బిఆర్ఎస్ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి

పరకాల నేటిధాత్రి(టౌన్)
భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో యువకులను ఎకం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం బిఆర్ఎస్ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరధామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన బిఆర్ఎస్ పరకాల పట్టణ కమిటీ అధ్యక్షులు డాక్టర్.మడికొండ శ్రీను సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్బంగా డాక్టర్. మడికొండ శ్రీను మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహనీయుడని, సుభాష్ చంద్రబోస్ జీవితచరిత్రను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్, పోరండ్ల సంతోష్, మార్క ఉమాదేవి రఘుపతి,పిఏసీఎస్ డైరెక్టర్ పంచగిరి శ్రీనివాస్,బిఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు ఎండీ. బియ్యబాని, మోలుగురి శ్రీనివాస్, దుప్పటి సుజయ్ రానా, బండి రమేష్ గౌడ్, బండి నరేష్ గౌడ్, బొచ్చు భాస్కర్, రత్న శైలెందేర్, బొచ్చు అంజి, దెయ్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version