జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా లోని శ్రీరాంపూర్ కాలనీ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ లో ఓబి కాంట్రాక్టుగా విధులు నిర్వహిస్తున్న వీరస్వామి గౌడ్ (50) ఉరి వేసుకుని శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.
తోటి కాంట్రాక్టు ఉద్యోగుల కథనం ప్రకారం మృతిచెందిన వీరస్వామి గౌడ్ సూర్యాపేటకు జిల్లాకు చెందిన వ్యక్తి.
గత 20 సంవత్సరాలుగా సీఆర్ఆర్ కాంట్రాక్టు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారని, రెండు రోజులుగా కంపెనీ వారు విధుల్లోకి తీసుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.