నల్లబెల్లి, నేటి ధాత్రి:
మాజీ తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ 117వ జయంతి ఉత్సవాన్ని విస్మరించిన ఎంపిడిఓ నరసింహమూర్తి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సీ ఎంపిటిసి ఫోరం జిల్లా అధ్యక్షుడు జన్ను జయరావు మాట్లాడుతూ తొలి దళిత ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతిని అన్నిప్రభుత్వ కార్యాలయంలో
అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జయంతి ఉత్సవాన్ని విస్మరించి నిర్వహించకపోవడం చాలా బాధాకరమని కేవలం దళిత ఉప ప్రధాన అనే ఉద్దేశంతో కార్యక్రమానికి హాజరుకాకుండా జయంతి వేడుకలు నిర్వహించని ఎంపిడిఓ నరసింహమూర్తి పై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, తెలంగాణ విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సురేష్, రాజేందర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.