కొత్తగూడ, నేటిధాత్రి :
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రయివేటు పాఠశాలలలో అధిక ఫీజు దోపిడీని అరికట్టాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో విజయవంతం గా జరిగింది.ABVP కార్యకర్తలు పాఠశాలలకు వెళ్లి బంద్ నిర్వహించారు. ఈ సందర్బంగా ABVP పూర్వ జిల్లా కన్వీనర్ పాకాల.మునిందర్ మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలపై విద్యా శాఖ అధికారుల నిఘా ఉండాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు పాఠశాలలో అక్రమంగా అధిక ఫీజులు వసులు చేస్తున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేటు పాఠశాలలలో బుక్స్, యూనిఫామ్ అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ పాఠశాలలలో పెడుతున్న మధ్యాహ్న భోజనం లో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి,నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలని మరియు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ఏబీవీపీ జిల్లా నాయకులు గూడూరు.దుర్గాప్రసాద్, గుగులోత్.శ్రీను, దేవేందర్,పాల్గొన్నారు