సెయింట్ జాన్స్ పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్ట్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి :
రామకృష్ణాపూర్ పట్టణంలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల డైరెకర్ పొన్నాల వినయ్,ప్రిన్సిపాల్ పొన్నాల సుమన్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు వివిధ రకాల వంటలను తయారు చేసుకొచ్చి పాఠశాలలో ప్రదర్శించారు. హైదరాబాద్ బిర్యాని, కేక్స్, హలీమ్, చికెన్ కబాబ్ వంటి వంటకాలు, పిండి వంటకాలు ఈ ఫెస్ట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విద్యార్థులు చెఫ్ వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు. ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
