భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం ఏరియా 2023-2024 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించబడిన 9.39లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 10.83లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 115% ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం జరిగినది అని అదే విధముగా 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 59.31 లక్షల టన్నులకు గాను 67.61 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 114 శాతం ఉత్పత్తి లక్ష్యం సాదించమని మరియు రోడ్డు మరియు రైల్ ద్వారా 12.45 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగినది అదే విధముగా 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 77.06 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగినది అని కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలేం రాజు గారు పత్రిక ప్రకటనలో భాగంగా తెలియజేసారు.
కొత్తగూడెం ఏరియా ఇప్పటి వరకు 526 వారసులకు కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగ అవకాశాలు కల్పించటం జరిగినధి మరియు 58 మంధికి ఉద్యోగం బదులు ఏక మొత్తం చెల్లించటం జరిగినది. ఒకరికి నెలవారి బృతి మంజూరు చేయటం జరిగినది. ప్రియతమ ముఖ్య మంత్రి ఆదేశానుసారం 10 లక్షల వరకు ఇంటి రుణం పై వడ్డీ ని కొత్తగూడెం ఏరియా 373 దరఖాస్తులకు గాను 352 మంది మంజూరు పత్రాలు అందచేశామని, మిగిలిన 21 సరైన పత్రాలు సమర్పించినచో మంజూరు పత్రాలు అందచేస్తామని తెలిపారు. అదే విధముగా10 లక్షల వరకు ఇంటి రుణం పై వడ్డీ కొరకు మంజూరు పత్రాలు తీసుకొన్న వారు 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను మే నెల నుండి సెప్టెంబర్ నెలలో చెల్లించు వారితో కలుపుకొని 288 మందికి ఇవ్వడం జరిగింది. మిగిలిన వారికి సరైన పత్రాలు సమర్పించినచో సెప్టెంబర్ నెలలో ఇవ్వటం జరుగుతుంది అని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో జిఎం ఎం. షాలెం రాజు.తో పాటు ఎస్ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏజిఎం (ఈ&ఎం) దుర్గా ప్రసాద్, ఏజిఎం (సివిల్) సిహెచ్.రామకృష్ణ, ఏజిఎం (ఫైనాన్స్) కే. హాన సుమలత, ఏజెంట్ పివికే.5ఇంక్లైన్ బి. రవీందర్, పర్సనల్ మేనేజర్ బి. శివ కేశవరావు, డిజిఎం (ఐఈడి) ఎన్. యోహన్, సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ బి. తౌర్య సింగరేణి సేవ సమితి కొ- ఆర్డినేటర్ సాగర్ మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంధి పాల్గొన్నారు.