`ఈటెల, రాజగోపాల్ డిల్లీలో చర్చలు జరుపుకుంటున్నారు?
`బిజేపి కి దూరమయ్యేందుకు సాకులు వెతుకుతున్నారు?
`పార్టీని బలోపేతం చేయలేమని గ్రహించారు?
`కుర్చీ వేసి కూర్చోబెడతారనుకున్నారు?
`కనీసం పట్టించుకోవడం లేదు?
`బిజేపి లో ఇంకా వుంటే ఎటూ కాకుండా పోతామని గ్రహించారు?
`నిన్నటి దాకా రాష్ట్ర బిజేపి మీద నిందలేశారు?
`ఇప్పుడు కేంద్ర పార్టీకి గట్టిగా చెప్పామని చెప్పుకుంటున్నారు?
`కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పామన్నారు?
`అవేంటో చెప్పమంటే ముఖం చాటేశారు?
`తెలంగాణ లో ఆత్మగౌరవంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు?
`కనీసం పార్టీ ఆఫీసులోకి వెళ్లలేక గేటు ముందు పడిగాపులు కాశారు?
`విధిలేక మాడిపోయిన ముఖాలతో వెనుదిరిగారు?
`ప్రగతి భవన్ ముందు నాడు పరువుపోయిందన్నారు. నేడు డిల్లీలో పరువు తీసుకున్నారు?
`పార్టీ మారే చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు?
హైదరబాద్,నేటిధాత్రి:
వుండాలని లేదు. నచ్చజెప్పినా వినాలని లేదు. బలవంతం చేసినా ఆగాలని లేదు. బిజేపి లో ఇంకా కొనసాగితే భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకం లేదు. బిజేపి తెలంగాణలో అధికారం రాదు? ఆ పార్టీనే ఇంకా నమ్ముకుంటే లాభం లేదు? వాళ్లకు మంచి రోజులొస్తాయన్న విశ్వాసం అసలే లేదు ? బిజేపి బలపడుతుందనే ఆశలు లేవు. కళ్ల ముందు కనిపించడం లేదు. పార్టీ ఊపు మీదుందన్న ప్రచారం లేదు. దానికి తోడు వాళ్లకు పెద్ద ప్రాధాన్యత లేదు. ఒక రకంగా పార్టీలో పెద్దగా పట్టించుకునే వారు లేదు. పైకి కనిపించేదంతా నిజం కాదు. బిజేపి లో నిష్టూరాలు ఇంకా భరించడం వారి వల్ల కాదు. ఇంటా, బైట విలువ లేదు. ఎన్నికలొస్తే తప్ప వారికి పని లేదు. ప్రజల్లోకి నేరుగా వెళ్ల స్వేచ్చ లేదు. గతంలో లాగా అభిప్రాయాలు చెప్పుకునే వీలు లేదు. చర్చలకు ఆస్కారం లేదు. కలిసి సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంత కాలమైనా వలస వాదులన్న ముద్ర చెరిగిపోలేదు. పార్టీ కోసం ఎంత పని చేసినా గుర్తింపు లేదు. గౌరవం అంతకన్నా లేదు. వారి ప్రయత్నం వారు చేస్తున్నారనే వాళ్లు లేరు. మొదట్లో వున్నంత హడావుడి ఇప్పుడు లేదు. అక్కున చేర్చుకున్నంత గొప్పగా మాట్లాడుతున్న వారు లేరు. ప్రతి దానిని భూతద్దంలో చూస్తున్నారు. ప్రతి అడుగును శంకిస్తున్నారు. ఎవరు కలిసినా పెడర్థాలు తీస్తున్నారు. ఎవరితో మాట్లాడినా గుసగుసలు రాజేస్తున్నారు. ఊహాగానాలు సృష్టిస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే కొందరు కుంపటి పెడుతున్నారు. పొగ మా వైపునుంచి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. అయినా వెళ్లడం లేదని అంటున్నారు. వెళ్లే వారిని ఆపాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మమ్మల్ని తరిమేయాలనే చూస్తున్నారు. అయినా పట్టుకొని వేళాడుతున్నా అడుగడుగునా ఎలా అవమానానికి గురి చేయాలో అంతా చేస్తున్నారు. ఇది ఈటెల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిల మనసులో వున్న ఆవేదన, ఆందోళన, ఆక్రోశం అంటూ వస్తున్న వార్తల సారాంశం. ఇవి నిజమా? కాదా? అన్న దానిపై చర్చతో పాటు వీళ్లిద్దరూ ఏం చేస్తారన్న దానిపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
చాలా మంది అంటున్న మాట. అనుకుంటున్న మాట. ఈటెల, కోమటి రెడ్డి ఇద్దరూ పోలేక పొగబెట్టుకుంటున్నారు?
అందుకే డిల్లీ లో మంత్రాంగం నడుపుతున్నారు. డిల్లీ వేదికగా ఈటెల, రాజగోపాల్ డిల్లీలో చర్చలు జరుపుకుంటున్నారు? ఎటు వెళ్తే బాగుంటుందన్న దానిపై మధనపడుతున్నారు. మల్లగుల్లాలు పడుతున్నారు. హైదరాబాదు లో వున్నా బాగుండేది. డల్లీ వచ్చి పరువుపోగొట్టుకున్నట్లైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలవాలని వస్తే ఆయన హైదరాబాదు వెళ్లారు. ఆ విషయం బిజేపి కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్తే గాని తెలియలేదు. అంత పెద్ద పార్టీలో ఇంత చిన్న విషయం ఇద్దరు నేతలకే తెలియలేదు. ఇదిలా వుంటే వాళ్ళిద్దరూ కావాలనే డిల్లీ వెళ్లారు. కావాలనే తమకు సానుభూతి కోరుకుంటున్నారు. జాతీయ అధ్యక్షుడు హైదరాబాదు వస్తున్న సంగతి తెలిసి కూడా కావాలనే డిల్లీ వెళ్లారు. ఇది పార్టీలో చెప్పుకుంటున్న మాట. ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్దం అన్నది వాళ్లకే వదిలేద్దాం!!
బిజేపి కి దూరమయ్యేందుకు సాకులు వెతుకుతున్నారు? పార్టీని బలోపేతం చేయలేమని, అది కష్టమని ఇద్దరు నేతలు గ్రహించారు?
బిజేపి లో తమకు కుర్చీ వేసి కూర్చోబెడతారనుకున్నారు? కానీ రోజులు గడుస్తున్నా అది కనిపించడం లేదు. కనీసం తమ స్థాయిని కూడా పట్టించుకోవడం లేదు? బిజేపి లో ఇంకా వుంటే ఎటూ కాకుండా పోతామని గ్రహించారు? నిన్నటి దాకా రాష్ట్ర బిజేపి మీద నిందలేశారు? ఇప్పుడు కేంద్ర పార్టీకి గట్టిగా చెప్పామని చెప్పుకుంటున్నారు? అసలు జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాదు లో నేరుగా ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇద్దరే డిల్లీ వెళ్లి చెప్పేంత సీక్రెట్ ఏముంటుంది? ఇక్కడ చెప్పలేనంత రహస్య విషయం ఏం దాగుంది? అధిష్టానానికి గట్టిగా చెప్పే అవకాశం రాష్ట్ర నాయకులకు వుంటుందా? వాళ్ల ముందు నోరు పెద్దది చేసుకునే అవకాశం ఇస్తారా? కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పామన్నారు? అవి ఏమిటో చెప్పలేకపోతే ప్రజలకెలా తెలుస్తుంది? అవేంటో చెప్పమంటే ముఖం చాటేశారు? తెలంగాణ లో ఆత్మగౌరవంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? కనీసం పార్టీ ఆఫీసులోకి వెళ్లలేక గేటు ముందు పడిగాపులు కాశారు? గేటు ముందు పడిగాపులు కాసే వారి మాటలు ఎక్కడైనా విన్నట్లు చరిత్ర వుందా?
విధిలేక మాడిపోయిన ముఖాలతో వెనుదిరిగారు? ఇంతకన్నా పరువు తక్కువ ఏమైనా వుంటుందా?
ప్రగతి భవన్ ముందు నాడు పరువుపోయిందన్నారు. నేడు డిల్లీలో పరువు తీసుకున్నారు? ఇది స్వయం కృతాపరాధం కాదా? పార్టీ మారే చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు? అనే దానికి సంకేతం కాదా? డిల్లీ పెద్దలను కలిశాం…అన్నీ చెప్పాం…అనుకున్నాక ఇంకా అక్కడే ఎందుకు మకాం వేశారు? లోకో భిన్న రుచి…ఇప్పుడు ఈ ఇద్దరిదీ ఎటు దారి!!