నిమ్జ్ లో మరో ముందడుగు…

నిమ్జ్ లో మరో ముందడుగు…

• తాగునీటి పైప్ లైన్కు రూ.10కోట్లు

• పూర్తికావొస్తున్న బీటీ రోడ్డు నిర్మాణం

• వెమ్, హుండై ఏర్పాటుకు కార్యాచరణ

• ప్రభుత్వ ప్రతిపాదన 12,500 ఎకరాలు

• ఇప్పటి వరకు 3,500 ఎకరాల సేకరణ

• భూముల ధరలకు రెక్కలు

• గ్రామాల్లోనూ వెంచర్ల ఏర్పాటు

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

BT road

 

నిజ్జా (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) పారిశ్రా మిక వాడలో మరో ముందడుగు పడనుంది. జహీరాబాద్ నియో జకవర్గంలో ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దాదాపు 12,500 ఎకరాల భూమిని సేక రించేందుకు ప్రతిపాదించింది.

అందులో ఇప్పటికే దాదాపు 3,500 ఎకరాలను సేకరించి పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తుంది.

అయితే మిగత భూమి సేకరించినందుకు ప్రభుత్వం సంకల్పించినప్ప టికీ ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతుల నుంచి వ్యతిరే కత వ్యక్తమవడంతో భూ సేకరణలో ఆలస్యం అవుతోంది.

అయితే సేకరించిన నిమ్ భూమిలో మౌలిక సదుపాయాల కోసం అధికారులు ఇప్పటికే పలు ప్రతిపాదనలు రూపొం దించగా అందులో భాగంగా తాగునీటి పైప్లాన్ కోసం ప్రస్తుతం ప్రభుత్వం రూ.10,02,98,136 (ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వ్యాల్యూ) మంజూరు చేసింది.

ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న మిషన్ భగీరథ పైప్లాన్ నుంచి నూతనంగా ఏర్పాటు చేయనున్న వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు, హుండై పరిశ్రమకు పైపులైన్ వేసి తాగునీటి సౌకర్యం కల్పించను న్నారు.

ఈ మేరకు మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికా రులు పనులు చేపట్టేందుకు టెండర్ ఆహ్వానించారు.

వచ్చే నెల 7వ తేదీ వరకు టెండర్ బిడ్లు దాఖలు చేసుకోవడానికి కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించారు.

BT road

ఈ పైప్ లైన్ పనులు పూర్తయితే ఆ రెండు పరిశ్రమలతో పాటు నిజ్జా పారిశ్రామి కవాడలో కొంతవరకు నీటి వసతి కల్పించినట్లు అవు తుంది.

కాగా ఇప్పటికే కలెక్టర్ వల్లూరి క్రాంతి గతంలో నిమ్డ్ ప్రాంతాన్ని పర్యటించి మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదే శించారు.

అంతర్గత రోడ్ల నిర్మాణానికై పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందిం చాలని కలెక్టర్ ఆదేశించారు.

కాగా జాతీయ రహదారి65 హుగ్గెల్లి చౌరస్తా నుంచి కృష్ణాపూర్, మాచ్నూర్, బర్డీపూర్ గ్రామాల సమీపం నుంచి నిమ్ వరకు రూ.100 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తికావస్తున్నాయి.

100 ఫీట్ల వెడల్పుతో 9 కిలోమీటర్ల దూరం బీటీరోడ్డు పనులు ఇప్ప టికే పూర్తి చేశారు.

ఈ రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి దానిపై ఇరువైపులా ఎస్ఈడీ లైట్లు బిగించారు.

అలాగే చౌరస్తాల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.

అయితే హుగ్గెల్లి చౌరస్తా సమీపంలో జాతీయ రహ దారిని ఇరువైపులా వెడల్పు చేసి రాకపోకలు సాఫీగా జరి గేలా పనులు కొనసాగుతున్నాయి.

ఈ పనులు పూర్తయితే నిమ్స్ రోడ్డును ప్రారంభించి రాకపోకలను అధికారికంగా కొనసాగించే అవకాశం ఉంది.

అలాగే నిమ్డ్ అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే రవాణా సౌకర్యం పూర్తిస్థాయిలో కలగనుంది.

ఇదిలా ఉండగా ఇక్కడ వెన్ టెక్నాలజీ, హుండై పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే శంకుస్థాపన జరగగా..

నిర్మాణ ర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ కొనసాగు తుంది.

ఈ రెండు పరిశ్రమలతో ఎలాంటి కాలుష్యం లేనం దున స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

వీటి ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యో గాలు వస్తాయని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.

కాగా జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్డ్ ఏర్పాటు చేయడం వల్ల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

హుగెల్లి చౌరస్తా సమీ పంలో జాతీయ రహదారి65, నిమ్డ్ రోడ్లకు ఆనుకుని ఉన్న ఎకరా భూమి ధర ఏకంగా రూ.8కోట్లు పలుకుతుందంటే జహీరాబాద్ ప్రాంతంలో భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

అదేవిధంగా బర్దీపూర్, మాచ్నూర్ నిమ్డ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న భూముల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి.

మారుమూల ప్రాంతా ల్లో ఉన్న భూముల ధరలు సైతం విపరీతంగా పెరిగిపో యాయి. సామాన్యుడు ఎకరా భూమి కూడా కొనలేని స్థితిలో ధరలు ఉన్నాయి.

అయితే ముందుచూపు ఉన్న పెట్టుబడిదారులు జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ముందుగానే వందల ఎకరాల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాట్లు చేశారు. మండలాలు, మారుమూల గ్రామాల్లో సైతం ఇంకా వెంచర్ల ఏర్పాటు కొనసాగుతూనే ఉంది.

ఈ వెంచర్లల్లో ప్లాట్లుగా విభజించి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతు న్నారు.

పట్టణాల్లోని ప్లాట్ల ధరలకు దీటుగా మండలాల్లో ప్లాట్ల ధరలు పలుకుతున్నాయి.

ఇదంతా జహీరాబాద్ ప్రాంతానికి నిమ్డ్ రావడం వల్లేనని వేరే చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా పారిశ్రామికంగా నిమ్డ్ అభివృద్ధి చెందినట్లయితే జహీరాబాద్ ప్రాంత రూపురేఖలు మారే అవకాశం ఎంతైనా ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version