విద్యార్థులకు కుల్లిన కూరగాయలా ?
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: కుళ్లిపోయిన కూరగాయలతో
విద్యార్థులకు ప్రిన్సిపల్ వంటలు వండమంటున్నారని పాఠశాల వంట మనిషి వెంకటేశం సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అలా కుళ్లిపోయిన కూరగాయలతో తాను వంట వండనని, విద్యార్థులకు ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులని అన్నందుకు పాఠశాల ప్రిన్సిపల్ తనను దుర్భాష లాడిందని అన్నారు.స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. ఫిర్యాదు అందుకున్నస్థానిక తహసిల్దార్ తిరుమలరావు, డిప్యూటీ తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది, అందులోని సామగ్రిని పరిశీలించారు. అంతేకాకుండా మధ్యాహ్నం వండిన భోజనాన్ని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అధికా రులకు ఫిర్యాదు చేసినందుకు సంబంధిత వంట మనుషులను విధులకు రానీ యకుండా ప్రిన్సిపల్ వెళ్లగొట్టారని ఫిర్యాదుదారుడు వెంకటేశం సిరి న్యూస్ కు. తెలిపారు.