78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రంగశాయిపేట సబ్ స్టేషన్ వద్ద గల వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ స్థలం లో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురావేశారు. ఈ విధంగా నరేందర్ మాట్లాడతు దేశం, రాష్ట్రం ఉన్నతంగా ఏదగడంలో అందరం భాగస్వాములవుదామని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, లింగ వర్ణ బేధాలు లేకుండా కలిసి కట్టుగా ముందుకు సాగుతాం అని స్వరాష్ట్రంలో కెసిఆర్, కెటిఆర్ సమక్షంలో 10 సంవత్సరాలు చాలా ఘనంగా జరుపుకున్నాము,అదే విధంగా రాష్ట్ర, వరంగల్ తూర్పు ప్రజలందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని నరేందర్ పేర్కొన్నారు..
ఈ కార్యక్రమం లో డిప్యూటీ మేయర్ రిజ్వనా శమిమ్ మాసూద్, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మారుపల్ల రవి, టి. రమేష్ బాబు,కుందారపు రాజేందర్,మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇంచార్జ్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…