ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం
స్పందించిన జిల్లా కలెక్టర్
ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద నరేష్ బోట్ల నరేష్….
హన్మకొండ, నేటిధాత్రి:
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యావరిస్తున్న స్కై పాఠశాలల మరియు గ్రావిటీ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా అధికారికి ఆదేశాలు జారీచేసిన పట్టించుకోని హన్మకొండ విద్యాశాఖ అధికారులు
హన్మకొండ జిల్లాలోని భీమారం లోని సెవెన్ హిల్స్ స్కూల్ పేరుపై రిజిస్ట్రేషన్ ఉంటే దానికి బదులుగా స్కై స్కూల్ పై పాఠశాల నడిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి యూనిఫామ్ టై షూ పాఠ్యపుస్తకాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సంబంధిత జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా వ్యావరిస్తున్న ప్రవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరమైన హన్మకొండ జిల్లా లోని ప్రశాంత్ నగరంలో గ్రావిటీ విద్యాసంస్థలు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టంసారంగా వ్యావరిస్తున్నారు
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఒక కాలేజీకి మాత్రమే అనుమతి ఉంటే గ్రావిటీ జూనియర్ కళాశాల ఐఐటి జే ఈ ఈ నీట్ ఎంసెట్ పేర్లతో బాల బాలికలకు వేర్వేరుగా ఐదు బ్రాంచ్లు ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటే సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు కావున తమరు తక్షణమే స్పందించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యావరిస్తున్న స్కై స్కూల్ యాజమాన్యం పై గ్రావిటీ జూనియర్ కళాశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.