐటికి తెలంగాణ కేరాఫ్‌ అయ్యింది.

`దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది.

`తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం మురుస్తోంది.

`కేసిఆర్‌ నాయకత్వం మాకూ కావాలని కోరుకుంటోంది.

హైదరబాద్‌,నేటిధాత్రి:                      దార్శనికుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేతిలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోంది. స్పూర్తి ప్రధాత కేసిఆర్‌ చేతిలో తెలంగాణ వికసిస్తోంది. ప్రగతి పరుగులు పెడుతోంది. అభివృద్ది ఉరకలేస్తోంది. ఉద్యమ కారుడి పాలనలో పల్లె మురిసిపోతంది. వ్యవస్ధ వికాసవంతమౌతోంది. తెలంగాణ అన్ని రంగాలలో ముందుడుగు వేస్తోంది. విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణం సాగుతోంది. ప్రజలు కలలుగన్న తెలంగాణ కళ్లముందు సాక్ష్యాత్కారమైంది. తెలంగాణ సమాజాం ఆ ఫలాలు అందుకుంటోంది. ఉన్నతమైన ఆశయాల వెంట నడుస్తున్న తెలంగాణను చూసి భరత జాతి గర్వపడుతోంది. తెలంగాణ అభివృద్ధికి ఆలంబనగా నిలుస్తోంది. ప్రగతిని నలుదిశలా వ్యాపింపజేస్తోంది. తెలంగాణలో కేసిఆర్‌ పాలన స్వర్ణయుగాన్ని తెచ్చింది. తెలంగాణ వచ్చిందనే మాటే వెయ్యేనుగుల బలం నింపింది. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ ధైర్యమే అభివృద్ధికి బాటలు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మదిలో నాటుకుపోయిన ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చాయి. నిన్నటి తెలంగాణ, నేటి తెలంగాణ అన్న రెండు పదాల మధ్య గొప్ప చరిత్ర ఆవిష్కరణ జరిగింది. ఎక్కడా చూసినా అభివృద్ది తొనికసలాడుతోంది. పట్నం నుంచి పల్లెదాకా ప్రగతి పరుగులు పెడుతోంది. సాగు చేసుకునేందుకు భూమి వున్నా, ఉపాధి లేక, సాగు సాగక, భుక్తి కరువై, బతుకు బరువై పట్నం వలసలు వెళ్లిన తెలంగాణ పల్లెలు తెలంగాణ రాకతో మళ్లీ వికసించాయి. వలసజీవితంలో అవస్థలు పడ్డ ప్రజలు పల్లెలకు చేరి మురిసిపోతున్నారు. భూమిని నమ్ముకొని సాగు చేస్తున్నరు. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ నీళ్లిస్తుంటే సాగుపండగ సాగిస్తున్నారు. పల్లెలు నీటి సవ్వడుల్లో సయ్యాటలాడుతున్నాయి. ఎండిన చెరువులు కొత్త శోభను సంతరించుకున్నాయి. నిండైన గంగాళాలయ్యాయి. ఎండాకాలంలో కూడా మత్తళ్లు దుంకుతున్నాయి. బీడు వారిన భూములు పొలాలై పులకరించిపోతున్నాయి. పంటలతో కళకళలాడుతున్నాయి. అంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని చెప్పిన విషయాలు, వివరాలు కవిత మాటల్లోనే…నమ్మకమన్న పదం ఎంత బలమైందో, కేసిఆర్‌ పాలన అంత గొప్పదని చెప్పడానికి ఎలాంటి సందేహంలేదు.

తెలంగాణ కోసం పట్టిన పట్టు విడవకుండా, వెరవకుండా, పిడికిలి దించకుండా పోరాటం చేసిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ఏర్పాటుతోనే పీడిత ప్రజల కష్టాలు,కన్నీళ్లు తీరుతాయని బలంగా నమ్మిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సాధన కోసం, బలమైన ఆశయంతో, పట్టుదలతో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన గొప్ప సంస్కర్త కేసిఆర్‌. తెలంగాణ పదాన్ని వేదం చేసి, ముందుండి నడిచిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సాధనతో సాధ్యమా అన్న పదాన్ని నిఘంటువులో లేకుండా చేసేలా తెలంగాణ సాధించిన ధీరుడు కేసిఆర్‌ . ఆయన చేతిలో తెలంగాణ మాగాణం బంగారమైపోయింది. పసిడి సిరులు పండుతున్నాయి. నీటి జాడలు లేక, నెర్రలు బారి తల్లడిల్లిన నేలతల్లిని నీటి ఆకలి తీర్చిన భగీరధుడు కేసిఆర్‌. పచ్చి జాడలేకుండాపోయిన, పొలాలు చూసి కుమిలిపోయిన రైతన్న కళ్లలో ఆనందభాష్పాలు రాలి ముత్యాలయ్యేంతగా మురిసిపోయే రోజు తెచ్చింది కేసిఆర్‌. తెలంగాణ సాగు సాగాలి. వ్యవసాయం పండగ కావాలి. రైతు రాజు కావాలన్నదే కేసిఆర్‌ కల. అసలు తెలంగాణ సాధనే రైతుకోసం. పచ్చని పల్లెకోసం. పాడిపంటలకోసం. మొత్తంగా నీటికోసం. ఆ నెరవేరిన స్వప్పం కన్నా రైతుకు ఆనందమేముంది. కేసిఆర్‌కు అంతకన్నా సంతోషమేముంది. తెలంగాణ ఎలా వస్తుంది అన్న వారు, తెలంగాణ వస్తే ఏమైతదన్నవారు కూడా తెలంగాణ చూసి అబ్బురపడుతున్నారు. ఆనందపడుతున్నారు. గర్వపడుతున్నారు. ఒకనాడు చిమ్మచీకట్లు కమ్మేసిన పల్లెలు చూసిన తెలంగాణ ప్రజలు పల్లె వెలుగులు చూసి మురిసిపోతున్నారంటే ఇంతకన్నా పండగమేముంటుంది. 

ఒకటా రెండా, పద్నాలుగేళ్ల కాలం పాటు ఉద్యమం సాగంచిన యోధుడు కేసిఆర్‌. ఆ ఉద్యమకారుడు పాలకుడైతే పాలన ఎంత స్వర్ణమయమో, కాలం స్వర్ణయుగమో చరిత్రే మురిసేంత పండుగ రోజు. ఒకనాడు గోదారిలో పారే నీరు చూసి, మా పొలాల్లోకి రాకుండాపోతున్నాయే అని కళ్లనుంచి కన్నీరులొలుకుతుంటే, కడుపులో దు:ఖం తన్నుకుంటూ వస్తుంటే, పెదవులు అదిమి పట్టుకొని, నా తెలంగాణ పొలాలు ఈ నీటితో ఎప్పుడు తడుస్తాయో అని కలత చెందినది కేసిఆర్‌. ఆ కతలను చెరిపేసి, రైతు కలలు నిజం చేసి కేసిఆర్‌ తెలంగాణ పాలిట దేవుడయ్యాడు. అపర భగీరధుడయ్యాడు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పల్లెలు పచ్చని పైటను కప్పుకొని, పొలాలై, వనాలై పోయాయి. నీరు లేక ఎవుసం సాగక, ఎండే పంటలు చూసిగుండెలు బాదుకోవడం కాన్న, పట్నం పోయి బతకడం మేలనుకొని, ఊళ్లు ఖాళీ చేసి, వలసలు పోయిన తెలంగాణ పల్లెలు మళ్లీ కళకళలాడుతున్నాయి. తెలంగాణ వస్తుందా? అన్న ప్రశ్నలు వినిపించిన నాటి నుంచి, తెలంగాణ వచ్చిందన్న సంతోషం నింపుకున్న తరుణం దాకా కాలానికి ఎదురీదిన యోధుడు కేసిఆర్‌…ప్రజల్లో చైతన్య రగిల్చిన చాణక్యుడు కేసిఆర్‌. ఎదురొచ్చిన వారిని రాజకీయంగా ఎదుర్కొన్న ధీరుడు…తెలంగాణ కల గన్నాడు. అందరినీ ఏకం చేశాడు. ముక్కోటి తెలంగాణ వాసుల చేత జై తలంగాణ అనిపించాడు. జనం నినదించేలా చేశాడు…ప్రతి ఒక్కరూ జై తెలంగాణ నానాదం నామస్మరణ చేసేలా చేశాడు. తెలంగాణ జాతి కోసం..తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ వెలుగు కోసం, పీడిత పాలనుంచి విముక్తి కోసం బరిగీసి నిలిచాడు. సకల జనులను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేశాడు. సబ్బండ వర్గాల ఐక్యతా రాగంతో జై తెలంగాణ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా నినదించేలా చేశాడు. ఒక్కడుగా మొదలై, కోట్లాది మంది గొంతుకలయ్యాడు…లక్షలాది మంది పోరాట యోధులను తయారు చేశాడు…ఉద్యమ ఆకాంక్ష నింపాడు. తెలంగాణ ఏర్పాటే శరణ్యమన్న భావన అందరిలో రగిలించాడు. తెలంగాణ ఉద్యమ చరిత్రకే నూతన అధ్యాయం లిఖించాడు. తన కీర్తిని శాశ్వతం చేసుకున్నాడు. తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను సైతం ఒడ్డేందుకు సిద్దపడ్డాడు. చావు నోట్లో తలపెట్టి, తెలంగాణ సాధించాడు. తెలంగాణ అన్నది సంధితో సాధ్యం కాకపోతే సమరమే అని ముందు నుంచే ప్రజలను సన్నద్దం చేశాడు. కడలి తరంగం అంతరంగమై అలలలాంటి తెలంగాణ ఆవేశాన్ని ఉద్యమంగా మలిచాడు. జనం గొంతుకలో కేసిఆర్‌ అనే నామస్మరణ కూడా జత చేశాడు…పిడికిలెత్తి తాను నినదిస్తూ, ప్రతి ఒక్కరి చేత తెలంగాణ జపం చేయించాడు. తెలంగాణ గుండె చప్పుడు ఉద్యమానికి తోడు చేశాడు. పల్లె ప్రజల ఊపిరిని తెలంగాణ ఉద్యమానికి ఆయువు చేశాడు. తెలంగాణ సాధనే లక్ష్యమై, ఉద్యమమై నిలిచి గెలిచిన సింహస్వప్నం కేసిఆర్‌.. తెలంగాణలో కష్టమన్న పదం రైతుకు దూరం చేసిన పెద్ద రైతు కేసిఆర్‌.

వ్యవసాయం పండుగయ్యింది. ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వులు విరభూస్తున్నాయి. తెలంగాణలో ఆసరా ఎంతో భరోసా ఇస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన ప్రభుత్వ వైద్యం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తోంది. తెలంగాణ పల్లెలో బస్తీ దవఖానాలు, జిల్లాల్లో వైద్య కళాశాలలు, వరంగల్‌ లాంటి నగరంలో 2వేల పడకల కొత్త ఆసుపత్రి, నిమ్స్‌ మరింత విస్తరణ, నగరం చుట్టూ నాలుగు పెద్ద ఆసుపత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ వైద్యరంగంలో విప్లవం వచ్చింది. తల్లీ బిడ్డల సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ ద్యేయం. ప్రగతిలో తెలంగాణ ఫస్టు,దేశంలోనే బెస్ట్‌ అని కొనియాడబడుతోంది. సంక్షేమంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలౌతున్నాయి. సాగునీరే కాదు, తాగు నీటి సమస్య లేకుండా పోయింది. ఫ్లోరైడ్‌ రక్కసి తరిమేయబడిరది. విద్యుత్‌ విప్లవం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ రైతు కన్నీటి నుంచి చూసిన కరెంటు, అదే తెలంగాణ రైతు చిరునవ్వును చూసేంత వెలుగునిస్తోంది. కోటి ఎకరాల మాగాణంతో దేశానికి తెలంగాణ అన్నం పెడుతోంది. రైతు బంధు వచ్చింది. రైతుకు ధీమా పెంచింది. భీమా కూడా కల్పించబడిరది. ఆ కుటంబాన్ని ఆదుకునేందుకు మార్గం వేయడిరది. పెట్టుబడి లేదన్న భయం లేకుండపోయింది. ఇలాంటి ఫథకాలు ఎక్కడైనా వున్నాయా? కళ్యాణ లక్ష్మి ప్రతి ఇంటిలో ఆడపిల్ల పెళ్లి భారాన్ని దించింది. ఐటి రంగానికి తెలంగాణ కేఆరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశమే మురిసిపోతోంది. కేసిఆర్‌ నాయకత్వం మాకూ కావాలని దేశమే కోరుకుంటోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రజలకు అభినందనలు,శుభాకాంక్షలు.

బొమ్మ… బొరుసు!

`నాణానికి చంద్రబాబు అటు, ఇటు!

`రాజకీయాలలో అందరూ అవకాశవాదులే!

`అధికారం కోసం విన్యాసాలే!!

`సంస్కరణల నుంచి సంక్షేమం బాట!

`రూటు మార్చిన చంద్రబాబు.

`బాబును నమ్మాలా..వద్దా! జనం అయోమయం.

`ఒకనాడు నేల విడిచి సాములు…పదేళ్లు పక్కనపెట్టిన ప్రజలు.

`గత అనుభవాలే నిదర్శనం.

`తెలుగుదేశం మౌలిక రూపానికి ఏనాడో ఎసరు.

`ప్రపంచ బ్యాంకు షరతులు అమలు.

`సంస్కరణల వైపు పరుగులు.

`ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు.

`వ్యవసాయం దండగ అంటూ వ్యాఖ్యలు?

`కంప్యూటరే కడుపు నింపుతుందని గొప్పలు!

`ఇప్పుడు నేల వైపు చూపులు.

`రైతుకు ఏటా 20 వేలంటూ ప్రకటనలు.

`గత ఎన్నికలలో నమ్మం బాబు అన్నారు…

`ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నాడు.

`2004 కు ముందు సిఈఓగా పిలిపించుకునేందుకు ఇష్టపడ్డాడు.

`సంస్కరణలతో జనం నడ్డి విరిచాడు.

`పన్నుల మీద పన్నులేసి వాయించాడు.

`ఇప్పుడు సంక్షేమం వెతుక్కుంటున్నాడు.

`జగన్‌ ను మించి ఉచితాలిస్తానంటున్నాడు.

`బాబొస్తే జాబొస్తుందనుకున్న జనమే, నిన్ను నమ్మం బాబు అన్నారు.

`ఒకప్పుడు సంస్కరణలే మేలన్నాడు…

`సంక్షేమం భారమన్నాడు.

`వ్యవసాయం దండగన్నాడు…కంప్యూటర్‌ పండగన్నాడు.

`పోలవరం ప్రచారం ఎంత చేసుకున్నా పూర్తి చేయలేకపోయాడు!

`ఇప్పుడు మళ్ళీ వరాల మూటలు పట్టుకొని వస్తున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:                     

చెప్పేది చంద్రబాబు అయితే విని రాసేది విలేఖరి అని ఉభయ తెలుగురాష్ట్రాలలో మీడియాలో నిజమైన సామెత. దాంతో జనం కూడా చంద్రబాబు చెప్పేది వినడం మానేశారు. విలేఖరులు రాస్తున్నది నిజామేనా అని జనం ఒకటికి రెండుసార్లు చర్చించుకుంటున్నారు. విశ్వసనీయత లేని నాయకుడుగా చంద్రబాబును చూస్తున్న జనం, విలేఖరులు రాసేది కూడా నిజమేనా అనుకునే స్ధితికి తెచ్చింది కూడా చంద్రబాబే… తన రాజకీయ స్వార్ధం కోసం వ్యవస్ధలన్నీంటినీ నిండా ముంచిన ఏకైక నాయకుడు చంద్రబాబు. రాజకీయంగా ఆయన ఎదుగుదల కోసం ఎన్టీఆర్‌ మీద పోటీ చేస్తానని చెప్పాడు. ఎన్నికలు పూర్తయిన మరుక్షణం తెలుగుదేశం పంచన చేరాడు. తన జీవితలక్ష్యాన్ని సునాయాసంగా నెరవేర్చుకున్నాడు. కుటిల నీతిని ప్రదర్శించి అపర చాణక్యుడినని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు. రాజకీయాలు చేసేవారందరికీ పదవుల మీద ఆశ వుంటుంది. ఉన్నతమైన పదవులు పొందాలని కోరిక వుంటుంది. కాని కష్టపడకుండానే ఉన్నత స్ధాయికి వెళ్లే అవకాశం కొద్ది మందికే వస్తుంది. ఎన్ని అడ్డదిడ్డమైన పనులు చేసినా, మరో ప్రత్నామ్నాయం లేని రాజకీయాల్లో ఆ నేతలనే జనం ఎంచుకోవడం కూడా జరుగుతుంది. అదే చంద్రబాబుకు వరమెంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు చంద్రబాబుకు ప్రత్నామ్నాయం లేకపోవడం జరుగుతోంది. అందుకే ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు చంద్రబాబు వైపు చూసే అవకాశం వైపు చూసిన పరిస్ధితులు గతంలోనూ వున్నాయి. 2014 ఎన్నికల్లో జనమంతా జగనే గెలుస్తున్నాడని అనుకున్నారు. ఆ జనమే మళ్లీ చంద్రబాబుకు పట్టం కట్టారు. అలా జనం కూడా తన నాడిని తెలియకుండా ఒక్కొసారి వారికి వారే షాక్‌లు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో సాగించిన రాజకీయ విన్యాసం అంతా ఇంతా కాదు. ఆనాటి చంద్రబాబు రాజకీయం నచ్చక ప్రజలు వైఎస్‌. జగన్‌కు పట్టం కడితే, సంక్షేమం ఒక్కటే పట్టుకొని, ప్రగతిని కొంత జగన్‌ దూరం పెట్టడంతో మళ్లీ జనం చంద్రబాబు గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తోందా? అన్న అనుమానం కల్గుతోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు జగన్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. అంటే జగన్‌ ఎంచుకున్న మూడు రాజధానుల ఆలోచన జనానికి నచ్చలేదని తేలిపోయింది. నిజానికి జగన్‌ అమరావతి అభివృద్ధిపై దృష్టిపెడితే, మరో దశాబ్ద కాలం పాటు తిరుగుండేది కాదు. కాని వచ్చిన అవకాశాన్ని జగన్‌ సద్వినియోగం చేసుకోలేదేమో? అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా చంద్రబాబు మాటలు జనం నమ్మొచ్చా… అన్నది కూడా చర్చనీయాంశమైపోయింది. ఉన్న ఫలంగా చంద్రబాబు సంస్కరణ వాదం నుంచి సంక్షేమం వైపు మళ్లడాన్ని జనం ముక్కును వేలేసుకునేలా చేస్తోంది. ముందైతే అవాక్కవుతున్నారు. సంపద నేనే సృష్టిస్తాను…నన్ను మించిన సంపద సృష్టించే నాయకుడు లేడని చెప్పుకునే మాటలు నమ్మితే మాత్రం చంద్రబాబుకు మరోసారి జనం జేజేలు పలికినట్టే..కాకపోతే చంద్రబాబు చేసిందేమిటి? సంపద పేరుతో చేసిన విద్వంసం ఏమిటన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం వుంది. 

 నిజానికి చంద్రబాబు సంక్షేమ వాది కాదు. 

సంస్కరణల వాది. ప్రపంచ బ్యాంకు షరతులు అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలకి నేట్టేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే సంక్షేమ భావనల పునాదుల మీద. కాని చంద్రబాబు ఆ పునాదులు పెలికించి వేశాడు. కొంత కాలం జనాన్ని కాల్చుకుతిన్నాడు. రెండు రూపాయల కిలో బియ్యం ధరలు కూడా పెంచాడు. ఐదు రూపాయలపావలా చేసి, సామాన్యుల నోటి కాడి ముద్దను లాక్కున్నాడు. రెండు రూపాయలకే కిలో బియ్యమిచ్చి తెలుగువారి ఆకలి తీర్చినపార్టీ తెలుగుదేశమని మళ్లీ మాయ మాటలు చెప్పి, అవకాశవాద రాజకీయాలను చేసిన నాయకుడు చంద్రబాబు. ఎన్టీఆర్‌ అందించిన సంక్షేమాలను రద్దు చేసి, ఆఖరకు మద్య నిషేదం ఎత్తి వేసి, మర్చిపోయిన మద్యాన్ని మళ్లీ జనం చేత తాగించిన ఘనుడు చంద్రబాబు. మద్యంతో వచ్చిన ఆదాయాం కూడా సంపద సృష్టిగా చెప్పుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు. ప్రజలకు మేలు చేయాలని, రైతులను తోడు నిలవాలని ఏనాడు కోరుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు సమయంలో రైతులకు ఊరట కల్గించేలా ఎన్టీఆర్‌ హార్స్‌పవర్‌కు రూ.50 చొప్పున ఏడాది కాలానికి అవసరమైన విద్యుత్‌ చార్జీనీ వసూలు ఎన్టీఆర్‌ ప్రభుత్వం వసూలుచేసింది. దాన్ని ఎత్తి చేసి విద్యుత్‌ ఛార్జీలు పెంచిన నాయకుడు చంద్రబాబు. విద్యుత్‌ చార్జీల పెంపును రైతులు నిరసిస్తే నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు. మరి అలాంటి నాయకుడు అధికారంలో వున్న నాడు రైతుల మీద పగతీర్చుకొని, అధికారంలో లేకపోవడంతో ప్రేమను కురిపిస్తున్నాడు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడాన్ని కూడా ఎగతాళి చేసి, ఎద్దేవా చేసిన నాయకుడు చంద్రబాబు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే వైర్లు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప, విద్యుత్‌ సరఫరాకు పనికిరావంటూ చంద్రబాబు వ్యాఖ్యానించాడు. అలాంటి నాయకుడు 2014 ఎన్నికల్లో ప్రజలు అవకాశం ఇచ్చినా, పోలవరం పూర్తిచేయలేదు. అమరావతి నిర్మాణం జరపలేదు. రాజధాని అమరావతి అంటూ జనాన్ని మభ్యపెట్టి, ప్రజాధనంతో చేసిన నిర్మాణాలన్నీ తాత్కాలిక నిర్మాణాలంటే తన చేతగాని తనాన్ని తానే నిరూపించుకున్నారు. జనం చేత చీ కొట్టించుకొని, గత ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూశారు. 

 తెలంగాణలో మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి, తెలంగాణ సస్యశ్యామలం చేశారు.

 అంతకు ముందే మొదలైన పోలవరం మాత్రం చంద్రబాబు పూర్తి చేయలేదు. తెలుగువారి కల నెరవేర్చలేదు. అందుకే జనం చంద్రబాబు మాకొద్దని వదిలించుకున్నారు. అధికారం నుంచి తొలగించారు. ఇక మాటకు ముందు సైబరాబాద్‌ నేనే నిర్మాణం చేసినా, ఐటి రంగాన్ని నేనే బలోపేతం చేసినా అని చెప్పే చంద్రబాబు ఏనాడు పేద విద్యార్ధుల కోసం చేసిందేమీ లేదు. సాంకేతిక విద్య ఒకప్పుడు అతి ఖరీదైన విద్య. ఆ విద్యను సంపన్న వర్గాలే ఎక్కువగా కొనుక్కొని చదువుకున్నవారే. ఐటి రంగంలో ఉద్యోగాలు అందుకున్నది కూడా వాళ్లే…ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ విద్యను పెంచింది, ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు అనుమతినిచ్చింది…పేదలకు ఆ విద్యను ఉచితంగా అందించింది మాత్రం వైఎస్‌. రాజశేఖరరెడ్డి. ఆయన మూలంగా కొన్ని లక్షల మంది విద్యార్ధులు ఇంజనీరింగ్‌ విద్యను రూపాయి ఖర్చు లేకుండా అభ్యసించారు. ఉన్నతమైన స్ధానాల్లో నేడున్నారు. మానవ వనరులను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్‌. రాజశేఖరెడ్డిదైతే, దాన్ని కూడ తన గొప్పగా తన ఖాతాలో వేసుకునేందుకు వెనుకాడని నాయకుడు చంద్రబాబు. ఆనాడు వైఎస్‌.రాజశేఖరెడ్డి ప్రైవేటు ఇంజనీరింగ్‌ విద్యను అందుబాటులోకి తీసుకురాకుంటే, తెలంగాణలో ఐటి అన్న పదం ఏనాడో చెదిరిపోయేది.   

తనను మించిన అపరమేధావి లేడన్నంతగా గొప్పలు చెప్పుకోవడంలో ఆరితేరిన చంద్రబాబు ఒకనాడు ఒక్కరు ముద్దు..

ఇద్దరు చాలు..మూడో సంతానం వద్దు అంటూ ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు దేశ జనాభా పెరగాల్సిన అవసరం వుంది. దేశానికి యువత అవసరం ఎంతో వుందంటూ వ్యాఖ్యానిస్తున్నాడు. అంటే చంద్రబాబు స్వతాహాగా ఆలోచించే నాయకుడు కాదు. కేంద్రంలో వున్న పార్టీలు చెప్పే విషయాలను ప్రచారం చేస్తుంటాడు. దానికి కారణం నేనే అని చెప్పుకుంటాడు. నోట్ల రద్దు నా సలహానే అన్నాడు. తర్వాత నోట్ల రద్దును వ్యతిరేకించాడు. ఇలా యూటర్న్‌ల చంద్రబాబు ఏ పని చేసినా, దాని నుంచి వెనక్కి మళ్లడం ఆపడు. భవిష్యత్తులో బిజేపితో పొత్తు వుండదంటూ, ఆ పార్టీతో పొత్తు చారిత్రక తప్పిదం అన్న చంద్రబాబు మళ్లీ బిజేపి వైపు ఆశగా చూస్తున్నాడు. రాజకీయ అవకాశ వాదం కోసం ఏదైనా మాట్లాడడం చంద్రబాబకు ఆలవాటు. ఇప్పుడు కూడా కర్నాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడం, అక్కడి మ్యానిఫెస్టోను వాడుకొని మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు కొత్తపథకం రచించాడు. మహానాడు సాక్షిగా కొత్త మ్యానిఫెస్టో ప్రకటించాడు. జనం నమ్మితే వాటినైనా అమలు చేస్తాడో లేదో…చూడాలి!

బిజేపి బిసి నినాదం బోగస్‌! 

బిఆర్‌ఎస్‌ అంటేనే బలహీన వర్గాల సంక్షేమం.

అసలైన బిసి వాదం వున్నది బిఆర్‌ఎస్‌ లోనే..

అన్ని వర్గాల అభ్యున్నతే బిఆర్‌ఎస్‌ లక్ష్యం.

-తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా బిజేపి ప్రయత్నం.

-మోసమే బిజేపి రాజకీయం.

-నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి కుమార్‌ ముదిరాజ్‌ బిజేపి అసలు స్వరూపంపై చెప్పిన ఆసక్తికర విషయాలు.

-బిజేపి అంటేనే అబద్దాల మయం.

-బిజేపి చెప్పేదంతా మాయమాటల మర్మం.

-బిసి గణన పచ్చి అవకాశవాదం.

-కేంద్రం బిసి గణనకు ముందుకే రావడం లేదు.

-దేశమంతా అడుగుతున్నా స్పందన లేదు.

-కేంద్రంలో బిసి కమీషన్‌ ఏర్పాటు లేదు.

-తెలంగాణ బిజేపిలో ఒక్క అధికార ప్రతినిధి బిసి లేడు.

-రాష్ట్రంలో ప్రగల్భాలు, కేంద్రం రిస్తహస్తాలు.

-కర్ణాటక లో కర్రుకాల్చి వాతపెట్టినా అబద్దాలు మానుకోవడం లేదు.

– కేంద్రంలో అధికారంలో వుండి బిజేపి తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదు.

`తెలంగాణ బిజేపి నేతలు రూపాయి తెచ్చింది లేదు.

`బిజేపి మాటలు కోటలు దాటుతాయి..కాళ్లు తంగెళ్లు దాటవు

`తెలంగాణకు ఏం చేస్తామన్నది చెప్పే దిక్కులేదు.

`బిజేపిని నమ్మితే నరకమే అని అన్ని వర్గాలకు తెలిసిందే…

`బలం లేని చోట బతికిబట్టకట్టే పరిస్థితే లేదులే!

`మతం చుట్టూ రాజకీయం అల్లే బిజేపి మానవత్వం చూపదులే!

`నిర్దాక్షిణ్యంగా పన్నులు వేస్తూ దేశం, ధర్మం అని ఇంకా మోసం చేయలేరు.

`ప్రజా ప్రతినిధుల సభకు సాధువులు, సన్యాసుల ప్రవేశమా?

`ప్రతిపక్షాలను పట్టించుకోలేదంటే బిజేపి ప్రజలకు దూరమైనట్లే!

-దేశంలోనే బిజేపి ఖతం…

హైదరబాద్‌,నేటిధాత్రి: 

కర్నాకట ఎన్నికల తర్వాత కూడా బిజేపి నేతలకు జ్ఞానోదయం కలగడం లేదు. పగటి కలలు కనడం మానుకోవడం లేదు. కర్నాటక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సామీప్యం లేదనుకుంటున్నారు. దేశమంతా కర్నాటక ఎన్నికల ప్రభావం వుంటుందన్న దాన్ని గ్రహించడం లేదు. తెలంగాణలో మరీ దిగజారి పోయే పరిస్ధితి ఎదురౌతుందని తెలిసినా, ఆత్మ విమర్శ చేసుకోవడం లేదు. ఇప్పటికే తెలంగాణలో ఉనికి లేదు. స్ధానం లేదు. అయినా వారి ఆలోచనా ధోరణిలో మార్పు రావడం లేదు. ప్రజల మనసును గెల్చుకోవాలని బిజేపి నేతలకు లేదు. చిత్తశుద్దితో పని చేయాలన్న సోయి లేదు. అంకితభావంతో ప్రజలకు రుణపడి వుండాలన్న ఆలోచనే లేదు. ఎంత సేపు రాజకీయమే..ప్రజలను మభ్యపెట్టడమే..మసిబూసి మారేడు కాయ చేయాలనుకోవడమే! ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను మోసం చేయడమే! అడుగడుగునా అబద్దాలాడడమే..అవే నిజమని నమ్మించాలని చూడడమే…బిజేపి నేతలకు ఎలాగూ నిజాలు చేత కాదు. వారి నోటికి రావు. నిజంలో బతకలేదు. అబద్దాలలో బతకడమే తెలుసు. అందుకే తెలంగాణ ప్రజలకు బిజేపి అంటే నమ్మకం లేదు. ఆ పార్టీకి ప్రజల మీద విశ్వాసం లేదు. అంతే కాదు తెలంగాణలో మేమే ప్రత్నామ్నాయం అనుకుంటున్నారే గాని, అసలు వారికి అభ్యర్ధులే లేదు. గ్రామ స్ధాయిలో బిజేపికి నిర్మాణమే లేదు. నాయకులు లేరు. కార్యకర్తలు లేరు. అసలు ఓట్లేసేవారే లేరు. క్షేత్ర స్ధాయి ఎలా వుందో అన్నది వారికి పూర్తిగా తెలుసు. అందుకే నిజాన్ని చూడలేక, అబద్దాల వెంట పరుగెత్తుతుంటారు. బిజేపికి మరో రెండు దశాబ్ధాలైనా సరే తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను ఎదరించే శక్తి రాదు. ఆ పార్టీ బలం పుంజుకోదు. ఈ లోగా బిఆర్‌ఎస్‌ దేశ వ్యాప్తమౌతుంది. దేశంలో ప్రజలందరి మనసుచూరగొంటుంది. బిజేపికి అసలు భవిష్యత్తే లేదు. తెలంగాణలో ఆ మాట అనుకునేందుకు కూడా వారికి అర్హత లేదంటున్న బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, మునుగోడు నియోజకవర్గంలో బలమైన బిసి సామాజికవర్గ నేత నారబోయిన రవి ముదిరాజ్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో బిజేపిని తూర్పాపడుతూ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు..మీ కోసం…ఆయన మాటల్లోనే..!

పూటకో రాగం అందుకోవడంలో బిజేపిని మించిన మోసపూరితమైన పార్టీ మన దేశంలో మరొకటి లేదు.

2014 ఎన్నికల్లో చెప్పిన మాటలు 2019లో లేవు. 2019లో అన్న మాటలు వచ్చే ఎన్నికల్లో వుండవు. 2014 ఎన్నికల ముందు గుజరాత్‌ మోడల్‌ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేసి, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపి ప్రజలను మోసం చేసింది. గుజరాత్‌ మోడలే ఒక డొల్ల అని తేలింది. దాంతో ప్రజలను ఇంకా మోసం చేయలేమంటూ దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల విన్యాసాలు చేశారు. విదేశాలల్లో వున్న నల్ల డబ్బును తెస్తామని, ప్రతి భారతీయుని అక్కౌంట్లో 15లక్షలు వేస్తామంటూ, నీతి మాలిన మాటలు చెప్పారు. అవన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారని గుర్తించి, నోట్ల రద్దు చేశారు. ఇంతలో జీఎస్టీ తెచ్చారు. ఇవి అద్భుతాలని ప్రచారం చేసి, కాలయాపన చేశారు. దేశంలో ఆర్ధిక ఉపద్రవం తెచ్చారు. నిజానికి గత ఎన్నికల సమయంలోనే బిజేపి ప్రజల విశ్వాసం కోల్పోయింది. కాకపోతే పల్వామాను రాజకీయంగా వాడుకొని మళ్లీ అధికారంలోకి వచ్చింది. దాని పర్యవసనామేమిటో అప్పటి కాశ్మీర్‌ గవర్నర్‌ నిజాలు కూడా ఇటీవల వెల్లడిరచారు. దాని ప్రభావం, బిజేపి అబద్దాల ప్రయాణమని కర్నాకట ప్రజలు తేల్చేశారు. దాంతో తెలంగాణ బిజేపి నేతలు బిసి నినాదం ఎత్తుకొని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. కాని ప్రజలు అంత తొందరగా నమ్మేందుకు సిద్దంగా లేదు. మరోసారి బిజేపి మాటలు నమ్మడం అంత సులువు కాదు. గత పార్లమెంటు ఎన్నికల్లో బిజేపికి ప్రజలు నాలుగురిని తెలంగాణ నుంచి గెలిపిస్తే రూపాయి నిధులు తెచ్చింది లేదు. ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు సాధించింది లేదు. అసలు పనులు చేసింది లేదు. పసుపు బోర్డు వారంలో తెస్తానని వాగ్ధానంచేసి, బాండ్‌ పేపర్‌ రాసిచ్చి, మోసం చేసిన చరిత్ర బిజేపి నేతలది. కనీసం వారి పార్లమెంటు స్ధానాలల్లో నైనా అభివృద్ధి పనులు సాధించింది లేదు. ఎంత సేపు మత రాజకీయం చేయడం తప్ప మరో మార్గం వారికి తెలియదు. 

మత రాజకీయాలు తెలంగాణ ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరని తెలుసుకొని బిసి రాజకీయం చేద్దామని చూస్తున్నారు. 

కాని బిజేపిని ప్రజలు నమ్మేందుకు ఎప్పుడూ సిద్దంగా లేదు. అసలు బిజేపి చెప్పే బిసి నినాదమే బోగస్‌. నిజంగా బిజేపికి బిసిలంటే గౌరవం వుంటే అధికారంలో వున్న రాష్ట్రాలలో బిసిలకు ఏం చేస్తున్నారన్నది ఎందుకు చెప్పడం లేదు. తెలంగాణలో రైతులకు రైతు బంధు లాంటి గొప్ప పధకాలు అమలౌతున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి గొప్ప నాయకుడు దేశంలోనే మరో నాయకుడు లేడు. ఆయన అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ నిర్మాణం సాగిస్తున్నాడు. భవిష్యత్తు దేశ నిర్మాణం ఎలా వుండాలన్నదానిపై ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. కాని బిజేపి నేతలకు అలా ప్రజలు బాగు పడడం ఇష్టం వుండదు. ప్రజలు బాగు పడడం నచ్చదు. ప్రజల మధ్య అంతరాలు పెంచి, మత రాజకీయాలు చేసి, కులాల కుత్సితాలు పెంచి పోషించాలన్నదే బిజేపి అసలు స్వరూపం. దేశంలో ఒక్క తెలంగాణలో తప్ప, ఏ రాష్ట్రంలో దళిత బంధు వంటి విప్లవాత్మకమైన కార్యక్రమం లేదు. అంతే కాదు త్వరలో తెలంగాణలో బిసిల సాధికారత, ఆర్ధిక స్వాలంబన కోసం లక్ష రూపాయల సాయం చేసేందుకు కూడా ముఖ్యమంత్రి ఒక గొప్ప కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇదీ దార్శనికుడైన నాయకుడి దూరదృష్టికి నిదర్శనం. మరి బిసి నాయకుడు దేశ ప్రధాని అని చెప్పుకునే బిజేపి దేశంలో బిసిలకు చేసిందేముంది? ఇప్పుడు కొత్తగా బిజేపి తెలంగాణకు చేసేదేముంది? అసలు దేశంలోనే బిసి గణన కావాలని కొన్ని సంవత్సరాలుగా ప్రజలు కోరుతున్నారు. ఎందుకు బిజేపి పట్టించుకోవడం లేదు. బిసి గణన కేంద్రం ఎందుకు చేపట్టడం లేదు. దేశంలో గతంలో బిసి కమీషన్‌ వుండేది. ఇప్పుడు బిజేపి ప్రభుత్వంలో ఎందుకు లేదు. బిసి కమీషన్‌ను ఎందుకు పునరుద్దరించడం లేదు. కమీషన్‌ ఎందుకు ప్రకటించడం లేదు. నిజంగా బిజేపికి బిసిల మీద అంత ప్రేమ వుంటే ఎప్పుడో బిసి కమీషన్‌ ప్రకటించేది. 

రాష్ట్రంలో తలా తోక లేని వాదనలు చేసే నాయకులు బిసి గణన చేస్తారట? కేంద్ర అనుమతి లేకుండా ఎలా చేస్తారు? 

నిజానికి కేంద్రానికి ఆ చిత్తశుద్ది వుంటే బిజేపి పాలిత రాష్ట్రాలలో ఎందుకు చేపట్టలేదు. ఇవన్నీ డొల్ల మాటలు. మాయా మశ్చీంద్ర లెక్కలు. అసలైన బిసి వాదం వుంది బిఆర్‌ఎస్‌లేనే …అన్ని వర్గాల అభ్యున్నతి జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలోనే…సర్వ మత ప్రజలు, సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను ఏక దృష్టితో చూసి అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తెలుసు. కాని బిజేపికి ఆ విధానం తెలియదు. రాజ్యాంగ విలువలు తెలియవు. అసలు తెలంగాణ అంటేనే బిజేపి పెద్దలకు ఇష్టం లేదు. ప్రధానమంత్రి స్ధానంలో వున్న వ్యక్తి తెలంగాణపై సమయం , సందర్భం లేకుండా విషం కక్కుతూ వుండడం అనేకసార్లు చూశాం. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ అన్నాడు. పార్లమెంటులో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని అన్న ప్రధాని తెలంగాణకు మేలు చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? అందుకే తెలంగాణ ప్రజలు ఎప్పటికీ బిజేపిని నమ్మరు. బిజేపి నేతల చేతుల్లో ఎప్పటికీ తెలంగాణను అప్పగించరు. వారికి అర్హత లేదు. తెలంగాణ మీద బిజేపి నేతలకు అవగాహన కూడా లేదు. తెలంగాణ హద్దులు కూడా తెలియవు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నది కేసిఆరే. సాగు నీటిరంగంలో కొత్త తెలంగాణను ఆవిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. సాగు రంగంలో తెలంగాణను అన్న పూర్ణ చేసింది ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఉపాధి రంగంలో దేశంలోను ముందున్న రాష్ట్రం తెలంగాణ. అన్ని రంగాల్లో తెలంగాణనే ఫస్టు. బెస్టు. అలాంటి తెలంగాణలో అత్యాశలు పెంచుకుంటున్న బిజేపికి కూడా ప్రజలు కర్నాకటలాగా కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయం..ఆ పార్టీ దేశమొత్తం మునగడం తధ్యం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version