అంబేద్కర్ యువజన సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన నిర్వహించాలి.
చిట్యాల, నేటిధాత్రి :
మంగళవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్ అధ్యక్షతన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ… భారత రాజ్యాంగ రచయిత , బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించుట కొరకు ఏర్పాటు అయినటువంటి అంబేద్కర్ యువజన సంఘం ఆవిర్భవించి 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49వ ఆవిర్భావ దినోత్సవం గ్రామాలలో ఘనంగా జరుపుకోవాలని అన్నారు. కుల మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ కులాలకు చెందినవారు , వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని గ్రామాలతో పాటు మండల జిల్లా రాష్ట్రవ్యాప్తంగా సంఘాలను ఏర్పాటు చేయాలని వారిలో అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు కొనసాగించుటకు కృషి చేయాలని అన్నారు . తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రిజిస్ట్రేషన్ నంబరు 1033/77 తేదీ 21 సెప్టెంబర్ 1976లో జె బి రాజుచే రిజిస్టర్ చేయబడిన సంఘమని చెప్పారు .49 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ అవిలయ్య నాగరాజు* లు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల సాంస్కృతిక కార్యదర్శి దాసారపు నరేష్ ముఖ్య సలదారులు సరిగోమ్ముల రాజేందర్ లు పాల్గొన్నారు
