చిల్పూర్( జనగామ)నేటి ధాత్రి:
తెలంగాణ ఈ పంచాయతీ టెక్నికల్ విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనగాం జిల్లాలోని ఈ పంచాయతీ టెక్నీషియన్స్ సోమవారం జనగాం జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీ అధికారికి వారి సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పట్టవలసి వస్తుందని జిల్లా ఈ పంచాయతీ టెక్నీషియన్సు డిపిఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ఈ వారంలో సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని జనగాం జిల్లా ఈ పంచాయతీ ఆపరేటర్లు వినతి పత్రాలు అందజేశారు.
