తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేమసారం.తిరుపతి డిమాండ్
నేటిదాత్రి మంచిర్యాల ప్రతినిధి తెలంగాణ ఎరుకల ప్రజా సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఉండ్రాల ఎల్లయ్య ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి విచ్చేశారు. వారు విచ్చేసి ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఎరుకల కుటుంబానికి ఎరుకల బంధు నమోదు చేసి లక్ష రూపాయలు వర్తించే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో ఎరుకల కులస్తులకు వర్తింపజేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకల కులస్తుల కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎరుకల కులస్తులకు రుణాలు ఇవ్వాలని, ప్రతి మండల కేంద్రంలో ఎరుకల కులస్తుల కోసం కమిటీ హాల్ కోసం ఐదు గుంటల స్థలం కేటాయించాలని, ప్రభుత్వ బంజరు భూమిలో ఎరుకల కులస్తులకు ఈత వనం పెంచే విధంగా స్థలం కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకల కుటుంబాలకు ఊరికి చివరన ఐదుగుంటల స్థలం కేటాయించాలని వారు పేర్కొన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా ఎరుకల కులస్తుల సమస్యల గురించి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి అశోక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తిరుపతి సంపత్ మంచిర్యాల జిల్లా నాయకులు జగన్నాథల బాబు జగన్నాథుల మహేష్ కుమార్ అంజి సంతోష్ శారదా సురేష్ పద్మా రాజేశ్వరి స్వప్న పోచమ్మ మదనమ్మ మంచిర్యాల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు
