పల్లపుకే కమలం టికెట్‌!

https://epaper.netidhatri.com/

`ఖైరతాబాద్‌ బిజేపిలో బలమైన యువ బిసి నేత.

`పేదల నాయకుడు పల్లపు గోవర్ధన్‌.

https://epaper.netidhatri.com/

`ఖైరతాబాద్‌ లో మరో పిజేఆర్‌ లా ప్రజల్లో పేరు.

`బిజేపిలో గోవర్ధన్‌ కు అంత గుర్తింపు.

`ఎమ్మెల్యే దానంతో ఢీ.అంటే ఢీ… అనే నాయకుడు.

`ఈసారి ఎన్నికలలో సై అంటున్నాడు.

`దానంను అడుగడుగునా ఎదుర్కొన్న నాయకుడు.

` డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం.

`చిలిపి చింతలకు టికెట్‌ కట్‌?

`చింతలకు ఎన్నికల బాధ్యతలు!

https://epaper.netidhatri.com/

` ఖైరతాబాద్‌ లో పేదలకు అండగా వుంటున్న గోవర్ధన్‌.

` బిజేపి బిసిలకు పెద్ద పీట వేయడానికి రెడీ.

` అందులో భాగంగా పల్లపు వైపు పార్టీ మొగ్గు.

`ఆర్‌ ఎస్‌ఎస్‌ బ్యాక్‌ గ్రౌండ్‌!

`హిందూ ధార్మిక కార్యక్రమాలు.

`ఇరవై ఏళ్లుగా పార్టీకి సేవలు.

`జూబ్లీ హిల్స్‌ అభయాంజనేయ స్వామి ఆలయంతో విపరీతమైన పాపులారిటీ.

`గుడి కూల్చడాన్ని తీవ్రంగా వ్యతికించిన నేత.

`గుడి కోసం అనేక ఉద్యమాలు.

`బిజేపి తరుపున కొట్లాడుతున్న నేత.

`అర్థికంగా కూడా బలమైన అభ్యర్థే!

`పేద వర్గాలలో మంచి పేరు!

హైదరబాద్‌,నేటిధాత్రి:     

https://epaper.netidhatri.com/                     

వచ్చే ఎన్నికల్లో బిజేపి పార్టీ ఖైరతాబాద్‌ నియోజకవర్గ టికెట్‌ యువ నాయకుడు, బలమైన బిసి సామజిక వర్గ నేత పల్లపు గోవర్ధన్‌కు ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయమైన సమచారం. పార్టీకోసం గత ఇరవై సంవత్పరాలుగా అవిరళ కృషి చేస్తూ ఎటు వంటి పదవులు ఆశించకుండా పనిచేస్తున్న నేత పల్లపు గోవర్ధన్‌. ప్రజాసేవలో పల్లపు గోవర్ధన్‌కు స్పష్టత వుంది. స్పష్టమైన విధానం వుంది. పేదలకు అండగా నిలవాలన్న ఆశయం వుంది. వారి అభివృద్ధికోసం పాటుపడాలన్న తపన వుంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న పట్టుదల వుంది. అందుకే ఆయన గత పదేళ్ల కాలంలో పేదల కోసం అనేక పోరాటాలు చేశారు. పేదలు ఆర్ధికంగా బలపడాలన్నది ఆయన బలమైన ఆకాంక్ష. అప్పుడే సమాజంలో హెచ్చుతగ్గులు తగ్గి, సమాజ వికాసం జరుగుతుందని బలంగా నమ్ముతారు. అందుకే పేదల్లో చైతన్యం నింపే స్పూర్తిగా ఆయన ఆదర్శమౌతున్నారు. పల్లపు గోవర్ధన్‌కు కష్టపడడం తెలుసు. తాను కష్టపడి సంపాదించిన దానిలో పేదలకు ఎలా సాయ పడాలో తెలుసు. ఎలా సేవ చేయాలో తెలిసిన నేత. అందుకే ఆయనంటే ఖైతరాబాద్‌ నియోజకవర్గంలో అందిరకీ ఇష్టం. ఆయన నాయకత్వాన్ని బిజేపి శ్రేణులే కాదు, పేదలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు బిజేపిలో వున్న బలమైన నాయకుల్లో ఒకరు. పేదల నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. పేదల కోసం అనేక ఉద్యమాలు చేపట్టారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని పేదలకు రెండు పడకల ఇండ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో మరో పీజేఆర్‌ అన్నంత పేరు ఆయన సంపాదించున్నారంటే అతిశయోక్తి కాదు. నియోజకవర్గ పరిధిలో పేదలకు ఏ సమస్య వచ్చినా ముందు గోవర్ధన్‌ ఇంటికి చేరుకుంటారు. తమ సమస్యను విన్నవించుకుంటారు. అంతగా ప్రజలతో మమేకమైన నాయకుడు పల్లపు గోవర్ధన్‌. కరోనా సమయంలో ఆయన ప్రజలకు తోడుగా, అండగా వుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో ఢీ అంటే ఢీ అనేంత దమ్మున్న నాయకుడు గోవర్ధన్‌. అంతగా ఎమ్మెల్యేతో పోరాటం చేసి, పేదల సమస్యలు తీర్చిన నేతగా గుర్తింపు పొందారు. ఈసారి ఖైరతాబాద్‌ నుంచి ఆయనకు టికెట్‌ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అభ్యర్ధిని బలంగా డీ కొనాలంటే బిజేపి నుంచి పల్లపు గోవర్ధన్‌ లాంటి నాయకుడు వుండడడమే మేలని పార్టీ శ్రేణులు కూడా కోరుతున్నారు. 

గత మాజీ ఎమ్మెల్యే పార్టీ సీనియర్‌ నేత చింతల రామచంద్రారెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. 

అయితే వయసు రిత్యా ఆయనకు టికెట్‌ దక్కే అవకాశం లేదు. పైగా ఆయన గతంలో చేసిన చిలిపి చేష్టలు బాగా ప్రచారం జరిగాయి. ఒక వేళ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇస్తే ప్రచార సమయంలో పార్టీకి పెద్ద డ్యామేజ్‌ అయ్యే అవకాశం వుంది. ఆ ప్రభావం వ్యక్తిగతంగా ఆయన ఎన్నిక మీదనే కాకుండా, పార్టీ మీద కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం వుంది. అందుకే బిజేపి పెద్దలు ముందుగానే గ్రహించి, చింతలను పక్కన పెట్టి, ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారు. యువ బిసి నేత అయిన పల్లపు గోవర్ధన్‌ గత ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇరవై ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నారు. గత పదేళ్లుగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ప్రజల్లో ఆయనకు మరింత ఆదరణ, నమ్మకం కల్గించిన ఘటన జూబ్లిహిల్స్‌లో జరిగింది. జూబ్లిహిల్స్‌లోని ఓ కొండపై అభయాంజనేయ స్వామి ఆలయం వుండేది. గత మూడు నాలుగు దశాబ్దాలుగా అక్కడ ఆంజనేయ స్వామి పూజలుందకుంటున్నారు. నిత్యం దీప, దూప నైవేద్యాలు అందుకుంటున్నారు. భక్తులకు కొంగుబంగారమై దీవిస్తున్నాడు. ఎంతో మంది భక్తులు నిత్యం ఆ గుడికి వెళ్తుంటారు. ఆ కొండను ప్రభుత్వం రియలెస్టేట్‌ వ్యాపారాలకు విక్రమించింది. దాంతో అక్కడ రియల్‌ వ్యాపారం మొదలైంది. కాని ఆ కొండ ఎంతో చారిత్రకమైంది. ప్రకృతి సంపదకు ఆలావాలమైంది. ఆ కొండపై గుడి నిర్మాణం జరిగింది. అక్కడ జాతీయ పక్షి నెమళ్లు వుండేది. ఆ ప్రకృతిని సంపదన విద్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా అడ్డుకున్నారు. గుడి కూల్చేడంపై పెద్ద ఉద్యమం చేపట్టారు. తిరిగి గుడి నిర్మాణం చేస్తామని సంబంధిత రియల్‌ వ్యాపారులు రాతపూర్వక హామీ ఇచ్చే వరకు పోరాటం సాగించారు. దాంతో ఆయన ప్రజల కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తారని ప్రజల్లో ఒక నమ్మకం బలంగా కలిగింది. అందుకే ఆయన నాయకత్వం కావాలని బిజేపి శ్రేణులు, ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. 

హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయనకు ఆయనే సాటి.

 ఆయన ఆధ్వర్యంలో గతంలో జరిగిన శ్రీరాముడి శోభా యాత్రను నభూతో నభిష్యత్‌ అన్న చందంగా నిర్వహించారు. చిన్ననాటి నుంచి ఆరెస్సెస్‌ భావాలకు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి బిజేపిలో కొనసాగుతున్నారు. ఆరెస్సెస్‌ మూలాలు కూడా పల్లపు గోవర్ధన్‌కు వుండడంతో ఖైరతాబాద్‌ టికెట్‌ ఆయనకే దక్కేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌ తర్వాత అంత గొప్పగా పల్లపు గోవర్ధన్‌ గురించి హిందుత్వ వాదులు చెప్పుకుంటారు. ఇలా అటుపార్టీలోనూ, ఇటు ప్రజల్లో మంచిపేరు సంపాదంచుకున్నారు. నగర బిజేపిలో చెప్పుకోదగ్గ నాయకుడిగా కూడా పనిచేస్తున్నారు. బిజేపికి క్యాడర్‌ పెంచడంలో కూడా ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా యువత బిజేపి వైపు ఆకర్షితులు కావడంలో పల్లపు గోవర్ధన్‌ నాయకత్వం కూడా ఒక కారణమని చెప్పొచ్చు.

 ఖైరతాబాద్‌ పేరు చెప్పగానే ఎవరు కాదనా, ఎవరు ఔనన్నా పిజేఆర్‌ పేరు వినిపిస్తుంది.

 ఇప్పుడు అదే నియోజకవర్గంలో మరో పిజేఆర్‌గా బిజేపి నాయకుడు పల్లపు గోవర్ధన్‌ను ప్రజలు గుర్తిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వానికి టాక్స్‌లు ఎగ్గొట్టి, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఐమాక్స్‌, స్నో వరల్డ్‌ లాంటి వినోద సంస్ధలు, దస్‌పల్లా లాంటి హోటళ్లను ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చేశారు. అటు ప్రజలకోసం పోరాటం చేయడమే కాకుండా, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నవారిపై కూడా పోరాటం చేసిన చరిత్ర పల్లపు గోవర్ధన్‌ది. ఇలా ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో వుంటూ, ప్రజలకు అండగా వుంటున్న పల్లపు గోవర్ధన్‌కు బిజేపి టికెట్‌ ఖరారుకానున్నదని తెలిసి ఆయన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ నాయకుడు మరింత ఎదిగితే మాకు మరింత సేవ చేస్తాడని నమ్ముతున్నారు. ఏది ఏమైనా ప్రజల్లో వుండే నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడైన పల్లపు గోవర్ధన్‌ కు టికెట్‌ దక్కుతుండడం విశేషం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version