` మునుగోడు బిఆర్ఎస్ నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో తనకు కేటిఆర్ తో వున్న అనుబంధాన్ని పంచుకుంటూ..
` రేపటి తరం ప్రతినిధి
` ఉద్యమ కాలానికి ఊపిరి.
` తెలంగాణ అభివృద్ధిలో ఆర్తి.
` భవిష్యత్తు రాజకీయాలకు స్పూర్తి.
`అలుపెరుగని ప్రజా సేవకు నాంది.
`నేటి నాయకులలో మేటి.
`పరిపాలనలో ఆయనకు ఆయనే సాటి.
`వేగానికి ఆయనే పోటీ
`నిత్యం ప్రజల్లోనే…
`ప్రతి నిమిషం ప్రజా సేవలోనే…
` ప్రతి పనిలో డైనమిజమే…
`తెలంగాణ బ్రాండ్ కేటిఆరే.
`మూడక్షరాల పదం యువత నాలుకల మీద జపమే.
హైదరబాద్,నేటిధాత్రి:
కొన్ని ఉద్విగ్నమైన క్షణాలు కోపమైతే నష్టం. కాని అవే ఆలోచనలైతే…అపురూం. అనితర సాధ్యం…అనిర్వచనీయం…అపురూపం, అధ్భుతం…ఒక ఆవిష్కారం…మార్పుకు సంకేతం…ప్రగతినకి ఆలవాలం…ఇదంతా ఒక వరుసలో జరిగే అభివృద్దికి నిదర్శనం…రేపటి తరానికి అందే అతిపెద్ద బహుమానం…ఎందుకంటే రెండు దశాబ్ధాల క్రితం తెలంగాణ ఒక ఉద్విగ్నమైన క్షణం. ఆ క్షణం నుంచి ఉద్భవించిందే తెలంగాణ ఉద్యమం. అది ఆవేశాన్ని మాత్రమే మోసుకురాలేదు. ఒక దృఢమైన చిత్తం నుంచి అంకురార్పరణ జరిగింది. ఆ చిత్తం ఒక పరిపూర్ణమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పోరాటానికి వేదికను చేసింది. ఆ పోరాటం ముఖ్యమంత్రి కేసిఆర్ రూపంలో అడుగులు వేసింది. తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కేసిఆర్. ఆయన అడుగు జాడలే మంత్రి కేటిఆర్.
కేటిఆర్ అడుగు మాకు భరోసా…కేటిఆర్ మాట మాకు దీవెన..ఆయన చూపు చల్లని వెన్నెల…మా నాయకుడు కేటిఆర్ ఎక్కడుంటే అక్కడ మాకది కోవెల. అని మునుగోడు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్ అంటున్నారు. ప్రజల కోసం మంత్రి కేటిఆర్ వేసే అడుగులు తెలంగాణ సంక్షేమానికి బాటలు… ఆయన చెప్పే విలువైన మాటలు రేపటి తరానికి లక్ష్యాలు..యువత భవితకు వెలుగులు అంటున్నారు రవి ముదిరాజ్. ఎందుకంటే ప్రజల సాధక, బాధకాలపై నిరంతరం ఆలోచించే నాయకుల్లో మా నాయకుడు కేటిఆర్ ఎంతో ఉన్నతమైన ఆలోచనలున్నవారు. ఎల్లవేళలా అయన ప్రజలతో వుంటూ, ప్రజల్లో మమేకమౌతూ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వుంటారు. అంతే కాదు ప్రపంచ దేశాలు తిరిగిన అనుభవంతో అక్కడ జరిగిన అభివృద్దిని ఇక్కడ మనకు నిజం చేస్తున్న నాయకుడు కేటిఆర్. మంచి మనసున్న నాయకులకే ప్రజాభివృద్ధిపై మమకారం వుంటుంది. తన నిరంతర శ్రమతో ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. ముఖ్యంగా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐటి సెక్టార్లో ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా చెప్పే ఏకైక పేరు కేటిఆర్. మరో పేరు కూడా ఎక్కడా వినిపించదు. ఒకప్పుడు ఐటి అంటే అందరూ బెంగుళూరు అనేవారు. కాని ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎవరిని అడిగినా టక్కున హైదరాబాద్ అని చెబుతున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి ఐటి దిగ్గజాలన్నీ హైదరాబాద్‌లో వారి ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం అన్నది కేవలం మంత్రి కేటిఆర్ చొరవ వల్లనే సాద్యమయ్యాయని గర్వంగా చెప్పుకోవాలి. రాష్ట్ర రాజకీయాలే కాదు, పాలనా పరమైన సేవలందిస్తూ, ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం నిరంతరం తపన పడుతున్న నాయకుడు కేటిఆర్. గొప్ప ప్రగతిలో తెలంగాణను ముందు వరసలో నిలబెడుతున్న నాయకుడు కూడా కేటిఆర్ కావడం విశేషం. రేపటి తరం కోసం కేటిఆర్ పడుతున్న శ్రమ మాటల్లో చెప్పలేనిది. ఇంతటి విశిష్ట సేవలు గతంలో ఏ నాయకుడు అందించలేదంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే మంత్రి కేటిఆర్ వంటి డైనమిక్ లీడర్ లేడు. తెలంగాణ విషయంలో ఏ సమస్యనైనా ఎంతో అవలీలగా పరిష్కరించడంతో ఆయనకు ఆయనే సాటి అంటారు. రాష్ట్రాభివృద్ధిలో ఎంతో కీలకభూమిక పోషిస్తున్న మంత్రి కేటిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని, మునుగోడు బిఆర్ఎస్ నాయకుడు నారబోయిన రవి, ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
నేను నా జీవితంలో కలుసుకున్న అతి గొప్ప సుగుణాలున్న వ్యక్తులలో మంత్రి కేటిఆర్ ఒకరు.
ఆయన ఆలోచన ఆకాశమంత..ఆయన ఆచరణ పర్చుకున్న మన భూమి అంత. ఆయనను దగ్గరుండి చూసిన వారికి మాత్రమే అర్ధమయ్యే నిజం. ఆయన విసృతమైన ఆలోచనలు మన తెలంగాణ ప్రగతికి వేస్తున్న అడుగులు. నా రాజకీయ ప్రస్తానం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు నాలో ఎంతో స్పూర్తిని నింపిని నాయకుల్లో మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసిఆర్ అయితే, రెండో వ్యక్తి మంత్రి కేటిఆర్. వారి ఇరువురి ఆలోచనలు దాదాపు ఒకే రకంగా వుండడం విశేషం. ఎందుకంటే ఏ నాయకుడైనా ప్రతి విషయాన్ని ఇతరులతో ప్రతి సందర్భం పంచుకోలేరు. వారిని చూసి నేర్చుకోవాలి. ఇక్కడ సరిగ్గా అదే జరుగుతోంది. ముఖ్యమంత్రికేసిఆర్ మదిలో మెదలే ఆలోచనలన్నీ, ఆచరణగా కేటిఆర్ పాటించడంలోనే విజయం దాగి వుంది. అందుకే నేను బలమైన నేతగా ఎదగాలన్న సంకల్పం తీసుకున్న నాటినుంచి మంత్రి కేటిఆర్‌ను అనుసరిస్తున్నాను. ఆయనను నిశితంగా గమనిస్తున్నాను. మానవత్వం నిండిన ఆయన ఔదార్యాన్ని అడుగడుగునా అందిపుచ్చుకుంటున్నాను. కరోనా సమయంలో రాత్రి పన్నెండు గంటలకు ఓ బిడ్డ ఆకలితో అలమటిస్తుందని తెలిసి, పాలు లేక ఓ తల్లి రోధిస్తుందని తెలుసుకొని, ఆ రాత్రి పాలు పంపించే నాయకుడు వున్నారా? అంటే అది ఒక్క కేటిఆర్ మాత్రమే…!ఇది చాలు ఆయన మానవత్వం విలువేమిటో..ఆయనకు ప్రజల మీద వున్న మమకారం ఎంతటిదో…అంతటి అంకితభావం కల్గిన నాయకుడు కేటిఆర్ మాకు మార్గదర్శి…ఎందుకంటే జీవితంలో ఎందరో తారసపడుతుంటారు. వారంతా మనకు గుర్తు వుండరు. వారికి మనం దగ్గరకాలేము…కాని కొందరు మాత్రమే మనమీద బలమైన ముద్ర వేస్తారు. నాపై కూడా మంత్రి కేటిఆర్ ముద్ర వుందని గొప్పగా చెప్పుకుంటాను. ఆయన అడుగులు, ఆచరణలు , ఆయనకు మురింత దగ్గర చేశాయి. అలాంటి వ్యక్తిత్వం నిండిన నాయకులు తెలంగాణలో కొద్ది మంది మాత్రమే వుంటారు. అందుకు కేటిఆర్ సచ్చీలమైన నాయకత్వం నాకు స్పూర్తిదాయకమయ్యాయి. మంచితనం, మానవత్వం నిండిన కేటిఆర్ నాయకత్వం తెలంగాణ మీదనే బలమైన ముద్ర వేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజలకు అనునిత్యం అండగా వుండే నాయకుడు ఎవరు అని అడిగితే నేటితరం యువత చెప్పే ఏకైక మాట కేటిఆర్. అంతగా యువతలో ఆయనకు అంతగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రజలంటే ఆయనకు విశ్వాసం. ఆయనంటే ప్రజలకు నమ్మకం.
తెలంగాణ ప్రగతిలో ఇంతగా పరుగులు పెడుతోందంటే అందుకు ఒక కారణం మంత్రి కేటిఆర్.
నేను స్వతహాగా వ్యాపార రంగంలో వున్న వ్యక్తిని. నేను తెలంగాణ మొత్తం తిరుగుతుంటాను. తెలంగాణ రాకముందు సిరిసిల్ల ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుంది? సరే అది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అనుకుందాం? కాని పదేళ్ల క్రితం హైదరాబాద్ ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుంది? పోల్చుకుంటేనే ఆశ్చర్యమనిపిస్తుంది. నాటి రోజులు గుర్తు చేసుకుంటే హైదరాబాద్ ఎంతగా అభివృద్ది చెందిందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రగతి మన కళ్ల ముందు కనిపిస్తున్నా, ప్రతిపక్షాల నాయకులకు అవి కనిపించకపోవడం వారి దురదృష్టం. అందుకు మనమేమీ చేయలేం. కాని ప్రజలకు తెలుసు. ఒక నాడు సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అంటూ వుండేవారు. మరి నేడు అదే సిరిసిల్లను సిరుల సిల్లను చేశాడు. సిరిసిల్లను సింగారించారు. ఎటూ చూసినా పచ్చదనం నింపారు. అడుగడుగునా ప్రగతి ముద్రలు వేశారు. టెక్స్టైల్స్ హబ్‌గా మార్చారు. ఇదంతా తెలంగాణ రావడం మూలంగానే సాధ్యమైంది. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ తేవడం వల్లనే ఆవిషృతమైంది. అందులో కేటిఆర్ భాగస్వామ్యం ఎంతో వుంది. అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టమైన నాయకుడైంది. నేడు మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు. ఈ రోజు నాకు నాలో రాజకీయ, ప్రజా సేవ స్పూర్తిని నింపిన నాయకుడి గురించి నాలుగు మాటలు చెప్పే అవకాశం నాకు వచ్చింది.అందుకు ఎంతో సంతోషంగా వుంది. మంత్రి కేటిఆర్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు నిండు నూరేళ్లు జరుకొని, తెలంగాణను కొన్ని వందల రెట్లు అభివృద్దిచేయాలని మనసారా కోరుకుంటున్నాను.