రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పట్టణ కమిటీ,వివిధ మోర్చాల కమిటీల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు బిజెపి పట్టణ అధ్యక్షులు వేముల అశోక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేముల అశోక్ మాట్లాడుతూ…. బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు గా
కట్ట ఈశ్వర చారి,మాసు సత్యనారాయణ,ఉపాధ్యక్షులుగా వైద్య శ్రీనివాస్,ముద్దసాని శ్రీనివాస్, వీరమల్ల రాజయ్య,కార్యదర్శులు గా జీడి ప్రభాకర్,పాకాల ప్రభాకర్ లను నియమించడం జరిగిందని తెలిపారు.బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గా కున్సోత్ సంతోష్ రామ్,ఎస్సీ మోర్చా అధ్యక్షుని గా బంగారి ప్రసాద్,మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలుగా పాకాల శ్రీలత, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు గా గజ్జల వెంకన్న లను నియమించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి కేంద్ర ఫిలిం బోర్డ్ సభ్యులు ఆర్మూల్ల పోషం,సీనియర్ నాయకులు బంగారు వేణుగోపాల్, ఠాగూర్ దన్సింగ్, దండు రాజేందర్ మహిళా మోర్చా జిల్లా నాయకురాలు వేముల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన బిజెపి పట్టణ కమిటీ నాయకులు వివిధ మోర్చాల అధ్యక్షులు మాట్లాడుతూ…
ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడతామని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.