చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గత 15 రోజుల క్రితం అక్రమ సంబంధం హత్య ఘటన చోటుచేసుకుంది హత్య చేసిన నిందితుడు మల్లేశం దుబాయ్ పారిపోగా శాఖ చక్కoగా వ్యవహరించిన చందుర్తి సిఐ కిరణ్ కుమార్ ఎస్సై అశోకులు నిందితున్ని దుబాయ్ నుండి తెప్పించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు హత్య కేసును చాకసక్యంగా అతి త్వరలోనే పట్టుకున్న సీఐ కిరణ్ కుమార్ ను ఎస్ఐ అశోకుని వారి సిబ్బందిని డిఎస్పి నాగేంద్ర చారి అభినందించారు వివరాలలోకి వెళితే హత్య నేరం యొక్క సంక్షిప్త వాస్తవం ఏమిటంటే ఫిర్యాది పడిగెల లస్మవ్వ w/o కీ.శే. కొండయ్య 7/o మల్యాల, తన కొడుకు పడగేల నరేష్ కి తన ఇంటి వెనకాల ఇల్లు అయినా కొండూరి మల్లేష్ @రెడ్డి @మల్లేశం భార్యకి అక్రమ సంబంధం ఉందని అనుమానించి తరచుగా గొడవలు పడుతుండేవాడు. ఆ తరువాత గత 5 సంవత్సరాల క్రితం పడిగల నరేష్ బతుకుతెరువు గురించి దుబాయ్ వెళ్లి తిరిగి గత 15 రోజుల క్రితం ఇండియాకి రావడం జరిగింది. పడగల నరేష్ కొండూరు మల్లేష్ భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అనుమానంతో తన అన్న కొడుకైన కొండూరి లక్ష్మణ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ, పడిగేల నరేష్ ను చంపాలని ఉద్దేశంతో కొండూరు మల్లేష్ ఎవరికి తెలియకుండా గత వారం రోజుల క్రితం దుబాయ్ నుండి ఇండియాకు తిరిగి వచ్చి నరేష్ ను చంపడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఆ క్రమంలో తేదీ 13.09.2023 రోజున రాత్రి అందాది 10:30 గంటల నుండి 11:30 మధ్యన పడగేల నరేష్, కొండూరి మల్లేష్ ఇంటిలో కొండూరు మల్లేష్ యొక్క భార్యతో మాట్లాడుతుండగా, ఇట్టి విషయాన్ని తన కొడుకు లక్ష్మణ్ ద్వారా తెలుసుకొని పథకం ప్రకారం చంపాలని ఉద్దేశంతో ఇంట్లోకి వచ్చి పడిగెల నరేష్ నీ కత్తితో పొడిచి గల్ఫ్ పారిపోయినాడు. ఇట్టి విషయంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, A1. కొండూరు మల్లేష్ గల్ఫ్ కి పారిపోగ, విచారణ అధికారి A. కిరణ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చందుర్తి గారు A2. కొండూరు లక్ష్మణ్ ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించబడినది. A 1 కొండూరు మల్లేష్ అరెస్టు కొరకు గౌరవ S P రాజన్న సిరిసిల్ల గారు. దుబాయ్ దేశం యొక్క నేరస్తుల అప్పగింత ఒప్పంద కార్యాలయం కి అనుసందంగా ఉంటూ, నేరస్థున్ని తిరిగి తీసుకువచ్చే ప్రక్రియ చేస్తూ, ఈ రోజున అనగా 30.09.2023 రోజున A1 కొండూరు మల్లేష్ ని ఇండియాకి తిరిగి తీసుకువచ్చి రిమాండ్ కి తరలించడం జరిగింది.
