బాలుడి ఆపరేషన్ కు ఐదు లక్షల ఖర్చు
దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు అశ్విత వెంకటేష్
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అశ్విత అనే నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది.ఏడాది వయస్సున్న కుమారుడు మాహాన్ పుట్టిన నెల రోజులలోనే తలకు ఏర్పడిన గడ్డ ప్రాణాంతకంగా మారడంతో ఆపరేషన్ చేయాలనీ డాక్టర్ లు అన్నారు.వెంకటేశ్,అశ్వితలు ఇరువురు నిరుపేద కుటుంబానికి చెందినవారే వెంకటేశ్ పరకాల పట్టణంలో చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు.బాలుడి మెదడులో రక్తం గడ్డకట్టడం వల్లనే కణితి పెరుగుతోందని, హైదరాబాద్ కి తీసుకెళ్లి చికిత్స చేయించాలని డాక్టర్ లు సూచించారు.తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించిన ఫలితం లేకుండా పోయింది.లక్షల అప్పులు చేసి పలు సార్లు వైద్య శస్త్ర చికిత్సలు చేయించారు అయినప్పటికీ నయం కాకపోగా రోజు రోజుకూ పరిస్థితి ఇబ్బంది కరంగా మారడంతో వైద్యులను సంప్రదించగా మళ్ళీ ఆపరేషన్ చేయాలని అందుకు ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్ లు తెలిపారు.మరోసారి శస్త్ర చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు.ఎవరైనా దాతలు ముందుకువచ్చి సహాయం చేస్తే తమ కుమారుడిని కాపాడుకుంటామని దాతలు ఉంటే 7075419300 నంబరును సంప్రదించాలని దంపతులు కోరారు.