హామీలను అమలు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం
గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చింది
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
శనివారం రేగొండ మండల పరిధిలోని కానిపర్తి ,నాగూర్లపల్లి గ్రామాలకి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి మండల కేంద్రానికి రావడంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా పాలన అభయహస్తం ఆరుగారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ప్రభుత్వం లాగా మేము మోసం చేయడం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. నేను ప్రజాసేవకుడి లాగా వచ్చిన సేవకుడు లాగానే ప్రజలందరికీ పనులు చేస్తానన్నారు. అధికారం ఉంది కదా అని అందరిలాగా దుర్వినియోగం చేయనని అంకితభావంతో పని చేస్తానని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే నా లభ్యంగా పెట్టుకున్నానని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలను కూడా ప్రజల ముందు ఉంచుతానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపిటిసిలు గ్రామస్తులు పాల్గొన్నారు.