https://epaper.netidhatri.com/
ఉద్యమ కాలం నాయకులంతా కేసిఆర్ వైపు.
ఉద్యమ కారులంతా బిఆర్‌ఎస్ లోనే.
ఉద్యమ ద్రోహులంతా కాంగ్రెస్ లోనే.
పొన్నాల వచ్చిండు…అస్తిత్వం చూపిండు.
నాగం వచ్చిండు…నమ్మకం నిలబెట్టుకున్నడు.
తెలంగాణ ఆత్మగౌరవం కేసిఆర్ తోనే.
అభివృద్ధి కేసిఆర్ చూపిన బాటలోనే..
తెలంగాణ ఎప్పుడూ మొదటి స్థానంలోనే.
హైదరబాద్,నేటిధాత్రి:
ముఖ్యమంత్రి కేసిఆర్ అంటే తెలంగాణ ప్రజలకు బలీయమైన నమ్మకం. అచెంచలమైన విశ్వాసం. ఆయన మాత్రమే తెలంగాణ కోసం ఆలోచిస్తారన్న భరోసా. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఒక దశలో తూర్పారపట్టిన వాళ్లు సైతం ఆయన నాయకత్వాన్ని కోరుకోవడం విశేషం. అలా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని గుర్తించిన కొన్ని వందల మంది నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇంకా చేరుతున్నారు. ఎన్నికల వేళ ప్రజలకు కేసిఆర్ నాయకత్వాన్ని మించిన పాలన మరెవరూ అందిచలేరన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇటీవల బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో చెరుకు సుధాకర్ గౌడ్ ఒకరు. ఆయనకు ముఖ్యమంత్రి కేసిఆర్‌తో పద్నాలుగేళ్లఉద్యమ అనుబంధం వుంది. చెరుకు సుదాకర్ గౌడ్ తెలంగాణలోనే పిడి. ఆక్ట్ అనుభవించిన ఏకైక నాయకుడు. ఉద్యమ సమయంలో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ఉమ్మడిపాలకులు ఆయనను నిర్భంచారు. రెండేళ్లపాటు జైలులో వుంచారు. పిడి. ఆక్ట్ అంటే ఎంతో కఠినంగా అమలు చేస్తారోతెలియంది కాదు. అంతంటి శిక్షను కూడా ఆయన అనుభవించారు. తెలంగాణ కోసం అంతటి పోరాటం చేశారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కేసిఆర్‌కు దూరమయ్యారు. కారణాలు ఏవైనా కావొచ్చు. కాని కాలం ఎంతో గొప్పది. ముఖ్యమంత్రికేసిఆర్‌కు ఒక దశలో అత్యంత ఆప్తులుగా వున్న వాళ్లలో కొందరు ఎందుకు ఆ సమయంలో దూరమయ్యారో గాని, మళ్లీ తెలంగాణకు మంచి రోజులు వచ్చినంతగా వాళ్లు బిఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. నాటి ఉద్యమ కాలం నాటి జోష్‌ను పార్టీకి నింపుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే అవకాశం లేకపోయినా, ఒక అబద్దాన్ని పదే పదే చెబితే నమ్మే అవకాశంవుంది. దాంతో అవకాశవాదులంతా ఏకమైన తెలంగాణను అస్ధిరపర్చే రాజకీయాలు కాంగ్రెస్‌లో చేస్తున్నారు. ఇది గమనించి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి. చీకట్లు పారద్రోలిన తెలంగాణ ఎప్పుడూ వెలుగుల్లోనే వుండాలని చెరుకు సుధాకర్ గౌడ్ లాంటి వారు మళ్లీ బిఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. నిజమైన తెలంగాణ వాదులంతా బిఆర్‌ఎస్ వైపు నిలబతారన్న సంకేతాన్ని పంపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో వున్న నాయకులంతా సీమాంధ్రకు మద్దతుగా నిలుస్తున్న నాయకులే. రేవంత్‌రెడ్డి చంద్రబాబు నాయకుడు అనుంగు శిష్యుడు. చంద్రబాబు కోసం పనిచేసే వాళ్లందరినీ తెచ్చి కాంగ్రెస్‌లో నింపారు. అసలైన కాంగ్రెస్ నేతలను బైటకు పంపిస్తున్నారు. దాంతో మళ్లీ తెలంగాణకు ఉపద్రవం వచ్చే ప్రమాదం లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర రావు లాంటి వారిని పార్టీలో చేర్చుకొని, ఆయనకు సముచిత స్ధానం కల్పిస్తే బిఆర్‌ఎస్‌కు తీరని ద్రోహం చేశారు. రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌ను వ్యతిరేకించని తుమ్మల చివరకు చంద్రబాబు కోసం అదే పార్టీలో చేరారు. తెలంగాణ కోసం గొంగలిపురుగునానా ముద్దాడుతా! అని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఎక్కడ! చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టే దిగజారుడు నాయకుడు తుమ్మల ఎక్కడ!! తెలంగాణ ప్రజలు బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుంది.
ఇక కరుడు గట్టిన కాంగ్రెస్‌వాదిగా నలభై ఐదేళ్లపాటు ఆ పార్టీకి క్రమశిక్షణ కల్గిన సైనికుడుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య లాంటి వారిని కూడా కాంగ్రెస్ పార్టీ మనస్తాపానికి గురిచేసింది.
అసలు పొన్నాల నాయకత్వంలో పిసరంత కూడా సమానం కాని రేవంత్‌రెడ్డి కూడా ఆయన గురించి వ్యాఖ్యలు చేసే దాకా వెళ్లింది. ఇప్పుడున్న కాంగ్రెస్‌లో అందరికన్నా పెద్ద మనిషి పొన్నాల లక్ష్మయ్య. ఆయన వయసుకైనా విలువ ఇవ్వలేదు. పొన్నాల ఉన్నత విద్యావంతుడు. ఎంతో విజ్ఞానవంతుడు. అమెరికాలో అతి విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని నిత్యం సతమతమయ్యే రాజకీయాలను ఎంచుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చి ప్రజా సేవ చేశారు. కాంగ్రెస్‌కు ఎంతో సేవ చేశారు. కాని ఆయనకు మిగిలింది మళ్లీ సీమాంధ్ర నాయకత్వానికి గొడుగుపట్టేవారి ముందు అవమానం ఎదురైంది. అలాంటి నాయకుడికి తెలంగాణలో అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి కేసిఆర్ బిఆర్‌ఎస్ బృందాన్ని పంపించి సాదరంగాస్వాగతించారు. పొన్నాల అనుభవం పార్టీకి ఎంతో అవసరమని గుర్తించారు. ఆయన సేవలు తెలంగాణకు అవసరం. ఎందుకంటే ఒక ఇంజనీర్‌గా, నీటిపారుదల శాఖమంత్రిగా సుధీర్ఘమైన అనుభవం పొన్నాలకు వుంది. తెలంగాణ ఇప్పటికే ఎంతో సస్యశ్యామలమైంది. ఇంకా పూర్తిస్ధాయిలో తెలంగాణ సాగులో ముందంజలోకి వెళ్లాలి. అందుకు ఇంకా సాగునీటి రంగంలో అనేక పనులు పూర్తి కావాలి. అందుకు పొన్నాల లాంటి వారి అనుభవం తెలంగాణకు ఉపయోగడాలి. దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ముందుచూపుతో ఇలా పొన్నాల లాంటి నాయకులకు ప్రాధాన్యతనిస్తున్నారు. నిజానికి పొన్నాల లక్ష్మయ్య బిఆర్‌ఎస్‌కు ఎప్పుడో వస్తే ఆయనకు మరింత గౌరవం దక్కేది. ఆయన సేవలు తెలంగాణకు ఎంతో ఉపయోపగడేవి. ఇప్పటికీ మించి పోయింది లేదు. భవిష్యత్తు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆయన పాత్ర కీలకం కానున్నది. మళ్లీపొన్నాలరాజకీయం పట్టాలెక్కనుంది. ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడనుంది.
ఇక మరో తెలంగాణ ఉద్యమ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి.
నిజానికి నాగం జనార్ధన్‌రెడ్డి నాయకత్వం గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. కాని తెలంగాణ ఉద్యమం కోసం ఆయన పదువులు కూడా వదులుకున్నారు. విద్యార్ధి దశలోనే ఆయన 1969 ఉద్యమంలో క్రియాశీకలంగా పనిచేశారు. జైలుకెళ్లారు. నాగం జనార్ధన్‌రెడ్డి తన పెళ్లి కార్డులో కూడా జై తెలంగాణ అని ముద్రించుకున్న నాయకుడు. అంటే అలాంటి ఉద్యమ నాయకుల్లో కనిపించే ఏకైక వ్యక్తి నాగం జనార్ధన్‌రెడ్డి. తన రాజకీయ జీవితంలో ఉద్దాన పతనాలు ఎన్ని వున్నా, తెలంగాణ కోసం ఆయన చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీలక నేత. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత రెండో స్ధానంలో కనిపించిన నాయకుడు నాగం జనార్ధనరెడ్డి. మంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. చంద్రబాబును సైతం ఎదిరించిన నాయకుడు నాగం. చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2009 తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాడు. నాగంను చూసిన విద్యార్ధులు ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆయనపై దాడి చేశారు. దాంతో వెంటనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పూర్తి స్ధాయిలో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ఇండిపెండెంటుగా పోటీచేసి గెలిచారు. పూర్తిగాతెలంగాణ ఉద్యమానికి అంకితమయ్యారు. జేఏసిలో కీలకభూమిక పోషించారు. తెలంగాణ వచ్చేదాకా అలుపెరగని పోరాటం చేశారు. అయితే ఆయన 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత బిజేపిలో చేరారు. అక్కడ ఆయనకు సముచితమైన స్ధానం లభించలేదు. ఉద్యమకారుడున్న గౌరవం అక్కడ ఎవరూ చూపించలేదు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా రేవంత్‌రూపంలో అడుగడుగునా అన్యాయమే జరిగింది. దాంతో ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌లో చేరితేనైనా కనీసం గౌరవం దక్కుతుంది. ఆత్మాభిమానం మిగులుతుందని ఆలోచించారు. బిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు మించిన ఆత్మగౌరవం లేదని తెలుసుకున్నారు.
ఇటీవలే తెలంగాణ గాయకుడు ఏవూరి సోమన్న తిరిగిబిఆర్‌ఎస్ గూటికి చేరుకున్నాడు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కొంత కాలంగా దూరంగా వుంటూ వచ్చారు. కొంత కాలం కాంగ్రెస్‌కు సేవలందించారు. బిజేపికి అందించారు. ఆఖరుకు షర్మిలకు కూడా పాటలందించారు. వాళ్లంతా వారి అవసరార్ధం వాడుకున్నారు. అందుకే నమ్మకం అన్న పదం దొరికేది ఒక్క కేసిఆర్ దగ్గరే అని మళ్లీ సొంత గూటికి వచ్చారు. జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే, పిజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా బిఆర్‌ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిశారు. ఇలా తెలంగాణలో ఎవరికైనా ఆత్మగౌరవం నిండేది..ఆత్మాభిమానం కాపాడేది ఒక్క బిఆర్‌ఎస్సే..అది కేసిఆరే!