అమ్మను మైమరిపిస్తున్న టీచరమ్మ

నడికూడ,నేటి ధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నిగ్గుల శ్రీదేవి పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉండటమే కాదు ఒకటవ తరగతి విద్యార్థులను తరగతి గదిలోనికి ప్రేమపూర్వకంగా ప్రతిరోజు ఆహ్వానిస్తుంటుంది. మేడం ఒక పోస్టర్ ను తయారు చేసి తరగతి ముందు అంటించి అందులో నమస్కారం తెలియజేస్తున్న ఫోటో, షేక్ అందిస్తున్న ఫోటో, హగ్ చేసుకుంటున్నాటువంటి ఫోటో, డ్యాన్స్ చేస్తున్నటువంటి ఫోటో ఉంటుంది. పిల్లల్ని తరగతి గదిలోనికి ఆహ్వానిస్తూ ఆ ఫోటోలో ఉన్నటువంటి ఏ ఫోటోనైతే టచ్ చేస్తారో అలా టీచర్ అభినయం చేస్తూ ప్రేమ పూర్వకంగా తరగతి గదిలోనికి ఆహ్వానిస్తూ పిల్లలందరినీ ఆకర్షిస్తుంది. ఈ విధంగా చేయడం వలన టీచర్ అంటే భయం లేకుండా ఒక తల్లి లాగా భావించి విద్యార్థులు పాఠశాలకు రోజు రావడం జరుగుతుంది. తల్లిని మైమరిపిస్తున్న ఇలాంటి టీచర్ మా పాఠశాలకు రావడం మీ అదృష్టంగా భావిస్తున్నామని విద్యార్థుల విద్యాభివృద్ధికి, హాజరు శాతం పెంచడానికి కృషి చేస్తున్న నిగ్గుల శ్రీదేవి ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్ అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version