తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయ్..
తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని తిరుపతి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాథన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండిగోకు చెందిన అన్ని విమానాలూ తిరుపతి నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు.
5, 6 తేదీల్లో మాత్రం ఇండిగో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. డిసెంబరు 5న తిరుపతి విమానాశ్రయానికి రాకపోకలు సాగించాల్సిన 24 విమానాల్లో 18 రద్దుకాగా 6 విమానాలు ఆలస్యంగా నడిచాయన్నారు. అలాగే డిసెంబరు 6న 2 విమానాలు రద్దుకాగా 10 విమానాలు ఆలస్యంగా నడిచాయని వివరించారు. ఈ అంతరాయం కేవలం ఇండిగో విమానాలకు మాత్రమే పరిమితమైందని, ఇతర విమానయాన సంస్థల కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయని చెప్పారు.
