చర్చకు చోటు లేకుండా చేసుకున్న చద్దా!

`చరిత్ర కావాలనుకున్నాడు.. చర్చకు అవకాశం కోల్పోయాడు!

`నాయకుడి అత్యాశ పార్టీకి చేటు!

`ఆప్ నాయకుడు రాఘవ్ చద్దాపై వేటు!

`అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చింది.

`పార్టీ ప్రస్తావన లేకుండా తన సొంత అభిప్రాయాలతో మాట్లాడం మొదలు పెట్టాడు.

`పార్టీ నాయకుల మీద కేసుల సందర్బంలో నోరు మీదపలేదు.

`కేజ్రీవాల్ అరెస్ట్ పై పెద్దగా స్పందించలేదు.

`మనీష్ సిసోడియా ఏడాదిన్నర జైలు జీవితంపై మాట్లాడలేదు.

`సొంత పార్టీ మీద కేసులు నమోదుపై గళమెత్తలేదు.

`చర్చల్లో తన పార్టీ ప్రస్తావన లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.

`వ్యక్తి గత ఇమేజ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

`ప్రజా సమస్యల ముసుగులో బలపడాలని చూసాడు.

`జంజీ నాయకుడిగా గుర్తింపు రావాలని కోరుకున్నట్టున్నారు.

`పార్టీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు.

`తన చర్చల ద్వారా పెరగాలని చూసాడు.

`పార్టీ కోసం కాకుండా వ్యక్తి గత ప్రతిష్ట కోసం పాకులాడాడు.

`పదవిని అడ్డం పెట్టుకొని సొంత ఇమేజ్ బిల్డప్ చూసుకునే ప్రయత్నం చేశాడు.

`యువత లో మంచి క్రెజ్ సంపాదించుకున్నాడు.

`తన పార్టీ ప్రస్తావన పూర్తిగా మర్చిపోయాడు.

`అందుకే పార్టీ పక్కన పెట్టింది.

`కేంద్రం మీద యుద్ధం ముసుగులో తన పేరు కోసం కృషి చేసాడు.

`ఎప్పుడైనా పార్టీ లేకుండా నాయకులు పుట్టలేరు.

`పార్టీ పెట్టినా అందరూ నాయకులు కాలేరు.

`ఇంకా బలమైన నాయకుడుగా పేరు పూర్తిగా రాకుండానే తొందర పడ్డారు.

`మీడియా వెంట పడుతుంటే తన వల్లే అని భ్రమ పడ్డాడు.

`పార్టీ అండ లేకుంటే ఎవ్వరూ దరి చేరరనే విషయం మర్చిపోయాడు.

`ఇతర పార్టీల నుంచి వస్తున్న సానుభూతి నిజమనుకుంటున్నాడు.

`నాలుగు రోజులు గడిస్తే అసలు వాస్తవం తెలుసుకుంటాడు.

`తనది కాని మీడియను నమ్మి బాగుపడిన వారు ఎవరు లేరు.

`ఈ నిజం తెలుసుకుంటేనే నాయకుడు గా రాణించ గలడు.

హైదరాబాద్, నేటిధాత్రి:                     రాఘవ్ చద్దా.. ఈ మధ్య కాలంలో ఇతని పేరు వినవి వారుండదు. ఆయన రాజ్యసభలో వేసిన ప్రశ్నలు తెలియకుండా వుండరు. కొద్ది రోజుల్లోనే అత్యంత పాపులర్ అయిన రాజ్యసభ సభ్యుడు, ఆప్ పార్టీ డిల్లీ నాయకుడు రాఘవ్ చద్దా. అనుకోకుండా మొన్న రాఘవ్ చద్దా రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి పోయింది. పైగా ఆయనకు తమ పార్టీ తరుపున రాజ్యసభలో మాట్లాడేందుకు కూడా సమయం కేటాయించకండి అంటూ ఆప్ పార్టీ నుంచి రాజ్యసభ చైర్మన్‌కు ఉత్తరం చేరింది. ఈ విషయం ఆప్ పార్టీయే ప్రకటించింది. దేశమంతా ఒక్కసారిగా అవాక్కయింది. మీడియా దానిని హైలెట్ చేసింది. మాట్లాడే గొంతు నొక్కేశారని సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపించాయి. కాని ఆప్ పార్టీ ప్రకారం ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయకపోయినా, వ్యక్తిగత ఇమేజ్‌కోసం పాకులాడుతున్నాడన్నది స్పష్టం. సహజంగా రాజీకయాల్లో వున్న వాళ్లు తమ సొంత ఇమేజ్‌ను బిల్డప్ చేసుకోవాలని చూడడంతో తప్ప్పులేదు. పెద్ద నాయకుడు కావాలన్న ఆశలోనూ ఇబ్బంది లేదు. కాని పార్టీ తరుపున కాకుండా తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం మాత్రమే పదవులు వినియోగించుకుంటామంటే ఏ పార్టీ ఊరుకోదు. రాజకీయ పార్టీ ఏదైనా సరే సహించదు. ఇక్కడా సరిగ్గా అదే జరిగింది. ఆప్ పార్టీ రాఘవ్ చద్దాకు అడుగడుగునా కీలక పాత్రనిస్తూనే వస్తోంది. ఆపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్ప్పుడు కీలకమైనబాద్యతలు అప్పగిస్తూ వచ్చారు. ఉన్నత విద్యావంతుడు, ఆర్ధిక శాస్త్రంపై మంచి పట్టున్న నాయకుడుగా రాఘవ చద్దాను పార్టీ గుర్తించింది. గతంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఆయనను ఆదరిస్తూ వచ్చారు. పార్టీలో మంచి ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. డిల్లీలో ఎమ్మెల్యేగా కూడా పార్టీ అవకాశమిచ్చింది. కాని ఆయన పార్టీ ఇచ్చిన గుర్తింపును నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆప్ పార్టీపై కత్తికట్టినప్పటి నుంచి రాఘవ్ చద్దా తన సొంత రాజకీయ పరపతి పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. బిజేపి ఆ పార్టీపై రాజకీయంగా అణచివేసే వ్యూహాలను అనుసరిస్తున్నప్ప్పుడు కూడా రాఘవ చద్దా సైలెంట్‌గానే వున్నారు. ఆ ప్ పార్టీకి చెందిన నేతలను వరసుగా అరెస్టులు చేస్తున్నప్ప్పుడు కూడా రాఘవ చద్దా మౌనంగానే వున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినా పార్టీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయనకు ప్రాదాన్యత తగ్గించలేదు. రాజ్యసభకు ఎంపిక చేసిన మరీ మరింత ప్రాదాన్యతనిస్తూ వచ్చింది. ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఏడాదిన్న కాలం పాటు జైలు పాలు చేసినప్ప్పుడు కూడ ఆయన ఎలాంటి స్పందన చూపించలేదు. పార్టీకి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించలేదు. బిజేపి మీద పోరాటం చేయలేదు. పార్టీ పరంగా ఉద్యమాలలో పాలు పంచుకోలేదు. రెండున్న సంవత్సరాలుగా ఆయన పార్టీ కార్యాలయం వైపు కూడా చూడడం లేదన్న వార్తలున్నాయి. ఆఖరుకు ఆప్ పార్టీ అదినేత అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్టు చేసి ఐదు నెలులు జైలులో పెట్టింది. అయినా ఆయన ఎక్కడా పార్టీ కోసం పని చేసిన దాUలాలు లేవు. మద్యం పాలసీ విషయంలో కోర్టు తీర్పు, నిందితులందరూ విడుదలయ్యారు. ఆ సమయంలో కూడా రాఘవ్ చద్దా పార్టీతో లేరు. ఇలా కీలకమైన ఘట్టాలప్ప్పుడు ఆయన కేజ్రీవాల్ పక్కన లేరు. ఆయనకు అండడం లేదు. పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లేదు. కాని పార్లమెంటు సమావేశాలప్ప్పుడు మాత్రం ప్రజా సమస్యలపై చర్చ పేరుతో ఆయన ప్రస్తావించే అంశాలు కూడా ఆప్ పార్టీ పరంగా ప్రశ్నించే అర్దం వచ్చేలా ఆయన మాట్లాడడం లేదు. కేవలం ఆయనకు మాత్రమే పేరు వచ్చేలా చూసుకుంటున్నారు. ఇలా గత ఏడాది కాలంగా పార్టీ రాఘవ్ చద్దా వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తూ వస్తోంది. ఆయనను ఏనాడు పార్టీ కూడ ప్రశ్నించలేదు. అయినా ఆయన లో మార్పు రాలేదు. ఇటీవల కాలంలో ఇక రాఘవ చద్దా తన సొంత ఇమేజ్‌ను పెంచుకునేందుక అటు పార్లమెంటు వేదికగా, ఇటు సోషల్ మీడియా ద్వారా తన రాజకీయం మొదలు పెట్టారు. రకరకాల సమస్యలపై ఆయన గళమెత్తుతూ వస్తున్నారు. ఆఖరుకు గిగ్ కార్మికుల సమస్యలపై కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు. వారి సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఒక రోజు గిగ్ వర్కర్ అవతారమెత్తారు. డోర్ డెలివరీ ఎంత కష్టమో చూపించారు. గిగ్ కార్మికులు పడుతున్న కష్టాలను ప్రపంచానికి చూపించారు. ఇంత వరకు బాగానే వుంది. ప్రజా సమస్యలు లేవనెత్తడం కోసమే ప్రజా ప్రతినిధులు వుండాలి. అయితే అదే సమయంలో పార్టీ పరమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకోవాలి. పార్టీ తరుపున పోరాటాలు చేయాలి. అంతే కాని పూర్తిగా ఇండిపెండెంటుగా గెలిచిన ఎమ్మెల్యేలాగా, ఎంపిలాగా వ్యవహరిస్తామంటే ఏ పార్టీ ఊరుకోదు. నిజం చెప్పాలంటే రాఘవ్ చద్దా లేకుపోయినా, ఆప్ పార్టీ వుంటుంది. ఆప్ లేకుండా రాఘవ్ చద్దా నాయకుడు అయ్యేవారు కాదు. పార్టీ ఆయనకు ఎంతో ప్రాదాన్యతనిస్తూ ఇంత ఎత్తు ఎదిగేందుకు అవకాశం కల్పించింది. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఆయన నాయకుడిగా ఎదగడానికి పార్టీకూడా సహకరిస్తుంది. భవిష్యత్తులో కూడా మరింత గుర్తింపు నిస్తుంది. కాని ఆ అవకాశాలను తన రాఘవ్ చద్దా పోగొట్టుకున్నట్లే లెక్క. పార్టీ అదినేతలైనా సరే పార్టీకి కట్టుబడి మాత్రమే పనిచేయాలి. ఏ నాయకుడు పార్టీకి సంబందం లేకుండా పనిచేస్తామంటే ఏ పార్టీ ఉపేక్షించదు. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలనే చూసుకున్నా, జాతీయ రాజకీయాల గురించి చెప్ప్పుకున్నా, పార్టీ అధినేతలను గురించి ప్రస్తావించకుండా రాజకీయాలు చేయడం ఏ నాయకుడికైనా అసాద్యం. బిజేపి నాయకులెవర్వరైనా సరే ప్రధాని మోడీ గురించి ప్రస్తావించకుండా ఏ ప్రసంగం చేయరు. అటు పార్లమెంటులోనైనా, రాష్ట్రాలలో వున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా సరే బిజేపి పెద్దలను ఉటంకిస్తూనే రాజకీయాలు చేస్తారు. రాజకీయ సభలైనా, ప్రభుత్వ కార్యకాలాపాలలోనైనా సరే ఆ పార్టీ పెద్దలను గుర్తు చేసుకుంటు వుండాలి. అవి పార్టీ పరమైన సిద్దాంతాలుగానే చూడాల్సి వుంటంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఏ నాయకుడైనా సరే ప్రతిసారి ఆ పార్టీకి చెందిన నేతలు ఇందిరాగాందీ నుంచి మొదలు రాహుల్ గాందీ, ప్రియాంకా గాందీ, ఆఖరుకు ఇప్ప్పుడు ఏఐసిసి. అద్యక్షుడుగా వున్న మల్లికార్జున ఖర్గే లను గుర్తు చేసుకోకుండా వుంటే పార్టీ క్షమించదు. ప్రాంతీయ పార్టీలలో ఈ పట్టింపులు మరింత ఎక్కువగా వుంటాయి. కేసిఆర్ పేరును పదేపదే గుర్తుచేసుకోకుండా ఏ పార్టీ నాయకుడు మాట్లాడరు. వీలు దొరికన ప్రతిసారి కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటూ మాట్లాడాల్సిందే. ఆ నాయకుడికి ఆకాశానికెత్తాల్సిందే. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఎన్టీఆర్, చంద్రబాబుల పేర్లు వాడకుండా ఏ నాయకుడు ఎక్కడ మాట్లాడినా పార్టీ ఆ క్షణమే పక్కన పెట్టే పరిస్దితులు ఎదురౌతాయి. అలాంటిది రాఘవ్ చద్దా పార్టీ ప్రస్తావన గాని, ఆప్ పార్టీ అదినేత అరవింద్ కేజ్రీవాల్‌ను గుర్తు చేసుకోకుండా ఆ పార్టీ అవకాశాన్ని , సమయాన్ని వినియోగించుకుంటుంటే ఊరుకుంటారా? ఏ పార్టీ ఊరుకోదు. ఆప్ కూడా వదిలిపెట్టలేదు. రాజకీయ పార్టీల నాయకులెంత వారైనా సరే ఒక లిమిట్ వుంటుంది. ఆ లిమిట్ దాటితే ఎ వరికైనా సరే వేటు పడుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. రాఘవ చద్దాకు అన్యాయం జరగలేదు. అలా మరే ఏ నాయకుడు కట్టుదాటకుండా వుండాలంటే ఇలా వేటు వేస్తేనే అందరూ జాగ్రత్తగా వుంటారు. పార్టీని రక్షించుకుంటారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version