బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతం వాటర్ ట్యాంక్ ఏరియా 9వ వార్డు అధ్యక్షుడు గడ్డల మధుసూదన్ ఆధ్వర్యంలో పోచమ్మ గుడి ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ఈ ప్రాంత మహిళల కొరకు బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని,పోచమ్మ గుడి ఆవరణంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, మహిళలు భక్తితో పాల్గొనే బతుకమ్మ వేడుకలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బతుకమ్మ తల్లి పూజలో భాగంగా శుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు పాల్గొన్నారు.