నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో బుధవారం జరిగింది.ఎస్సై పరమేశ్ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుండెబోయిన కీర్తన జగదీష్ ల పెద్ద కుమార్తె బుధవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న నీటి సంపులో పడి పోయింది. ఇంట్లో మరొక కుమార్తెను తీసుకొని తల్లి బయటికి రాగానే కూతురు కనిపించలేదు. అటు ఇటు గా వెతికిన తల్లి నీటిసంపులో పడిన కుమార్తెను చూడగా అప్పటికే మరణించిందని స్థానికులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా మృతురాలి తండ్రి జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేష్ తెలిపారు.