ఎండపల్లి,(జగిత్యాల), నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి తమ యొక్క సమస్యల పరిష్కారం కొరకు, జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ కి వందలాదిగా తరలివస్తున్నారు తదుపరి దరఖాస్తులు తీసుకున్నటువంటి అధికారులు, అంతర్జాలంలో నమోదు చేసుకొని,నమోదు చేసినట్టుగా వారికి మొబైల్ ద్వారా మెసేజ్ పంపిస్తున్నారు,కానీ ఇంతవరకు బాగానే ఉన్నా ప్రజలు వివిధ సమస్యల పైన ఇచ్చిన దరఖాస్తు ఎక్కడకు చేరింది ఎప్పుడు పూర్తి అవుతుంది పర్యవేక్షణ అధికారి ఎవరు, సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనే సమాధానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి గత నెల రోజులుగా ప్రజాభవన్లో ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి హైదరాబాద్ నగరానికి విచ్చేసి ఎలాగైనా ప్రజా భవన్ లో దరఖాస్తు సమర్పిస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని కోరికతో నమ్మకంతో ఇచ్చి వెళ్తున్నారు ఇలా ఉంటే ప్రజాభవన్లో సమస్యల పరిష్కారానికి పారదర్శకత ఉంటే బాగుంటుందని పలువురు చర్చించుకోవడం విశేషం,మరియు జిల్లా కేంద్రాలలో కూడా కలెక్టర్ పర్య వేక్షణలో ప్రతి సోమవారం ప్రజా వాణి నిర్వహిస్తున్నారు కానీ అంతంత మాత్రంగానే ఉంది,
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల విశ్వాసం పొందాలన్నా నమ్మకాన్ని కాపాడుకోవాలన్నా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు ఎప్పుడు ఇచ్చారు ప్రస్తుతం అది ఏ దశలో ఉంది పూర్తి సమాచారం వెంట వెంటనే అందిస్తే ఇటు అధికారుల పైన ప్రభుత్వం పైన నమ్మకం ఏర్పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వేచి చూడాలి మరి ? ప్రజా భవన్ లో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఏ చర్యలు తీసుకుంటారో,లేక ప్రజల నమ్మకాన్ని దూరం చేసుకుంటారో వేచి చూడాలి మరి ?