నడికూడ, నేటి ధాత్రి: మండలంలోని నర్సక్కపల్లి గ్రామానికి చెందిన లటికే శ్రీనివాస్ తండ్రి లటిక రాజయ్య అనారోగ్యం పాలై వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు వెళ్లి రాజయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆపద కాలంలో ఉన్నటువంటి వారికి అండగా ఉంటానని అన్నారు. అనారోగ్యానికి కారణం అయిన విషయాన్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు,మనో ధైర్యంగా ఉండాలని,వారి కుటుంబానికి ధైర్యం ఇచ్చారు,ఇంకా ఎటువంటి అవసరం ఉన్నా గాని నన్ను తెలిపారు.ఈకార్యక్రమంలో చిరంజీవి,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటా నాగుర్ల
