పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కారుగుర్తు పై ఓటు నమూనా ఈవీఎంలతో ఓటు వేసే విధంగా అలాగే పార్టీ మేనిఫెస్టో గురించి తెలియజేస్తూ ఓటర్స్ ను అభ్యర్థించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఆముదాలపల్లి అశోక్ గౌడ్ పాల్గొని గ్రామాల్లో మంచి స్పందన ఉందని తెలుపుతూ వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులైన విధిగా బూత్ లెవెల్ కార్యకర్తలతో కలిసి వారిని ఇదే ఉత్సాహంతో పనిచేసే విధంగా చూడాలని కోరారు.ఈ కార్యక్రమం లో గ్రామ పార్టీఅధ్యక్ష కార్యదర్శులు పల్లెబోయిన రాజు,మంగళపల్లి రాజయ్య, మాజీ ఏఎంసి డైరెక్టర్ దానం నిరంజన్,పల్లెబోయిన సురేష్ మాజీ సర్పంచ్ ఆలేటి రవీందర్, వడ్ల మహేందర్,యూత్ నాయకులు పల్లబోయిన రాజేష్,పుట్ట చంద్రమౌళి, శ్రీకాంత్,బుర్రి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
