పరకాల మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ వెంకట నారాయణ

పరకాల నేటిధాత్రి

పరకాల మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ వెంకట నారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటనారాయణ పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.నూతనంగా మండల స్పెషల్ అధికారిగా వచ్చిన డాక్టర్ వెంకటనారాయణ ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు మరియు సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నీటి సమస్య లేకుండా గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు చూడాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని అదే విధంగా మండల వైద్య అధికారి గ్రామాలలో ప్రజలకు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందజేయాలని అన్నారు. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాలలలో మంజూరు చేయబడిన పనులు జూన్ 10లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు, మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్, మండల వైద్యాధికారి డాక్టర్ స్వాతి, మండల విద్యాశాఖ అధికారి యస్.రమాదేవి ఏ.ఈ రాజు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version