`ప్రైవేటు కాంప్లెక్స్ కట్టేశాడు?
`అమ్ముకొని కోట్లు వెనకేసుకున్నాడు?
`అడిగేవారు లేరు…అధికారులు కూడా అమ్ముడుపోయారు?
`సొసైటీ స్థలంలో ప్రైవేటు నిర్మాణంపై కేసులు!
`అక్రమ కట్టడాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు?
`అయినా అమలు కాలేదు?
`ఫ్లాట్ల అమ్మకాలు ఆగలేదు?
`జరిగి ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి ఫైల్ అక్కడే!
`కొట్లాడుతున్న వారి చెప్పులు అరడగమే! వారిది అరణ్యరోధనే!!
`ఇప్పటికైనా స్పందిస్తారా? మేమింతే…అమ్ముడుపోయామని చెబుతారా?
`వందల గజాల స్థలం కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించి, అప్పార్టుమెంట్లు నిర్మిస్తే వదిలేస్తారా?
హైదరాబాద్,నేటిధాత్రి: స్థలాలు కాజేయడంలో ఆయన దిట్ట. ఇది జనం మాట. జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ ఏరియాలో అందరూ అనుకునే ముచ్చట. ఆయన ఆక్రమించిన భూ పరంపరలో అన్ని వివాదాలే…జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబరు ఐదులో పిల్మ్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆరువందల గజాల స్థలం కేటాయించారు. అందరూ దాని గురించి మర్చిపోయారు. కానీ పిల్మ్ నగర్ క్లబ్ కీలక పాత్రదారి మాత్రం టైం చూసి ఎలా దాన్ని సొంతం చేసుకోవాలా? అన్న దాని మీదే నిమగ్నమయ్యాడు. అనుకున్నది అమలు చేశాడు. సమయం చూసి దర్జాగా అక్కడ అప్పార్ట్ మెంట్ నిర్మాణం చేశాడు. అమ్మేశాడు. దానికి ఎవెన్యూ అనేశాడు. సహజంగా అప్పార్టుమెంట్ అంటే రూల్స్ వేరు. అవెన్యూ నిర్మాణం రూల్స్ వేరు. ఆ నిర్మాణానికి ఎంత కాల మైన సదరు వ్యక్తే ఓనరుగా వుంటాడు. అక్కడ కూడా తన తెలివితేటలు వినియోగించాడు. అయితే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టడం చట్టరిత్యా నేరం. దీనిని ప్రతిఘటిస్తూ కొందరు జిహెచ్‌ఎంసికి పిర్యాదు కూడా చేశారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లింది. ఆ నిర్మాణం కూల్చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు జీవో కూడా విడుదల చేశారు. కానీ జివో అమలు కాలేదు. నిర్మాణం ఆగలేదు. జరిగిన నిర్మాణం కూల్చేలేదు. ప్లాట్ల నిర్మాణం జరిగిపోయింది. అమ్మకాలు కూడా పూర్తయ్యాయి. ఇది గడిచి రెండేళ్లకు పైగా అవుతున్నా అధికారులు కదిలింది లేదు. అటు వైపు చూసింది లేదు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసింది లేదు. ఇలా అధికార యంత్రాంగం అక్రమార్కలకు సహకరిస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తున్నారు. అదే జూబ్లీ హిల్స్ లోని అంబేద్కర్ నగర్ లో పేదలు కొన్ని దశాబ్దాల క్రితం వేసుకున్న గుడిసెలు రాత్రికి రాత్రే తొలగించారు. ఓ వైపు బోరున వర్గం కురుస్తున్న సమయంలో అర్థరాత్రి వేళ పేదలకు ఇండ్లు ఖాళీ చేయించారు. కానీ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో ఓ బడా వ్యక్తి ఎవెన్యూ నిర్మాణం చేసి, దర్జాగా కోట్లకు అమ్ముకున్నాడు. దీని వైపు మాత్రం అధికారులు చూడరు. జీవో అమలు చేయరు. పేదలపైనే అధికారుల ప్రతాపం. ఈ నిర్మాణం అక్రమమని కొంత మంది కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు కదలడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, అధికారుల అలసత్వం గ్రహించి, అక్రమ నిర్మాణం తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరగాలని కోరుతున్నారు.