వీణవంక.(కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలోని కొండపాక గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి భక్తులు ఇంటింటికి జైశ్రీరామ్ అంటూ నినాదాలు అనుకుంటూ అయోధ్య రాముని అక్షింతలను ప్రతి ఇంటికి తిరుగుతూ అక్షింతలను అందించారు. రామభక్తులు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ.. స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు చిట్టి మల్ల హరిబాబు, బల్లు విట్టల్, మాజీ సర్పంచ్ దాట్ల మంగ, కాసర్ల అనిల్, మ్యాడగొని శ్రీనివాస్ ,శ్రీనివాస్ రెడ్డి, కొలుగురి రమేష్, పెద్దపల్లి రాజయ్య, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
