ఆరావళి కాపాడుకోకపోతే అంతే…’’మన అంతే’’?

`పాలకులంటే ప్రజలకే కాదు ప్రకృతికి కూడా కాపలాదారులే.

`ప్రకృతే ప్రపంచం… కాపాడుకోకపోతే అంతం?

`భూమి మీద జీవ రాశి సర్వనాశనం?

`పర్యావరణం జీవ జాతికి ఆవరణం.

`సర్వ కోటి ప్రాణికి అలవాలం.

`ఇప్పటికే జరగాల్సింత నష్టం జరిగిపోయింది!

`పునరుద్దంచే శక్తి లేక పోయినా పగబట్టి పాడుచేస్తున్నారు?

`ప్రకృతి తిరిగి పగ పడితే ఒక్కరూ మిగలరు.

`కావాలి కాయమంటే ఖతం చేసుకుంటూ పోవడం ప్రకృతికి విరుద్ధం!

`అభివృద్ధి అంటే అడవులు నరడం కాదు.

`పరిశ్రమలు అంటే పర్వతాలు పాడు చేయడం కాదు.

`ప్రగతి అంటే ప్రకృతి ధ్వంసం చేయడం కాదు.

`ఆరావళి అంగుళం కరిగినా కష్టమే.

`ఆరావళి మైనింగ్‌ వల్ల తీరని నష్టమే.

`ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వతాలు ఆరావళి.

`అలాంటి పర్వతాలు ఉత్తర అమెరికాలో ఆల్ఫ్స్‌ పర్వతాలు, దక్షణ అమెరికాలో అండీస్‌ పర్వతాలు వున్నాయి.

`ప్రపంచంలో ఆరావళి లాంటి పర్వతాలు మరెక్కడా లేవు.

`ఆరావళి పర్వతాలు భూమి ఏర్పడినప్పుడు పుట్టిన అత్యంత పురాతన పర్వతాలు.

`భూమి ఏర్పడినప్పుడు మొత్తం ఒకటే భూభాగం.

`ఇప్పుడు ఏడు ఖండాలుగా విడిపోయింది.

`ఆరావళి పర్వతాలు చెక్కు చెదరకుండా వున్నాయి.

`అనేక భూకంపాలను తట్టుకొని నిలబడ్డాయి.

`ఆరావళి పర్వతాలు 300 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి.

`హిమాలయాలు ఏర్పడి కేవలం 5 లక్షల సంవత్సరాలు మాత్రమే.

`ఇప్పుడు హిమాలయాలు వున్న ప్రదేశం లో తెథిస్‌ అనే సముద్రం ఉండేది.

`యురేషియా నుంచి వచ్చే ‘‘గర్జించే నలభైలు’’ అనే చలిగాలు అడ్డుకుంటున్నాయి.

`నైరుతి నుంచి వచ్చే వేడి గాలులను ఆరవళి అడ్డుకుంటోంది.

`అందుకే మన దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని సమ సీతోష్ణ స్థితి వుంది.

`ఆరావళి తరిగి పొతే పడమర నుంచి వచ్చే వేడి గాలి పెరుగుతుంది.

`హిమాలయాలు కరిగిపోతాయి.

`దేశం ఎడారి మయ మౌతుంది… వాతావరణం మారిపోతుంది.

`వర్షాకాలం మాయమౌతుంది.

`అయితే చలి, లేకుంటే వేడి మిగులుతాయి.

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

 ప్రపంచంలో ప్రకృతి ఒదిగి వుంది. ప్రకృతిలో అమ్మ దాగి వుంది. అమ్మను చంపుకుంటే బతుకేమౌతుంది? అమ్మ లేకుంటే బతుకెలా వుంటుంది? ప్రకృతి లేని సమాజం అమ్మలేమితో సమానం. అమ్మే లేకపోతే మనం లేము. మనం లేకపోతే ఈ ప్రపంచమే ఊహించజాలము. ఇంతటి విడదీయ రాని బందాన్ని తుంచేయాలనుకోవడం ప్రమాదకం. అసంతులిత భవిష్యత్తుకు మార్గం. ప్రకృతిని మనం నాశనం చేస్తే, ప్రకృతి మనల్ని లేకుండా చేస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం. ఆ ధర్మాన్ని పాటిస్తే ఈ ప్రపంచం పది కాలాల పాటు పచ్చగా వుంటుంది. ఆ దర్మాన్ని తప్పితే ప్రపంచమే నాశనమౌతుంది. పర్యావరణ అసమతులత్యత మానవ మనుగడను ప్రశ్నార్దకం చేస్తుంది. అప్పుడు ఎంత మొత్తుకున్నా జనం బతికేందుకు అవకాశం వుండదు. అడవి జోలికి, అమ్మ జోలికి, ప్రకృతి జోలికి ఎవరూ వెళ్లరు. వెళ్తే అమ్మ కోప్పడుతుంది. ప్రకృతి పగ పడుతుంది. వినాశనం సృష్టిస్తుంది. మనం సృష్టించలేని దానిని మనం నిర్మూలించే హక్కులేదు. కాపాడలే బాద్యత లేనప్పుడు, కనుమరుగు చేసే నైతికత మనకు లేదు. ప్రగతి పేరుతో, అభివృద్ది పేరుతో పర్యావరణాన్ని పాడు చేసుకుంటూ పోతే మిగిలేది బూడిదే. అది మన మనుషుల మరణశాసనానికి వేదికే. అందుకే ఆరావళి మీద కన్ను పడిరదని తెలియగానే జనం ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆందోళన చెందారు. జనం ఆక్రోశం వెల్లగకక్కారు. మనకు ఏది రావాలన్నా ప్రకృతి నుంచే రావాలి. ఆ ప్రకృతినే ఫణంగా పెట్టి పాడు చేస్తే మనకు ఏం మిగులుతుంది. భవిష్యత్తు శూన్యమౌతుంది. ఇప్పుడు మనం ఆరావళిని కాపాడుకోలేకపోతే మన పని అంతే..ప్రజల జీవితాలు అంతే! ప్రకృతిలో నిండిన ప్రపంచాన్నికాపాడుకోవడం అందరి బాధ్యత. కర్తవ్యం కూడా…ఏ ప్రకృతితో మొదలైన జీవరాశి ఆదే ప్రకృతిలో కలిసిపోతుంది. జీవరాశి సర్వనాశనమౌతుంది. ఇప్పటికే జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా కాపాడుకోవడం మానేసి మరింత విద్వంసం చేసుకోవడం ఖర్మను ఆహ్వానించుకోవడమే!! పాలకులు అంటే ప్రజలకే కాదు, ప్రకృతికి కూడా కాపలా దారులే. పాలకులంటే ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రజలే నియమించుకున్న కాపలా దారులు. కంచే చేను మేసినట్లు ప్రకృతిని విద్వంసం చేసే వారికి పాలకులు దారి చూపడం సరైంది కాదు. అనుమతులు ఇవ్వడం అసలే మంచిది కాదు. అందులో ఆరావళి పర్వతాల విశిష్టత తెలుసుకోకపోవడం విచార కరం. విడ్డూరం. భగభగమండే సూర్య గోళం నుంచి ఒక ముక్క విడిపోయి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత చల్లారి భూమిగా మారింది. ఆ భూమి ఇప్పటికీ అంతర్భాగంలో పదివేల సెంటీగ్రేట్‌ వేడిని కలిగి వుంటుంది. అలా చల్లబడిన భూమి పుట్టుక నాడు ఏర్పడిరదే ఆరావళి పర్వత శ్రేణి. అలాంటి పర్వత శ్రేణులు మరోరెండు మాత్రమే ఈ భూమ్మిద వున్నాయి. యూరప్‌లో ఆల్స్ఫ్‌ పర్వతాలు. అమెరికాలో ఆండీస్‌ పర్వతాలు. అవికూడా ఆరావళి అంత అత్యంత పురాతణ పర్వతాలు కాదు. ఈ భూమ్మిదనే మొట్టమొదటిసారి ఏర్పాటైన పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలు ఏర్పాటై సుమారు 300 కోట్ల సంవత్సరాలౌతోంది. ఒకప్పుడు మొత్తం ఒకే దగ్గర వున్న ఈ భూమి కాల క్రమంలో ఖండాలుగా విడిపోయింది. కాని ఆరావళి పర్వతాలు అంతర్ధానం కాలేదు. కూలిపోలేదు. కుచించుకుపోలేదు. పుట్టినప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా వున్నాయో ఇప్పటికీ అలాగే వున్నాయి. కాకపోతే కోతకు గురౌతూ వస్తున్నాయి. మనిషి కన్ను పడిన తర్వాత కరుగుతూ వస్తున్నాయి. అంతే తప్ప వాటిలో మార్పు మొదట్లో లేదు. సహజంగా భూమి మీద వున్న ఎత్తైన ప్రాంతాలను పర్వతాలు, కొండలు, గుట్టలు అని పిలుస్తారు. అలా పర్వతమయమైన ప్రాంతాల జోలికి ఎవ్వరూ వెళ్లరు. ఎందుకుంటే పర్వతాలలో కూడా పురాతన పర్వతాలు, మధ్య పర్వతాలు, నవీన పర్వతాలు అని కూడా వుంటాయి. ఆ పర్వతాలలో నిద్రానపర్వతాలు వుంటాయి. ఆ నిద్రాన పర్వతాల జోలికి వెళ్లడం అత్యంత ప్రమాదకరం. అందుకే యూరప్‌ , అమెరికా దేశాలలో వున్న ఆల్ప్స్‌ , ఆండీస్‌ పర్వతాలను ముట్టుకోరు. కాని మన దేశంలో మాత్రం ముట్టుకున్నారు. తొలుస్తున్నారు. ఆరావళి పర్వతాలను ఒక్కసారి ముట్టుకుంటే నైరుతి నుంచి వచ్చే వేడి గాలుల వల్ల మద్య భారతమంతా ఎడారిగా మారుతుంది. ఆ వేడి గాలులు హిమాలయా పర్వతాలను తాకుతాయి. ఆ గాలుల మూలంగా హిమాలయాలు కరిగిపోతాయి. సముద్ర మట్టాలు పెరుగుతాయి. దక్షిణ భారత దేశ రాష్ట్రాలు మునిగిపోతాయి. మిగిలే మధ్య భారతం ఎడారిగా మారుతుంది. హిమాలయాలు కరిగిపోతే యురేషియా ప్రాంతాల నుంచి వచ్చే చల్లని గాలల మూలంగా ఎడారిలో కనీసం పచ్చిక బయళ్లు కూడా మొలవవు. ఊహిస్తేనే ఇంత భయంకరంగా వుంది. ఇప్పుడే డిల్లీలో ప్రజలు ఊపిరాడక చస్తూ బతుకుతున్నారు. ఆరావళిని తొలిచేస్తే జాతి మనుగడే వుండదు. అసలు పీల్చుకోవడానికి మనిషే వుండకుండా పోతాడు. ఒక నిర్మాణం జరగడానికి ఎంతో సమయం పడుతుంది. కాని కూల్చడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కొన్నికోట్ల సంవత్సరాలుగా మన దేశాన్ని కాపాడుతూ వస్తున్న ఆరావళిని అంగుళం కరిగించినా జనజీవనమే కాదు, జీవ జాలం కూడా అంతమౌతుంది. సుమారు 660 కిలోమీటర్ల వెడల్పుతో, 700 కిలోమీటర్ల పొడవుతో దేశ ప్రకృతిని సమతుల్యం చేస్తున్న ఆరావళిని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద వుంది. ఇప్పటికే రాజస్దాన్‌ ఎడారిగా మారిపోయింది. జనం బతకడానికి వీలు లేకుండాపోయింది. ఇప్పుడు ఆరావళి కొండలను మైనింగ్‌ కోసం వాడుకుంటే అందులో వుండే ప్రకృతి సంపద మొత్తం ఆవిరౌతుంది. కొన్ని కోట్ల జీవరాసులు అంతమౌతాయి. సుమారు 12వేల రకాల జీవ జాలం వున్నట్లు చెబుతున్నారు. కొన్ని వేల రకాల ఔషద మొక్కలు వున్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఆ మొక్కల వల్ల గాలి, నీరు మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. అటు నర్మద, ఇటు తపతి నదులు చీల్చుతూ పెట్టని గోడలుగా మన దేశాన్ని కాపాడుతున్న ఆరావళిలో కూడా అనేక చిన్న చిన్న నదులున్నాయి. అవి మనకు మంచినీటిని అందిస్తున్నాయి. నదులుగా పారి, భూ గర్భ జాలలను పెంచుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని కాపాడుతున్నాయి. ఇలా అన్ని రకాలుగా భౌగోళికంగా కాపాడడమే కాకుండా, ప్రకృతి వరప్రదాయినిగా మారిపోయింది. పర్వతాలకు, కొండలకు, గుట్టలకు ప్యారా మీటర్లు పెట్టింది లెక్క పెట్టుకోవడానికే గాని, విధ్వంసం చేసుకోవడానికి కాదు. ఇప్పటికైనా సరే పాలకులు ఇకపై ఆరావళి జోలికి వెళ్లకూడదు. భవిష్యత్తులో చిన్న ఇసుక రేణు కూడా ఆరావళినుంచి కదిలించకూడదు. అన్యాయాన్ని ఆపగలిగేశక్తి వున్న సుప్రింకోర్టు అనుమతులు ఇవ్వడం అనేది ఒక్కసారిగా భారతీయులను ఉలిక్కిపడేలా చేసింది. నిజంగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పులో మొత్తం బాగంలో ఏముందో ఎవరికీ తెలియదు. ఎవరూ పూర్తి మద్యంతర ఉత్తర్వులను చదివి వుండకపోవచ్చు? కాని మైనింగ్‌ మొదలౌతోందన్న వార్తలు తెలిసిన వెంటనే ప్రజలు స్పందించారు. తమ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప్రకృతి విధ్వంసాన్ని ప్రశ్నించారు. నిజానికి ఈ పని కోర్టులు చేయాలి. ఇప్పుడు ప్రజలు ముందుకు వచ్చారు. పాలకులను ఆలోచనల్లో పడేశారు. ఇక ముందు కూడా ఇలాంటి నిర్ణయాలు ఒక్క ఆరావళికే కాదు, ఇతర పర్వతాలు, కొండలకు ఇచ్చే అనుమతుల ముందు కూడా ఆలోచించాలి. ప్రకృతిని చెరపట్టే ప్రయత్నాలు మానుకోవాలి. నేటి తరానికే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా ఈ వారసత్వ సంపదను అందించాల్సిన బాద్యత పాలకులపై వుందని మర్చిపోవద్దు. ప్రకృతి వినాశకాన్ని ప్రోత్సహించొద్దు. ప్రకృతి కన్నెర్ర చేస్తే క్షణం చాలు. జీవ జాలం సమాధికి అరక్షణం చాలు!!! ఎప్పటికైనా కొండలను మింగే అనకొండలు వస్తారనేమో దేవుళ్లు, దేవతలు కొండలు, కోనలు, గుట్టలు, పర్వతాలలో కొలువై వున్నారు. శేష్‌ నాద్‌ నుంచి మొదలు, అమర్‌నాధ్‌, బద్రీనాధ్‌, అమ్మ వారు వైష్ణోదేవి నుంచి దక్షిణాదిన కలియుగ వెంకటేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, విజయవాడ దుర్గమ్మ, సింహాద్రి అప్పన్న, యాదగిరి నర్సింహా స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే కొండకొండకు కొలువై వున్న దేవుళ్లెంతో మంది వున్నారు. ఆఖరుకు సమ్మక్క సారక్క లాంటి వీరవనితలు కూడా దేవతలై చిలుకగట్ట మీదకు చేరుకొని అదృష్యమై అడవిని, ప్రజలను, సంపదను కాపాడుతున్నట్లున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version