చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గ్రామ పాలకవర్గానికి బుధవారం రోజున టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈర్ల పెళ్లి రాజు గ్రామ పాలకవర్గ సభ్యులకు ఘణంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామానికి ఎన్నో సేవ చేసిన మల్యాల గ్రామ పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగిందని తెలిపారు వీరే కాకుండా నెక్స్ట్ వచ్చే సర్పంచి పాలకవర్గం సభ్యులు కూడా ఇదేవిధంగా పనిచేయాలని అయినా అన్నారు ఇటి కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు మరియు కార్యదర్శి గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.