మహిళా కమిషన్ విచారణకు నటుడు శివాజీ.. స్టేట్‌మెంట్ రికార్డ్..

మహిళా కమిషన్ విచారణకు నటుడు శివాజీ.. స్టేట్‌మెంట్ రికార్డ్

 

మహిళా కమిషన్ ముందు విచారణకు నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్స్‌ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు శివాజీ.

నటుడు శివాజీ (Actor Shivaji) బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. హీరోయిన్స్‌ను ఉద్దేశించి శివాజీ చేసిన అభ్యంతర వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని శివాజీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో విచారణకు హాజరైన శివాజీ.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్‌మెంట్‌ను మహిళా కమిషన్ రికార్డ్ చేసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా శివాజీ క్షమాపణలు చెప్పారు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version