`చంద్రబాబు పన్నిన రాజకీయాం పక్కా..
`రేవంత్ కాంగ్రెస్ ను ముంచడమే లెక్క.
`రేవంత్ చేత, చంద్రబాబు ఆట!
`ఎన్నో సార్లు చెప్పిన నేటిధాత్రి.
` రేవంత్ భవిష్యత్తు రాజకీయం ఇదీ పక్కా లెక్కలేసి చెప్పడం జరిగింది.
`ఇప్పుడు అదే జరుగుతోంది.
` ఆటలో అరటి పండ్లు సీనియర్లు.
` కాంగ్రెస్‌ను ఖతం చేస్తేనే టిడిపికి ఊపిరి.
` చంద్రబాబు ప్రణాళిక…రేవంత్ చేత
` చంద్రబాబు వేలు విడిస్తే తప్ప రేవంత్ కు భవిష్యత్తు లేదు.
`చంద్రబాబు ఆశలకు పల్లకి మోస్తూ మొదటికే తెచ్చుకున్న రేవంత్.
`ఇప్పటికీ చంద్రబాబు కబంద హస్తాలే రేవంత్ చుట్టూ వున్నాయి.
` కాంగ్రెస్ ను ఖతం చేస్తున్నది అందుకే.
`మళ్ళీ టిడిపికి పూర్వ వైభవం కోసమే రేవంత్ ఆరాటం.
` ఎప్పుటికైనా కాంగ్రెస్ ను ఖతం చేయడమే రేవంత్ లక్ష్యం.
` చంద్రబాబు సంతోషమే ముఖ్యం.
` రేవంత్ రహస్య కొత్త పార్టీ ఏర్పాటు అందులో భాగం.
`మిగిలిన కాంగ్రెస్ ను టిడిపి లో కలపడమే అంతిమ ధ్యేయం.
`పరోక్షంగా టిడిపి, బిజేపి లకు సహకరించడమే అసలు రాజకీయం.
`సీనియర్లు ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేని అధిష్టానం.
`పాదయాత్ర పేరుతో కొత్త ఎత్తుగడలకు రేవంత్ శ్రీకారం.
` రెంటికీ చెడిన చంద్రబాబు కు ఊతం కోసమే రేవంత్ ప్రయత్నం.
` ఆంద్రప్రదేశ్ లో సైకిల్ మూలన పడిరది.
` తెలంగాణ లో గాడిలో పెట్డే పని రేవంత్ వంతైంది.
`పరోక్షంగా టిఆర్‌ఎస్ ను టార్గెట్ చేయడం కోసమే అందరూ ఏకమైంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
రేవంత్‌రెడ్డి కొత్తపార్టీ నమోదు చేయించాడట! ఇదీ ఇప్పుడు పొలికటిల్ సర్కిల్‌లో హాట్ టాపిక్. నిజంగా రేవంత్ రెడ్డి కొత్తపార్టీని కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించాడన్నది నిజమా? కాదా? అన్నది కాసేపు పక్కన పెడితే నిప్పులేనిదే పొగరాదు అంటారు. అయినా రేవంత్‌రెడ్డికి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు? అని ప్రశ్నించేవారందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి సీనియర్లతో వేగలేకపోతున్నాడని, ఆయనపై సానుభూతి చూపించేవారు కూడా తెలంగాణలో చాలా మందే వున్నారన్నది కొందరి వాదన. కాంగ్రెస్ ఇంకా ఎక్కువ వున్నారు అనేది కూడా ఓ ప్రచారం. నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి, మరింత పెరిగాడా? తన రాజకీయం తగ్గిందా? అన్నదానిపై అసలైన చర్చ జరడం లేదు. ఒక వేళ నిజంగానే రేవంత్‌రెడ్డి తన అనుచరులతో పార్టీ ఏర్పాటు చేయిస్తే అది తన కోసమేనా? అన్న అనుమానం కూడా కలగకమానదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదిచేసినా చంద్రబాబు కోసమే చేస్తాడు. ఇది సగటు వ్యక్తికి తెలిసిన నిజం. ఆయన ప్రతిసారి చూపించే స్వామిభక్తికి నిదర్శనం. అందుకే రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగు చంద్రబాబు కోసమే అన్న సంకేతాలే వెళ్తాయే తప్ప రేవంత్‌రెడ్డి కోసం కాదన్నది సుస్పష్టం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఇదే రకమైన చర్చ సాగింది. అసలు రేవంత్ తెలుగుదేశం పార్టీని వీడడంలోనే ఒక రహస్యం దాగి వుందన్నది నేటిధాత్రి ఆనాటి నుంచే చెబుతూనే వుంది. సహజంగా ఏ వ్యక్తి అయినా ఒక పార్టీని వీడినప్పుడు, ఆ పార్టీ వల్ల ఎంత ఎదిగినా చివరి క్షణంలో ఆ పార్టీని ఏదో రకంగా బ్లేమ్ చేయడం సహజం. కాని ఇక్కడ అది జరగలేదు. రేవంత్ ఏనాడు తెలుగుదేశం పార్టీని పల్లెత్తు మాట అనలేదు. చంద్రబాబు ఇంకా నాకు నాయకుడే అంటున్నాడు. కాని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్‌కు శత్రువే అన్న మాట ఎక్కడా మాట్లాడలేదు. ఇదో రకమైన లోపాయి కారి ఒప్పందం. చంద్రబాబు కోసమే రేవంత్ చేస్తున్న రాజకీయం.
తెలంగాణ వచ్చాక చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా తెలంగాణ మీద పెత్తనం పోవడం ఇష్టం లేదు.
అంందుకే ఎన్నటికైనా మళ్లీ తెలంగాణ మీద పెత్తనం సాధించాలన్న కుయుక్తులతోనే అడుగులు వేశాడు. హైదరాబాద్‌లోనే కొత్త ఇల్లు కట్టుకున్నాడు. కాని చంద్రబాబు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు కట్టుకోలేదు. ముఖ్యమంత్రిగా వున్నంత కాలం కిరాయి ఇంట్లోనే వున్నాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశాడు. ఆనక ఇరుక్కుపోయాడు. రేవంత్‌ను ఇరికించాడు. జైలు పాలయ్యేలా చేశాడు. చంద్రబాబు వల్ల నష్టపోయాయనన్న ఆలోచన ఇప్పటికీ రేవంత్‌కు లేదు. తనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల జైలు పాలయ్యానన్న ఆలోచనే రేవంత్‌లో వుంది. రేవంత్ జైలు పాలు కావడానికి కారణం చంద్రబాబు అయినా రేవంత్ కు ఆయన మీద స్వామి భక్తి తగ్గలేదు. ఎన్నటికైనా ఆయన రుణం తీర్చుకునే పనిలోనే వున్నాడు. తప్పని పరిస్ధితుల్లో ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోకతప్పని చంద్రబాబు, ఆగమేఘాల మీద రాజధాని ప్రకటించాడు. తెలంగాణ వడిచివెళ్లాడు. కాని రేవంత్‌ను రాజకీయంగా బలోపేతం చేయాలనుకున్నాడు. ఎన్నటికైనా తాను తెలంగాణ మీద ఆధిపత్యం కోసం కాచుకొనే చంద్రబాబు ఎదురుచూస్తూనే వున్నాడు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు కావడం అంటే మాటలు కాదు. ఒక దశలో రేవంత్ చేసిన ఓటుకు నోటు కేసు విషయంలో నాయకులెవ్వరూ సమర్ధించలేదు. కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రాకను సీనియర్లు ససేమిరా అన్నారు. అయినా అధిష్టానాన్ని ఒప్పించి, మెప్పించి, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టిన చంద్రబాబు రేవంత్‌కు పదవి కల్పించడంలో కృతకృతుడయ్యాడు. ఆఖరకు రేవంత్‌ను పిసిసి అధ్యక్షుడిని చేయించాడు. ఇప్పుడు బిజేపి వైపు చంద్రబాబు చూస్తున్నాడు. రేవంత్‌తో కాంగ్రెస్ ఖాళీ చేయించే పనిలో వున్నాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన నేటిధాత్రి అడుగడుగునా హెచ్చరిస్తూనే వస్తోంది.
ఎలాగైనా ఈసారి తెలంగాణలో పాగా వేయాలన్నది చంద్రబాబు బలమైన ఆలోచన.
టిఆర్‌ఎస్ కాస్త, బిఆర్‌ఎస్ కాగానే సైకిల్‌కు మళ్లీ కొత్త రంగు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగూ సైకిల్ మూలన పడిరది. అక్కడ బిజేపితో కలిసి దోస్తీ కట్టే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకితో బిజపికి అక్కడ జత కట్టాలన్న ఆలోచన లేదు. జగన్‌కు వదులుకోవాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. జగన్‌కు ఇంబంది పెట్టాలన్న ఆలోచన ఏ కోశాన బిజేపికి లేదు. ప్రధాని మోడీకి లేదు. కాకపోతే తెలంగాణలో బిజేపి బలపడాలంటే టిడిపితో కొంత సఖ్యత కావాలి. ఆ పార్టీకి క్షేత్రస్ధాయిలో వున్న బలం బిజేపికి ఉపయోగపడాలి. అందుకు చంద్రబాబుతో దోస్తీ కట్టాలి. ఎలాగూ జనసేన కూడా కలిసి వచ్చేందుకు సిద్దంగానే వుంది. మొత్తంగా మూడు పార్టీలు కలిస్తే ఎంతో కొంత బిఆర్‌ఎస్‌ను ఎదిరించేందుకు, కొన్ని సీట్లు సాధించేందుకు అవకాశం వుంటుంది. కాని అది సంపూర్ణం కాదు. బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటే ఈ బలం సరిపోదు. మరింత బలం కావాలి. అందుకు రేవంత్ సహాకారం కావాలి. కాంగ్రెస్ అధిష్టానంతో ఎలాగైనా రేవంత్ వర్గానికి పెద్ద పీట వేయించాలి. ఎన్నికలు దగ్గరున్నందును తనకు ఎదురులేని విధంగా చూడాలి. ఈ విషయంలోనూ రేవంత్ సక్సెస్ అయ్యాడు. తన వర్గాన్ని పిసిసిలో నింపేశాడు. ఎలాగైనా సీనియర్లకు ఇది నచ్చదు. కుంపటి పెడతారు. సీనియర్లు ఆగరు. వారి నోటికి పనిచెబుతారు. అప్పుడు మళ్లీ రేవంత్ తన రాజకీయాన్ని వాడొచ్చనుకున్నాడు. అనుకున్నట్లుగానే జరిగింది. పిసిసి కొత్త కార్యవర్గంపై సీనియర్లు మాటల తూటలు పేల్చారు. కాంగ్రెస్‌లో చేరిన ఇతర నాయకులు చిన్న బుచ్చుకున్నారు. రాజీనామాలు చేశారు. దాంతో సినియర్లకు గొంతులో వెలక్కాయపడ్డట్టైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్లు చెప్పే మాటలు వినడానికి సిద్దంగా లేదు. ఇదే రేవంత్‌కు కలిసి వస్తోంది. ఎందుకైనా మంచిది. ఎన్నికల నాటికైనా రేవంత్ ఆడే డబుల్ గేమ్ బైట పడితే, పక్కకు తప్పుకోవాల్సివస్తే, ఒక వేళ కాంగ్రెస్సే రేవంత్‌ను తప్పిస్తే దారి వెతుక్కొవాల్సిన అసవరం లేకుండా తన పార్టీ తోడుగా నిలుస్తుంది. రేవంత్‌తో వచ్చిన వాళ్లంతా ఆ పార్టీకి బలమౌతుంది. ఇదీ అసలు పాయింట్.
కాంగ్రెస్‌పార్టీలో రేవంత్ ఏ అడుగు వేసిన సీనియర్ల ఎడ్డమంటే తెడ్డమంటారు.
ఇది తెలిసే రేవంత్ తన జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్నాడు. తాను పాదయాత్ర మొదలుపెడుతున్నాని ఓ వైపు చెప్పుకుంటూనే, మరో వైపు పార్టీ ఏర్పాటుపై కూడా దృష్టిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ముందే దారి సిద్దం చేసుకుంటే ఎన్నికల నాటికి ఎలాంటి ఇబ్బంది వుండదు. అదే జరిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొని, నాయకులను తన చెంతకు తీసుకొని, గుండు గుత్తగా తెలుగుదేశంలో చేర్చితే చాలు. తన అనుకున్న పథకం పూర్తవుతుంది. చంద్రబాబుకు కళ్లలో ఆనందం చూసినట్లౌవుతుంది. టిడిపిలో కూడా రేవంత్ మాటే చెల్లుబాటౌతుంది. తెలంగాణలో టిడిపికి మళ్లీ పూర్వవైభవం వస్తుంది. ఇదీ చంద్రబాబు ఆలోచన. రేవంత్ ఆచరణ. కాని క్షేత్ర స్ధాయి పరిస్ధితులు ఎలా వున్నా, తమకు అనుకూలంగానే వున్నాయన్న భ్రమల్లో రేవంత్, చంద్రబాబు వున్నారన్నది సుస్పష్టమైన అంశం. ఎందుకంటే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ ఏ ఒక్క ఎన్నికల్లోనూ తన చాణక్యం చూపించుకోలేదు. కాంగ్రెస్‌ను గట్టెక్కించేపని చేయలేదు. టిడిపిలో వున్నప్పుడు పనిచేసినంత అంకితభావంతో పనిచేయలేదు. ఒక్క ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించలేదు. అలాంటి రేవంత్‌రెడ్డిని నమ్మి నాయకులు ఆయనతో వెళ్తారా? లేదా? అన్నది రేవంత్ అత్యాశను చూపిస్తుందే గాని, వాస్తవం కనిపించడం లేదు.