భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
పాత పాల్వంచ నాయుడుపేటలోశనివారం నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. వినాయకుని విగ్రహాన్ని పాత పాల్వంచలోని పురవీధుల్లో ఊరేగించారు.
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న.. కొత్వాల.
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని కొత్వాల అన్నారు. పాల్వంచ బొల్లోరి గూడెం లోని రామాలయం ప్రాంగణంలోఏర్పాటుచేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల మండపంలో శనివారం జరిగిన అన్నదానం కార్యక్రమంలో కొత్వాలపాల్గొన్నారు.
కె.ఎస్.పి రోడ్ లో సబ్ స్టేషన్ వద్ద బి ఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షులు బేతంశెట్టి విజయ్ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి మండపంలో కొత్వాల సతీమణి విమలాదేవి దంపతులుపూజలు చేశారు.
జ్యోతి నగర్ కనకదుర్గమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొత్వాల దంపతులు పూజలు చేశారు.
పాత పాల్వంచ గడియకట్టలో ఎం.బి యూత్ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి మండపంలో కొత్వాల పాల్గొన్నారు.
పాత పాల్వంచ బస్టాండ్ లో వినాయక మండపంలో కొత్వాల దంపతులు పాల్గొన్నారు.
పాల్వంచ రాంనగర్ లో కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో కొత్వాల దంపతులుపూజలు చేశారు.