సర్వేల్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత
# అధ్యాపక బృందంకు, మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపాల్
యాదాద్రి నేటి ధాత్రి:
తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో దేశంలోనే మొదటి గురుకుల పాఠశాల అయినా యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేలు గురుకుల పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత తో పాటు రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించినందున విద్యార్థులందరికీ, అహర్నిశలు వారికి తోడుగా ఉండి సహకరించిన తోటి ఉపాధ్యాయ బృందం మరియు మా సొసైటీ ప్రణాళిక కు సహకరించి ఇట్టి ఉత్తమ ఫలితాలు సాధించుటకు కారణమైన తల్లిదండ్రులందరికీ అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియచేయుటకు సంతోషిస్తున్నాము.
-గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి
