వనపర్తి నేటిధాత్రి :
రాష్ట్ర తెలంగాణ తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో గాంధీ చౌక్ లో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబుపై ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకున్నా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటయ్య యాదవ్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిమల్ల అశోక్ నాయకులు ఎండి గౌస్ ఎండి దస్తగిరి నందిమల్ల రమేష్ ఫజల్ వాహిద్ కొత్త గొల్ల శంకర్ యాదవ్ నాగన్న యాదవ్ ఆవుల శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
